దేవాదాయ ఆస్తుల పరిరక్షణకు, పునరుద్దరణకు పటిష్టమైన చర్యలు చేపట్టాలని రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి కురసాల కన్నబాబు ఆధికారులను ఆదేశించారు.

కాకినాడ (prajaamaravati); 

దేవాదాయ ఆస్తుల పరిరక్షణకు, పునరుద్దరణకు పటిష్టమైన చర్యలు చేపట్టాలని రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి కురసాల కన్నబాబు ఆధికారులను ఆదేశించారు.     


       మంగళవారం మద్యాహ్నం మంత్రి కురసాల కన్నబాబు తమ క్యాంపు కార్యాలయంలో దేవాదాయశాఖ డిప్యూటి కమిషనర్/ల్యాండ్ ప్రొటెక్షన్ సెల్ డిప్యూటీ కలెక్టర్ ,తహసీల్దార్, సర్వేయర్లు, జిల్లా అసిస్టెంట్ కమిషనర్, కాకినాడ ఇన్స్పెక్టర్, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ లతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అన్యాక్రంతమైన  నూకాలమ్మ, సర్పవరం భావనారాయన స్వామి దేవాలయాల అస్తులను ఆక్రమణదారుల చెరనుండి రక్షించి, పదిల పరచేందుకు, ఆదాయ వనరులు అభివృద్ది చేసేందుకు చేపట్ట వలసిన చర్యలను ఆయన అధికారులకు సూచించారు.  అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం కల్పిస్తున్న నిధులు, కామన్ గుడ్ ఫండ్ నిధులతో జిల్లాలో  దేవాలయాల నిర్మాణం, జీర్ణస్థితికి చేరిన దేవాలయాల పునరుద్దరణానికి సమగ్ర కార్యాచరణ అమలు చేయాలని మంత్రి ఆదేశించారు. 

  ఈ సమావేశంలో దేవాదాయ శాఖ డిప్యూటీ కమీషనర్ యం.విజయరాజు, అసిస్టెంట్ కమీషనర్ కెఎన్డివి ప్రసాద్, డిఈఈ గోపాలకృష్ణంరాజు, తహశిల్దారు శిరీష, సర్వేయర్లు సీతారామాచారి, రూప తదితరులు పాల్గొన్నారు.                                       

Comments