ఆర్ఐఎన్ఎల్' ఆంధ్రప్రదేశ్ ప్రజల గుండె చప్పుడు : పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి.

 

అమరావతి (ప్రజా అమరావతి);



ఆర్ఐఎన్ఎల్' ఆంధ్రప్రదేశ్ ప్రజల గుండె చప్పుడు : పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి.


ప్రభుత్వం ఏర్పడిన రెండేళ్లలో.. ఏడాదిన్నర కాలం కరోనా నియంత్రణకై నిరంతర పోరాటం : పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి.


కరోనా విపత్తు సమయంలో ప్రభుత్వ, ప్రైవేట్ పరిశ్రమలు ప్రజలకు సేవలందించడానికి స్వతంత్రంగా ముందుకు రావడం మంచి పరిణామం.


సరైన సమయంలో స్పందించిన ప్రతి పరిశ్రమ, సంస్థకు కృతజ్ఞతాభినందనలు.


సీఎస్ఆర్ నిధుల ద్వారానే కాకుండా అనేక మార్గాల్లో ప్రజలకు వసతులు సమకూరుస్తున్న విధానం వెలకట్టలేనిది.


కఠిన పరిస్థితుల్లో 'ఆర్ఐఎన్ఎల్'  ప్రజల హృదయాలలో నిలిచిపోయేలా సేవలందిస్తోంది.


ప్రాణవాయువును అందిస్తూ ప్రజల ప్రాణానికి ప్రాణంగా మారింది.


ఆదర్శనీయ చొరవతో సేవలందిస్తోన్న ఆర్ఐఎన్ఎల్ సీఎండీ, సిబ్బందికి మనసారా అభినందనలు.


ఆక్సిజన్ ఉన్న అంబులెన్సులు, ఆక్సిజన్ బెడ్లు, ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు, ఆక్సిజన్ ఫ్లో మీటర్లు, వీల్ ఛైర్లు వంటి అత్యాధునిక సదుపాయాలు కరోనా నియంత్రణలో మరింత ప్రభావం చూపుతాయ్.


ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం ఏర్పడిన 24 నెలల్లో 18 నెలల కాలం కోవిడ్-19పై యుద్ధం చేస్తోంది.


ప్రజలకేం కావాలో ముందే అంచనా వేసుకుంటూ అవగాహన కలిగిస్తూ ఏపీ ప్రభుత్వం ఆదర్శనీయంగా ముందుకు సాగుతోంది.


ఆర్ఐఎన్ఎల్ ఆధ్వర్యంలో నిర్మితమైన  విశాఖ 1000 పడకల ఆస్పత్రి  మొదటి ఫేజ్ ప్రారంభం సందర్భంగా పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి కామెంట్స్. 


వర్చువల్ గా ప్రారంభించిన కేంద్ర న్యాచురల్ గ్యాస్, పెట్రోలియం, ఉక్కు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్.


వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరైన కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి ఫగ్గాన్ సింగ్  కులస్తే.


శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా మంత్రి క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరైన పరిశ్రమలశాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి.


హాస్పిటల్ ప్రారంభోత్సవానికి హాజరైన ఉపముఖ్యమంత్రి, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్ (ఆళ్ల నాని) , గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి, పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు,  రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి, అనకాపల్లి లోక్ సభ నియోజకవర్గ ఎంపీ బి.వి సత్యవతి, విశాఖపట్నం ఎంపీ ఎం.వీ.వీ సత్యనారాయణ, ఆర్ఐఎన్ఎల్ సీఎండీ ప్రదోష్ కుమార్ రాత్, ఆర్ఐఎన్ఎల్ డైరెక్టర్ కిశోర్ చంద్రదాస్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ , విశాఖపట్నం కలెక్టర్ వినయ్ చంద్, కోవిడ్-19 ప్రత్యేక  అధికారి, కృష్ణబాబు,  గురజాడ కళాక్షేత్రం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆర్ఐఎన్ఎల్ ప్రతినిధులు, విశాఖ మేయర్ గొలగాని హరి వెంకటకుమారి, ఇతర అధికారులు.



Comments