రాష్ట్ర పోలిస్ ప్రధాన కార్యాలయం లో డిజిపి గౌతం సవాంగ్ IPS ను కలిసి కృతజ్ఞతలు తెలిపిన మహిళా పోలీసులు

 


మంగళగిరి  (ప్రజా అమరావతి);


రాష్ట్ర పోలిస్ ప్రధాన కార్యాలయం లో డిజిపి గౌతం సవాంగ్ IPS ను కలిసి కృతజ్ఞతలు తెలిపిన మహిళా పోలీసులు


.



ఆంధ్ర ప్రదేశ్ లో మహిళల భద్రత , రక్షణకు పెద్దపీట  వేస్తూ అనుక్షణం వారికి తోడు నీడగా అన్నివేళలా అందుబాటులో ఉండేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి  శ్రీ వైఎస్. జగన్ మోహన్ రెడ్డి గారు   గ్రామ, వార్డు సచివాలయల్లోని 15000 మంది  మహిళ సంరక్షణ కార్యదర్శులను మహిళా పోలీసులుగా గుర్తిస్తూ  జీవో నెంబర్ 59ని జారీ చేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ మహిళా పోలీసులు ముఖ్యమంత్రి గారికి, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ శ్రీ గౌతం సవాంగ్ IPS గారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సంధర్భంగా మహిళా పోలీసులు మాట్లాడుతూ రాబోయే రోజుల్లో తాము  పోలీసు శాఖలో అంతర్భాగంగా  రాష్ట్ర ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా పోలీస్ శాఖ తమకు అప్పగించిన విధులను సమర్థవంతంగా నిర్వహిస్తామని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో టెక్నికల్ సర్వీసెస్ DIG G.పాలరాజు IPS పాల్గొన్నారు.

Comments