శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి,
విజయవాడ (ప్రజా అమరావతి):
ప్రస్థుతము దేశములో కరోనా తీవ్రత ఉదృతముగా ఉన్నకారణముగా దేవదాయ ధర్మదాయ శాఖ, ఆంధ్రప్రదేశ్ వారి ఉన్నతాధికారుల ఆదేశముల మేరకు లోకకళ్యాణార్ధం మరియు కరోనా మహమ్మారి నిర్మూలింపబడి ప్రజలు అందరు ఆయురాగ్యములతో సుభిక్షముగా ఉండుటకు గాను శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి, విజయవాడ నందు దేవస్థాన వైదిక కమిటీ సూచనల మేరకు ది:9-5-2021 నుండి ది.15-5-2021 వరకు దేవస్థాన యాగశాల యందు శ్రీ దన్వంతరి, గణపతి మరియు మృత్యుంజయ హోమం లు ప్రతిరోజు ఉదయం 7-00 గం.లకు నుండి ఉ.11-00 గం.లకు నిర్వహించుటలో భాగముగా ఈరోజు అనగా ది.11 -05-2021 న ఆలయ వేదపండితులు మరియు అర్చక బృందంచే ఈరోజు శ్రీ విఘ్నేశ్వర స్వామి పూజ, పుణ్యాహవచనము, మండపారాధన, అగ్ని ప్రతిష్టాపన, లక్ష్మీగణపతి, మృత్యుంజయ, ధన్వంతరి, శీతల దుర్గా హోమములు శాస్త్రోక్తంగా నిర్వహించడం జరిగినది.
ది:9-5-2021 నుండి ది.15-5-2021 వరకు లోకసంరక్షణార్థము సంకల్పించిన ఈ కార్యక్రమములు ది:15-5-2021 న ఉదయం 11 గం.లకు జరుగు మహా పూర్ణాహుతి తో ఈ కార్యక్రమము దిగ్విజయంగా సమాప్తి అగునని ఆలయ స్థానాచార్యులు వారు ఒక ప్రకటన లో తెలిపియున్నారు.
addComments
Post a Comment