రైతులు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు: ఏపీ డెయిరీ డెవలప్ మెంట్ కో-ఆపరేటివ్ ఫెడరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ అహ్మద్ బాబు (ఐఏఎస్).


విజయవాడ (ప్రజా అమరావతి);.


రైతులు ఎటువంటి ఆందోళన చెందాల్సిన  అవసరం లేదు:  ఏపీ డెయిరీ డెవలప్ మెంట్ కో-ఆపరేటివ్ ఫెడరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ అహ్మద్ బాబు (ఐఏఎస్).


విజయవాడ, 3 ఏప్రిల్: సంగం డైరీ యొక్క రోజువారీ కార్యకలాపాలు యధావిధిగా జరుగుతున్నాయని, రైతులు ఎటువంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని ఆంధ్రప్రదేశ్ డెయిరీ డెవలప్ మెంట్ కో-ఆపరేటివ్ ఫెడరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ అహ్మద్ బాబు (ఐఏఎస్) ఒక ప్రకటనలో తెలిపారు. సుమారు లక్ష మంది  పాల ఉత్పతిదారులకు చెల్లించవలసిన బకాయిలు దాదాపు రూ.14 కోట్లు చెల్లించడం జరిగిందని, 771 మంది పర్మినెంట్ ఉద్యోగులకు ఏప్రిల్ నెల జీతాలు చెల్లించడం జరిగిందని మరియు 415 మంది ఒప్పంద ఉద్యోగులకు వారి  ఏప్రిల్ నెల జీతాలు రేపు చెల్లించబడతాయన్నారు. ఈరోజు 4.96 లక్షల లీటర్ల పాలు డైరీకి రావడం జరిగిందని, వాటిని ప్రాసెస్ చేసి యధావిధిగా మార్కెటింగ్ చేశామన్నారు. సంగం డైరీ యొక్క రోజువారీ కార్యకలాపాలు నిరాటంకంగా జరుగుతున్నందున పాల ఉత్పతిదారులు గానీ,   కాంట్రాక్టర్లు గానీ ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని  తెలిపారు. 



Comments