జగనన్న స్వచ్చసంకల్పం' పై గ్రామ సర్పంచ్‌లకు శిక్షణా తరగతులు.

 *- 'జగనన్న స్వచ్చసంకల్పం' పై గ్రామ సర్పంచ్‌లకు శిక్షణా తరగతులు*


*-  శిక్షణా కార్యక్రమాన్ని ప్రారంభించిన రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, భూగర్భగనుల శాఖ మంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి*

*- ఆన్‌లైన్ శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న వైయస్‌ఆర్ కడప, చిత్తూరు జిల్లాల జెడ్పీ సిఇఓ, డిపిఓ, డ్వామా పిడి, ఎంపిడిఓ, పంచాయతీ ఇఓ, గ్రామ సర్పంచ్‌లు*

*- తాడేపల్లి సిపిఆర్‌ కార్యాలయం నుంచి ఆన్‌లైన్ శిక్షణా కార్యక్రమంలో పాల్గొన్న పిఆర్ అండ్ ఆర్డీ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేది, పిఆర్ కమిషనర్ ఎం.గిరిజాశంకర్, స్వచ్చాంధ్ర ఎండి సంపత్‌కుమార్, పలువురు అధికారులు.*

గుంటూరు (ప్రజా అమరావతి): గ్రామ సర్పంచ్‌లకు ఏర్పాటు చేసిన ఆన్‌లైన్ శిక్షణా కార్యక్రమాలను ప్రారంభిస్తూ... తొలిరోజు ఆన్‌లైన్‌ కాన్ఫెరెన్స్‌లో పాల్గొన్న వైయస్‌ఆర్ కడప, చిత్తూరు జిల్లాల అధికారులు, గ్రామ సర్పంచ్‌లను ఉద్దేశించి  రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, భూగర్భగనుల శాఖ మంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ

 జూలై 8 మహానేత స్వర్గీయ వైయస్‌ రాజశేఖరరెడ్డి గారి జయంతి నాడు 'జగనన్న  స్వచ్ఛసంకల్పం' ను ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ ప్రారంభించనున్నారు. 

పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన గ్రామాలే మన లక్ష్యం కావాలి.

గ్రామాల్లో పరిశుభ్రత, స్వచ్ఛతకు పెద్దపీట వేస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం అమలు చేస్తోంది.

ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పంచాయతీల్లో ఇందుకు గానూ సన్నాహక కార్యక్రమాలు జరుగుతున్నాయి.

సీఎం శ్రీ వైయస్ జగన్ గారి చేతుల మీదిగా అధికారికంగా ప్రారంభమయ్యే జగనన్న స్వచ్ఛసంకల్పం కార్యక్రమం నాటికి గ్రామాల్లో అందుకు అన్ని విధాలుగా అవసరమైన వనరులను సమకూర్చుకోవాలి.

గ్రామ సర్పంచ్‌ల భాగస్వామ్యం అందుకు కీలకం. 

సర్పంచ్‌ల సారథ్యంలో స్వచ్ఛమైన పల్లెలను సృష్టించుకుందామన్న మంత్రి.

కోవిడ్ మన గ్రామ పొలిమేరల్లోకి రాకుండా చూసే బాధ్యత మీదేనని, ఇందుకు అందరూ బాధ్యతగా వ్యవహరించాలన్న మంత్రి.

ప్రజలు గ్రామ సర్పంచ్‌లపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకునే సమయం ఇదేనని గుర్తు చేసిన మంత్రి.

ప్రజల్లో అవగాహన పెంచడం ద్వారా  గ్రామాలను ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు సిద్దం కావాలని పిలుపునిచ్చిన మంత్రి.

గ్రామాల్లో నూరుశాతం పారిశుధ్య నిర్వహణ జరగాలి.

ఘన, ద్రవ వ్యర్థాలను వేరు చేసి, వాటిని వ్యర్థాల నిర్వహాణా కేంద్రాలకు పంపించాలి.

వీటిద్వారా వ్యవసాయ అవసరాలకు సేంద్రీయ ఎరువులను సిద్దం చేసుకోవాలి. 

ఈ కార్యక్రమం ప్రారంభం సందర్భంగా ప్రతి రోజూ కూడా అధికారులు నిర్ధేశించిన ఫార్మాట్‌లలో ప్రగతి నివేదికనూ పంపించాలి.


*ప్రజాభాగస్వామ్యంతోనే మంచి ఫలితాలు*

ఏ కార్యక్రమం అయినా ప్రజాభాగస్వామ్యంతోనే విజయవంతం అవుతుంది.

జగనన్న స్వచ్ఛసంకల్పం అనేది మన ఇంటిని, మన గ్రామాన్ని మనమే బాగు చేసుకోవడం అనే అవగాహన ప్రజల్లో కల్పించాలి. 

దానికి అధికారులతో పాటు గ్రామ సర్పంచ్‌లు, వార్డుసభ్యులు, ఎంపిటిసి, జెడ్పీటిసిలు కూడా బాధ్యత తీసుకోవాలి.

ఒక మంచి కార్యక్రమంలో ప్రజలు భాగస్వాములు అవ్వడమే కాదు, వారి వంతుగా ఆర్థిక చేయూతను కూడా స్వచ్చందంగా అందిస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం.

