కరోనా నిర్ధారణ పరీక్షలను పెద్దఎత్తున నిర్వహిస్తున్నాం

 - కరోనా నిర్ధారణ పరీక్షలను పెద్దఎత్తున నిర్వహిస్తున్నాం


- గుడివాడ డివిజన్ లో 2 శాతానికి తగ్గిన పాజిటివిటి

- రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని


             గుడివాడ, జూలై 17 (ప్రజా అమరావతి): 

 గుడివాడ డివిజన్లో కరోనా సెకండ్ వేవ్ ను సమర్థవంతంగా ఎదుర్కోవడంలో భాగంగా కరోనా నిర్ధారణ పరీక్షలను పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నట్టు రాష్ట్ర పౌర సరఫరాలు, వినియోగదారుల  వ్యవహారాల శాఖా మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) చెప్పారు.  శనివారం గుడివాడ డివిజన్ లోని మండలాలు వారీగా జరుగుతున్న కరోనా నిర్ధారణ పరీక్షలు, పాజిటివ్ కేసులు, పాజిటివిటి శాతంపై సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ శనివారం ఒక్కరోజే డివిజన్లో 994 మంది అనుమానితులకు కరోనా నిర్ధారణ పరీక్షలను నిర్వహించామని తెలిపారు. వీరిలో 20 మందికి కరోనా వైరస్ సోకినట్లు నిర్ధారణ అయిందని, 2.01 శాతానికి పాజిటివిటీ తగ్గిందని చెప్పారు. నందివాడ మండలంలో 19 మందికి కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా ఒకరికి మాత్రమే కరోనా వైరస్ సోకినట్టుగా నిర్ధారణ అయిందని, 5.26 శాతం పాజిటివిటీ నమోదయిందని తెలిపారు. అలాగే మండవల్లి 

మండలంలో 41 మందికి కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా ఇద్దరికి కరోనా వైరస్ సోకినట్టుగా నిర్ధారణ అయిందని, 4.88 శాతం పాజిటివిటీ నమోదయిందని చెప్పారు. గుడ్లవల్లేరు మండలంలో 62 మందికి కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా, ఇద్దరికి కరోనా వైరస్ సోకినట్టుగా నిర్ధారణ అయిందని, 3.23 శాతం పాజిటివిటీ నమోదయిందని పేర్కొన్నారు. పామర్రు మండలంలో 281 మందికి కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా ఏడుగురికి కరోనా వైరస్ సోకినట్టుగా నిర్ధారణ అయిందని, 2.49 శాతం పాజిటివిటీ నమోదయిందని తెలిపారు. కైకలూరు మండలంలో 85 మందికి కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా ఇద్దరికి కరోనా వైరస్ సోకినట్టుగా నిర్ధారణ అయిందని, 2.35 శాతం పాజిటివిటీ నమోదయిందని చెప్పారు. కలిదిండి మండలంలో 98 మందికి కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా ఇద్దరికి మాత్రమే కరోనా వైరస్ సోకినట్టుగా నిర్ధారణ అయిందని, 2.04 శాతం పాజిటివిటీ నమోదయిందని అన్నారు. గుడివాడ పట్టణంలో 113 మందికి కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా ఇద్దరికి మాత్రమే కరోనా వైరస్ సోకినట్టుగా నిర్ధారణ అయిందని, 1.77 శాతం పాజిటివిటీ నమోదయిందని వివరించారు. గుడివాడ మండలంలో 59 మందికి కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా ఒకరికి మాత్రమే కరోనా వైరస్ సోకినట్టుగా నిర్ధారణ అయిందని, 1.69 శాతం పాజిటివిటీ నమోదయిందని అన్నారు. పెదపారుపూడి మండలంలో 157 మందికి కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా ఒకరికి మాత్రమే కరోనా వైరస్ సోకినట్టుగా నిర్ధారణ అయిందని, 0.64 శాతం పాజిటివిటీ నమోదయిందని చెప్పారు. ముదినేపల్లి మండలంలో 79 మందికి కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదని, జీరో శాతం పాజిటివిటీ నమోదయిందని మంత్రి కొడాలి నాని చెప్పారు.

Comments