నలుగురు ఏఆర్ పోలీసులు మృతి చెందడం పట్ల మంత్రి కొడాలి నాని దిగ్ర్భాంతి

    


- నలుగురు ఏఆర్ పోలీసులు మృతి చెందడం పట్ల మంత్రి కొడాలి నాని దిగ్ర్భాంతి 



గుడివాడ, ఆగస్టు 28 (ప్రజా అమరావతి): శ్రీకాకుళం జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు ఏఆర్ పోలీసులు మృతి చెందడం పట్ల ఆ జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి, రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. సోమవారం కృష్ణాజిల్లా గుడివాడలో మంత్రి కొడాలి నాని మీడియాతో మాట్లాడారు. కోల్ కతాలో ప్రాణాలు కోల్పోయిన ఆర్మీ జవాన్ మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించి వస్తుండగా శ్రీకాకుళం జిల్లా పలాస మండలం సుమ్మాదేవి జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగిందన్నారు. ఈ ప్రమాదంలో ఏఆర్ ఎస్ఐ, ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్ళు, ఒక కానిస్టేబుల్ ప్రాణాలు కోల్పోవడం బాధాకరమన్నారు. తక్షణం సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాలని జిల్లా ఎస్పీని ఆదేశించామన్నారు. విధి నిర్వహణలో నలుగురు పోలీసులు మృతి చెందడం పట్ల ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ప్రభుత్వం, పోలీస్ శాఖ మృతుల కుటుంబాలకు అండగా ఉంటుందని చెప్పారు. మృతుల కుటుంబ సభ్యులకు మంత్రి కొడాలి నాని ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

Comments