ఎపిలో సెప్టెంబర్ 4 వరకు రాత్రి 11గం.ల నుండి ఉ.6గం.ల వరకు‌ కోవిడ్ కర్ఫ్యూ ‌

 ఎపిలో సెప్టెంబర్ 4 వరకు  రాత్రి 11గం.ల నుండి ఉ.6గం.ల వరకు‌ కోవిడ్ కర్ఫ్యూ ‌అమరావతి,20 ఆగస్టు (ప్రజా అమరావతి): ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సెప్టెంబర్ 4 వరకు రాత్రి 11గం.ల నుండి ఉదయం 6గం.ల వరకు కోవిడ్ కర్ఫ్యూ అమలులో ఉంటుంది. ఈమేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ జిఓ ఆర్టీ  సంఖ్య 456 ద్వారా ఉత్తర్వులు జారీ చేశారు.రాష్ట్రంలో కరోనా పరిస్థితులను సమీక్షించిన అనంతరం ప్రభుత్వం ఈమేరకు కర్ఫ్యూ సమయాల్లో సడలింపు నిర్ణయం తీసుకోవడం జరిగిందని అనిల్ కుమార్ సింఘాల్ ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

సెప్టెంబర్ 4 వరకు రాత్రి 11గం.ల నుండి ఉదయం 6గం.ల వరకు అమలులో ఉండే ఈ కోవిడ్ కర్ఫ్యూ నిబంధనలను ఎవరైనా ఉల్లంఘిస్తే విపత్తుల నిర్వహణ చట్టం 2005 లోని సెక్షన్లు 51 నుండి 60 మరియు భారత శిక్షా స్మృతి (IPC) లోని సెక్షన్ 188,ఇతర నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

ఈఆదేశాలను కట్టుదిట్టంగా అమలు చేయాల్సిందిగా జిల్లా కలెక్టర్లు,ఎస్పిలు,పోలీస్ కమీషనర్లకు ఆఉత్తర్వుల్లో ఆయన స్పష్టం చేశారు.Comments