కరోనాతో మరణిస్తే వారి మృతదేహాలను తరలింపుకు ఉచితంగా వాహనాల ఏర్పాటు. చిలకలూరిపేట (ప్రజా అమరావతి);
కరోనాతో చిలకలూరిపేట పట్టణంలో ఎవరైనా మరణిస్తే వారి మృతదేహాల తరలింపునకు మున్సిపాలిటీ తరుపున వాహనాలు ఏర్పాటు చేశామని చిలకలూరిపేట శాసనసభ్యురాలు విడదల రజిని గారు తెలిపారు. స్థానిక ప్రభుత్వాస్పత్రిని,టిడ్కో కేర్ సెంటర్ ని సోమవారం ఎమ్మెల్యే విడదల రజిని గారు ఆకస్మికంగా తనిఖీ చేశారు. కరోనా మరణాలపై ఆమె మాట్లాడుతుండగా మృతదేహాల తరలింపు విషయంలో తలెత్తుతున్న సమస్యలను నాయకులు ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకొచ్చారు. స్పందించిన శాసనసభ్యురాలు విడదల రజిని గారు ఇకపై మున్సిపాలిటీలో కరోనా వల్ల ఎవరైనా ఎక్కడైనా చనిపోతే... ఉచితంగా సేవలు అందించాలని చెప్పారు. మృతుల కుటుంబాల నుంచి ఒక్క రూపాయి కూడా వసూలు చేయడానికి వీల్లేదని ఆదేశించారు.
వాహనాల కొరకు సంప్రదించవలసిన నంబర్లు:
మస్తాన్ రెడ్డి: 9951079006
రవి కుమార్: 9948923050
ఏ.శ్రీనివాసరావు: 9849907942
addComments
Post a Comment