నామినేటెడ్ పదవుల్లో జిల్లాలో 11వరకు వివిధ కార్పొరేషన్ పదవులు కేటాయించారు...

 పశ్చిమగోదావరి జిల్లా... ఏలూరు (ప్రజా అమరావతి);
ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అణగారిన వర్గాలకు, పార్టీ కోసం నిరంతరం పని చేసి జండా మోచిన వివిధ సామజిక వర్గాల నాయకులకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయ పదవులు కట్ట బెట్టి ఆ వర్గాలకు సమాజంలోలో గుర్తింపు గౌరవాన్ని కల్పించారని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని, రాష్ట్ర రవాణా, సమాచార శాఖ మంత్రి పేర్ని నాని పేర్కొన్నారు...


137రాష్ట్ర, జిల్లా స్థాయి నామినేటెడ్, కార్పొరేషన్ పదవుల్లో ఎస్ సి, ఎస్ టి బిసి మైనారిటీ వర్గాలకు 58శాతం ఇచ్చారని వీరిలో 50శాతం మహిళలకు పదవులు ఇచ్చి మహిళా సాధికారితలో దేశంలో ఏపి ప్రధమ స్థానంలో ఉందని మంత్రులు ఆళ్ల నాని పేర్ని నాని చేప్పారు...


ఏలూరులో డీసీసీబీ నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో పాల్గొన డానికి వచ్చిన రాష్ట్ర రవాణా, సమాచార శాఖ మంత్రి పేర్ని నాని ఏలూరు ఉప ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయానికి వచ్చారు...


 ఇటీవల నామినేటెడ్ పదవుల్లో జిల్లాలో 11వరకు వివిధ కార్పొరేషన్ పదవులు కేటాయించారు...జిల్లాలో అమలు అవుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు, నామినేటెడ్ పదవుల్లో మహిళలకు అత్యంత ప్రాధాన్యత, తదితర అంశాలపై మంత్రులు ఆళ్ల నాని పేర్ని నాని దెందులూరు శాసన సభ్యులు కోటారు అబ్బాయి చౌదరి, MLC మోషేన్ రాజు చర్చించారు...


ఈ సందర్బంగా మంత్రులు ఆళ్ల నాని పేర్ని నాని మాట్లాడుతూ డాక్టర్ బి ఆర్ అంబేద్కర్, పులేలు కలలు కన్న సామజిక న్యాయం రాష్ట్ర ముఖ్యమంత్రి వైస్ జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలనలో కనిపిస్తుందని ఎన్నికలు ముందు సీట్లు కేటాయింపు నుండి పదవులు పంపిణి వరకు ముఖ్యమంత్రి వైస్ జగన్మోహన్ రెడ్డి గారు సమ న్యాయం చేసారని వారు పేర్కొన్నారు...


నభూతో నాభవిషత్తు అన్నట్టుగా ఆంధ్రప్రదేశ్ లో సామజిక న్యాయం అమలు జరుగుతుందని మంత్రులు అన్నారు...

మొదటి నుండి పార్టీ కోసం కస్టపడిన వారిని, అంకిత భావంతో పని చేసిన వారికి పదవులు ఇచ్చి వారిని గౌరవించిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి వైస్ జగన్మోహన్ రెడ్డి గారికే దక్కుతుందని మంత్రులు ఆళ్ల నాని పేర్ని నాని చేప్పారు...


రాష్ట్ర చరిత్రలోనే తొలిసారిగా బీసీలకు రాజకీయ పదవుల్లో పెద్ద పీట వేశారని, అటు అధికారంలోనూ ఇటు సంక్షేమ కార్యక్రమల్లోనూ పేద ప్రజలను భాగస్వామ్యం చేసిన ఏకైక ముఖ్యమంత్రి వైస్ జగన్మోహన్ రెడ్డి గారు అని మంత్రులు అన్నారు...


కులం,మతం, ప్రాంతం, పార్టీలు చూడకుండా ఈరోజు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామని అణగారిన వర్గాల గుండె చప్పుడు తెలిసిన సిఎం వైస్ జగన్మోహన్ రెడ్డి అని మంత్రులు ఆళ్ల నాని పేర్ని నాని చేప్పారు...

ఈ కార్యక్రమంలో MLC షేక్ సాబ్జి పాల్గొన్నారు...
Comments