జిల్లా లో ఇప్పటి వరకు 6,66,329 వ్యాక్సిన్ వెయ్యడం జరిగింది

 

విజయవాడ (ప్రజా అమరావతి);జిల్లా లో ఇప్పటి వరకు 6,66,329 వ్యాక్సిన్ వెయ్యడం జరిగిందిగత రెండు వారాల్లో 4,245 మంది హోమ్ ఐసోలేషన్ కిట్స్ అందించాము.


4,394 మంది కోవిడ్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు - 


కలెక్టర్ ఇంతియాజ్


కృష్ణా జిల్లాలో కరోనా నియంత్రణ కోసం రెవిన్యూ, పోలీసు అధికారులు ఇతర శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటూ న్నట్లు జిల్లా కలెక్టర్ ఏ ఎండి ఇంతియాజ్ తెలిపారు.


సోమవారం రాత్రి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాధ్ దాస్, స్పెషల్ సీఎస్, కె ఎస్ జవహర్ రెడ్డిలు టీం కృష్ణా తో కోవిడ్ పై జూమ్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఇంతియాజ్ , జిల్లాలో కోవిడ్ పరిస్థితులు, టెస్టులు, వ్యాక్సినేషన్ , బెడ్స్, ఆక్సిజన్ తదితర అంశాలపై వివరాలు అందచేశారు.  జిల్లాలోని 76 కోవిడ్ ఆసుపత్రులలో 4,394 బెడ్స్ ద్వారా చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. వాటిలో 743 ఐసీయూ బెడ్స్ విత్ ఆక్సిజన్ , 1985 ఐసీయూ విత్  నాన్ ఆక్సిజన్ బెడ్స్ , 1666 సాధారణ బెడ్స్ పై భాదితులకు చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. ఇంకా జిల్లాలో 291 బెడ్స్ అందుబాటులో ఉన్నాయన్నారు.  వాటిలో నాన్ ఐసీయూ, జనరల్ బెడ్స్ ఉన్నట్లు తెలిపారు. జిల్లాలో ఏప్రిల్ 28 నుంచి ఈ రోజు వరకు మొత్తం 4,245 మందికి హోమ్ ఐసోలేషన్ ఉన్నారని, వారికి ఉచితంగా కిట్స్ పంపిణీ చేయడం జరిగిందన్నారు. ఈ రోజు 413 మంది హోమ్ ఐసోలెషేన్ కి ఆసక్తి చూపారన్నారు. ఈ రోజు 706 మందికి హోమ్ ఐసోలెషేన్ కిట్స్ ఉచితంగా పంపిణీ చేయడం జరిగిందన్నారు. రెడ్, గ్రీన్, బ్లూ కేటగిరీలుగా ప్రజలను గుర్తించే వ్యాక్సినేషన్  ప్రక్రియను వేగవంతం చెయ్యడం జరుగుతున్నట్లు వివరించారు.


జాయింట్ కలెక్టర్ ఎల్ .శివశంకర్ మాట్లాడుతూ, జిల్లాలో ని గత రెండు మూడు రోజులుగా ఆక్సిజన్ ప్లాంట్ లను తనిఖీ చేస్తున్నాట్లు తెలిపారు. ఈ రోజు శివ శక్తి ఏజెన్సీ పరిధిలో తనిఖీ చేశామని, వారి నుంచి లిక్విడ్ ఆక్సిజన్ కొరకు ప్రతిపాదనలు కోరినట్లు తెలిపారు. నిన్న ఇబ్రహీంపట్నం పరిధిలో 12.7 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ఉత్పత్తి పై చర్యలు తీసుకుంటామని తెలిపారు.


ఈ సమావేశంలో డీఎంహెచ్ ఓ డా.ఎం.సుహాసిని, డీఎల్ఓ డా.ఉషారాణి,  డిసిహెచ్ఎస్ డా.జ్యోతిర్మణి, డీప్యూటీ డీఎంహెచ్ ఓ డా.ఇందుమతి, డా. నవీన్ తదితరులు పాల్గొన్నారు.

Comments