ఒక్కొక్క కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రూ.10 లక్షల ఎక్స్ గ్రేషియా ను అందజేయడం

 చిత్తూరు, మే 13 (ప్రజా అమరావతి): ఈ నెల 10న తిరుపతి రుయా ఆసుపత్రిలో జరిగిన దుర్ఘటనలో మృతి చెందిన 11 మందికి చెందిన వారి కుటుంబ సభ్యులకు ఒక్కొక్క కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రూ.10 లక్షల ఎక్స్ గ్రేషియా ను అందజేయడం జరుగుతున్నదని జిల్లా కలెక్టర్ ఎం. హరి నారాయణన్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. మృతి చెందిన వారిలో డి. షాహిత్ (27) వరదయ్యపాలెం, కె. బాబు (55) తిరుపతి, జి. భువనేశ్వర్ బాబు (36) చిత్తూరు, ఎం. రాజమ్మ (71) నెల్లూరు జిల్లా, బి. మునీర్ (49) గుర్రంకొండ, బి. దేవేంద్ర (58) యర్రావారిపాలెం, ఎస్. ఫజీలుల్లా (41) కలికిరి, ఏ. వెంకటసుబ్బయ్య (28) రాజంపేట (కడప జిల్లా), తనూజరాణి (48) గాజులమండ్యం, పి. ఘౌస్ బాష (37) పుంగనూరు, ఎస్.కె. మహమ్మద్ బాష (49) తిరుపతి వారు కలరని, నెల్లూరు, కడప జిల్లాలకు చెందిన బాధిత కుటుంబ సభ్యులకు ఎక్స్ గ్రేషియా ను సంబంధిత జిల్లాల కలెక్టర్లచే అందజేయడం జరుగుతుందని కలెక్టర్ ఆ ప్రకటనలో తెలిపారు.  


Comments