గత ఏడాది జూలై 24 నుంచి ఆగస్టు 15 వరకు 1320 పంచాయతీల్లో పరిశుభ్రతా పక్షోత్సవాలు నిర్వహించాం.

దీనిలో పెద్ద ఎత్తున పాల్గొన్న ప్రజలు ఇంటికి రూ.2 చొప్పున ఇచ్చిన విరాళాలు రూ.3.83 కోట్లు.  వ్యర్థాలపై వ్యతిరేక పోరాటం పేరుతో డిసెంబర్ 2 నుంచి 21 వరకు 4737 పంచాయతీల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాం. దానిలో ప్రజలు పాల్గొని తమవంతు విరాళాలుగా రూ. 1.89 కోట్లు ఇచ్చారు. 


*కోవిడ్ మహమ్మారిని పారద్రోలండి*

కోవిడ్ విజృంభిస్తున్న దశలో తమ ప్రాణాలకు తెగించి పనిచేస్తున్నా పారిశుధ్య కార్మికులకు ధన్యవాదాలు.

వారికి చేదోడువాదోడుగా ప్రజలు సహకరించాలి.

పారిశుధ్య కార్మికులకు అండగా ప్రభుత్వం ఉంది. వారి ఆరోగ్యపరంగా పిపిఇ కిట్లు అందుబాటులో ఉంచాం. అలాగే మాస్క్‌లను కూడా వారికి పంచాయతీల్లో అందుబాటులో ఉంచాలి.

గ్రీన్‌ అంబాసిడర్స్‌కు ఇచ్చే గౌరవ వేతనం బకాయి లేకుండా చూడాల్సిన బాధ్యత ఎంపిడిఓలు తీసుకోవాలి.

అలాగే పంచాయతీల్లో పారిశుధ్య అవసరాలకు సరిపడినంత యంత్రాలు, ఇతర పరికరాలను జగనన్న స్వచ్ఛసంకల్పం ప్రారంభమయ్యే నాటికి సిద్దంగా ఉంచుకోవాలి.

గ్రామాల్లో కోవిడ్ వైరస్‌ వ్యాప్తి చెందకుండా హైపోక్లోరైడ్ ద్రావణాలను ఎప్పటికప్పుడు పిచికారీ చేయాలి.

బ్లీచింగ్ పౌడర్‌తో మురుగునీరు నిల్వ ఉండే ప్రదేశాలు, సైడ్‌ డ్రైన్‌ల వద్ద శుభ్రం చేయాలి.

సామాజిక దూరంను పాటిస్తూ, కోవిడ్ నిబంధనలను అనుసరిస్తూ గ్రామాలు కరోనా వైరస్‌కు దూరంగా ఉంటే, పల్లె ప్రజలు ఆరోగ్యంగా ఉంటారు.

ఈ ఏడాది కేంద్రప్రభుత్వం రాష్ట్రంలోని 17 పంచాయతీలకు ఉత్తమ విధానాలను అమలు చేస్తున్నందుకు పురస్కారాలు ఇచ్చింది.

కేవలం అధికారులు, కిందిస్థాయి సిబ్బంది చొరవతోనే ఇది సాధ్యమయ్యింది.

ఇప్పుడు స్థానిక సంస్థలకు ఎన్నికలు జరిగి ప్రజాప్రతినిధులు వచ్చారు. మీరు మరింత బాధ్యత తీసుకుంటే అత్యధిక పంచాయతీలు ఆదర్శంగా జాతీయ స్థాయిలో పురస్కారాలను అందుకుంటాయి.


*కరోనా కష్టకాలంలో ఉపాధితో ఊతం*

దేశమంతా కరోనాతో అల్లాడుతోంది. ఈ సమయంలో గ్రామాల్లోని కూలీలకు ఉపాధి హామీ పథకం ఊతమిస్తోంది.

గత ఏడాది లక్షల మంది కరోనా వల్ల సొంత గ్రామాలకు వచ్చారు. వీరంతా తిరిగి ఉపాధి కోసం వలసలు పోకుండా ఉపాధి హామీ ద్వారా పనులు కల్పించాలి.

అర్హులైన ప్రతి ఒక్కరికీ జాబ్‌కార్డులను జారీ చేయండి.

భౌతికదూరం పాటిస్తూ, కోవిడ్ నిబంధనల ప్రకారం పనులు చేసుకునేందుకు ప్రోత్సహించాలి.

గ్రామసచివాలయాలు, రైతుభరోసా కేంద్రాలు, బిఎంసి, ఎఎంసిలు, అంగన్‌వాడీ భవనాలు, వైయస్‌ఆర్‌ హెల్త్ క్లీనిక్‌ల నిర్మాణాలు చురుగ్గా జరుగుతున్నాయి.

ఉపాధి హామీలో లేబర్ కాంపోనెంట్ పెంచాలి. దానివల్లే మెటీరియల్ కాంపోనెంట్ పెరుగుతుంది.

చెరువుల పూడికతీతలపై కూడా ఉపాధి హామీ కింద పనులు చేపట్టేందుకు అనుమతి ఇచ్చాం. 

ఈ ఏడాది మొత్తం 27కోట్ల పనిదినాలను పూర్తి చేయాలనే లక్ష్యంతో పనిచేయాలి.

అందుకు ప్రజాప్రతినిధులుగా, గ్రామాల్లో సర్పంచ్‌లుగా మీ భాగస్వామ్యం అవసరం అని అన్నారు.

Comments