కరోనాలోనూ ఆగని ఉపాధి పనులు'

 'కరోనాలోనూ ఆగని ఉపాధి పనులు'  


 సోమవారం ఒక్కరోజే 4,04,166 మందికి ఉపాధి'.


 :జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు.


అనంతపురము, మే 10 (ప్రజా అమరావతి);


కరోనా ఉధృతిలోనూ జిల్లాలో పేద ప్రజలకు పెద్ద ఎత్తున ఉపాధి కల్పిస్తున్నామని జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు తెలిపారు. కరోనా సమయంలో ఉపాధి దొరక్క కూలీలు ఇబ్బంది పడకూడదనే లక్ష్యంతో పని చేస్తున్నామన్నారు. 


జిల్లాలో సోమవారం ఒక్కరోజే 4,04,166 మందికి ఉపాధి కల్పించామని జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు తెలిపారు. గత శనివారంతో పోలిస్తే 9264 మందికి అదనంగా ఉపాధి కల్పించామన్నారు. శనివారం 3,94,902 మంది ఉపాధి పొందారన్నారు. జాబ్ కార్డులున్న వారందరికీ ఉపాధి కల్పించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. 


మండలాల వారీగా బుక్కపట్నం, శింగనమల మండలాలు 80 శాతం పైచిలుకు లక్ష్యాన్ని చేరుకున్నాయన్నారు. బుక్కపట్నం మండలం అత్యధికంగా 82.51 శాతం లక్ష్యాన్ని చేరుకోగా, శింగనమల మండలం 81.58 శాతంతో రెండో స్థానంలో నిలిచింది. 20 మండలాలు 70 నుంచి 80 శాతం లక్ష్యాన్ని సాధించగా 31 మండలాలు 60 నుంచి 70 శాతం లక్ష్యాన్ని సాధించాయి. 7 మండలాలు 60-50 శాతం లక్ష్యాన్ని సాధించాయి. ఉరవకొండ, పుట్టపర్తి, మడకశిర మండలాలు 50 శాతం కంటే తక్కువ లక్ష్యాన్ని చేరుకున్నాయి. 


అన్ని మండలాలు 80 శాతం పైచిలుకు లక్ష్యాన్ని చేరుకునేలా ఎంపీడీవోలు, ఫీల్డు అసిస్టెంట్లు పని చేయాలని జిల్లా కలెక్టర్ అదేశించారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఉపాధి హామీ పనులు కొనసాగించాలని, 6 లక్షల మందికి పైగా  ఉపాధి కల్పించేలా పనిచేయాలన్నారు. 


Comments