వక్ఫ్ బోర్డు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి వర్యులు శ్రీ.ఎస్.బి. అంజాద్ బాషా.
విజయవాడ (ప్రజా అమరావతి): విజయవాడ లోని ఉప ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో మంగళవారం ఉదయం వక్ఫ్ బోర్డు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు శ్రీ ఎస్.బి. అంజాద్ బాషా గారు.
సమీక్ష సమావేశం లోని ముఖ్యమైన అంశాలు:
ఆంధ్రప్రదేశ్ వక్ఫ్ బోర్డు భూముల అన్యాక్రాంతానికి అడ్డుకట్ట వేసే దిశలో భాగంగా కర్నూలు జిల్లా వక్ఫ్ భూముల పైన వక్ఫ్ బోర్డు అధికారులతో రివ్యూ చేయడమైనది.
ముఖ్యంగా వక్ఫ్ భూములలో ఇది వరకు నిర్మించబడిన కట్టడాలను కూల్చివేయడం,
రిజిస్ట్రేషన్ల ప్రక్రియను వెంటనే నిలిపివేయడం మరియు గెజెట్ ని అప్ డేట్ చేయడం చేపట్టాలని అధికారులను ఆదేశించడమైనది.
అవినీతికి పాల్పడిన అధికారులను శాశ్వతంగా విధులనుండి తొలగించే విధంగా చర్యలను చేపట్టాలని ఆదేశించడమైనది.
సంబంధిత మునిసిపల్, రెవిన్యూ, పోలీస్ మరియు రిజిస్ట్రేషన్ అధికారుల సమన్వయంతో వక్ఫ్ భూముల పరిరక్షణకు కట్టుదిట్ట మైన చర్యలను చేపట్టాలని అధికారులను ఆదేశించిన ఉపముఖ్యమంత్రి శ్రీ.ఎస్.బి.అంజాద్ బాషా .
ఈ సమీక్షా సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వక్ఫ్ బోర్డు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీ అలీం బాషా గారు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
addComments
Post a Comment