గుడివాడ డివిజన్లో 1.10 లక్షల డోసుల వ్యాక్సినేషన్ చేశాం

 

- గుడివాడ డివిజన్లో 1.10 లక్షల డోసుల వ్యాక్సినేషన్ చేశాం 


- కర్ఫ్యూను పటిష్టంగా అమలు చేస్తున్నాం 

- కరోనా సెకండ్ వేలో 1,327 మంది రికవరీ 

- కోవిడ్ కేంద్రంలో మెరుగైన వైద్యం అందిస్తున్నాం 

- రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని 


గుడివాడ, జూన్ 12 (ప్రజా అమరావతి): గుడివాడ డివిజన్ పరిధిలో ఇప్పటి వరకు ఒక లక్షా 10 వేల 389 డోసుల వ్యాక్సినేషన్ పూర్తయినట్టు రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) చెప్పారు. కృష్ణాజిల్లా గుడివాడ పట్టణం రాజేంద్రనగర్లోని నివాసంలో మంత్రి కొడాలి నానిని గుడివాడ టూటౌన్, తాలూకా సీఐలు కలిశారు. ఈ సందర్భంగా మంత్రి కొడాలి నాని కర్వ్యూను పటిష్టంగా అమలు చేయాలని ఆదేశించారు. గుడివాడ డివిజన్ పరిధిలోని మోటూరు, వెంట్రప్రగడ, యలమర్రు, రామాపురం, రుద్రపాక, పామర్రు, నిమ్మకూరు, కనుమూరు, జమీగొల్వేపల్లి, గుడ్లవల్లేరు, కవుతరం, ముదినేపల్లి, గురజ, దేవపూడి, కలిదిండి, కోరుకొల్లు, సీతనపల్లి, కొల్లేటికోట, మండవల్లి, గుడివాడ పట్టణంలోని పీపీ యూనిట్, బాపూజీనగర్, ఎన్టీఆర్ కాలనీ, బేతవోలు కేంద్రాల్లో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని వేగవంతం చేశామన్నారు. హెచ్సీ వర్కర్లు 1,781 మందికి కొవిషీల్డ్ మొదటి డోసును, 1,719 మందికి రెండవ డోసును, ఎఫ్ఎల్ వర్కర్లు 4,137 మందికి మొదటి డోసును, 3,667 మందికి రెండవ డోసును వేశామన్నారు. 60 ఏళ్ళు పైబడిన 18 ,169 మందికి మొదటి డోసును, 13,336 మందికి రెండవ డోసును, 45 ఏళ్ళు పైబడిన 24, 192 మందికి మొదటి డోసును, 15,591 మందికి రెండవ డోసు వ్యాక్సినేషన్ పూర్తయిందని తెలిపారు. అలాగే 60 ఏళ్ళు పైబడిన 6,081 మందికి కొవాగ్జిన్  మొదటి డోసును, 4,524 మందికి రెండవ డోసును, 45 ఏళ్ళు పైబడిన 11,577 మందికి మొదటి డోసును, 5,615 మందికి రెండవ డోసును వేశామన్నారు. కరోనా సెకండ్ వేవ్ గత ఏప్రిల్ నెల్లో ప్రారంభమైందని, ఇప్పటి వరకు గుడివాడ డివిజన్ లోని గుడివాడ పట్టణం, రూరల్ మండలంలో 422 కరోనా కేసులు, గుడ్లవల్లేరు మండలంలో 139, ముదినేపల్లి మండలంలో 134, మండవల్లి మండలంలో 202, కైకలూరు మండలంలో 218, కలిదిండి మండలంలో 443, పామర్రు మండలంలో 459, పెదపారుపూడి మండలంలో 137, నందివాడ మండలంలో 116 కరోనా కేసులు నమోదయ్యాయని తెలిపారు. వీరిలో 1,327 మంది రికవరీ అయ్యారని, 783 మంది హోమ్ ఐసోలేషన్లో ఉంటూ చికిత్స పొందుతున్నారని, 117 మందికి వైద్యం అందిస్తున్నామని చెప్పారు. కాగా గుడివాడ ఏరియా ప్రభుత్వాసుపత్రిలో ఏర్పాటు చేసిన కోవిడ్ కేంద్రం ద్వారా మెరుగైన వైద్యం అందిస్తున్నామని, రికవరీ శాతం కూడా గణనీయంగా పెరిగిందన్నారు. కోవిడ్ కేసులు కూడా తగ్గుముఖం పడుతున్నాయని తెలిపారు. కోవిడ్ కేంద్రంలో ఆక్సిజన్ కొరత, సరఫరాలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూస్తున్నామన్నారు. గుడివాడ మున్సిపాలిటీ పరిధిలోని ప్రధాన రోడ్ల వెంబడి సోడియం హైపోక్లోరైడ్ ద్రావణాన్ని జల్లుతున్నామని చెప్పారు. అలాగే పట్టణంలోని 36 వార్డుల్లో మూడు ట్రాక్టర్లతో హైపోక్లోరైడ్ ను స్ప్రే  చేయడంతో పాటు సున్నం, బ్లీచింగ్ పౌడర్ ను జల్లుతున్నామన్నారు. పట్టణంలోని అన్ని డ్రైన్లను శుభ్రపర్చడంతో పాటు పారిశుద్ధ్యాన్ని మరింత మెరుగుపరుస్తున్నామని మంత్రి కొడాలి నాని చెప్పారు.

Comments