పేదలకు పక్కా ఇళ్లు"- కాకాణి

 *"పేదలకు పక్కా ఇళ్లు"- కాకాణి


.* 



*శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా (ప్రజా అమరావతి), సర్వేపల్లి నియోజకవర్గం, వెంకటాచలం మండల కేంద్రంలో "నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు" కార్యక్రమంలో భాగంగా ఇళ్ల నిర్మాణంపై జరిగిన సమీక్షలో జాయింట్ కలెక్టర్ (రెవిన్యూ) హరేంద్ర ప్రసాద్ గారు, జాయింట్ కలెక్టర్ (హౌసింగ్) విథేహ్ ఖరే, నియోజకవర్గ ప్రత్యేకాధికారిణి రోజ్ మాండ్ గారు, ఆర్డీఓ హుసేన్ సాహెబ్ గారు, ఇతర అధికారులతో కలిసి పాల్గొని సలహాలు, సూచనలు అందించిన వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, సర్వేపల్లి శాసనసభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి . మాట్లాడుతూ

సర్వేపల్లి నియోజకవర్గంలో సుమారు 14 వేల ఇళ్లు మంజూరు చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు.

 ఆంధ్ర రాష్ట్ర చరిత్రలోనే ఎన్నడూ లేనివిధంగా అర్హత కలిగిన వారందరికీ ఒకే విడతలో ఇళ్ల స్థలాల పట్టాలు అందించిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది.

ఇళ్ల స్థలాలకు కొంతమంది తాము అర్హులమని తమకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని గ్రామాలలో వినతిపత్రాలను సమర్పిస్తున్నారు.

 ఇళ్ల స్థలాలు కోరుకుంటున్న వారిలో అర్హత కలిగిన లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు అందించడంతో పాటు, అర్హతలేనివారికి ఏ కారణాల వల్ల అర్హత లేదో!, తేల్చి చెప్పాల్సిన అవసరం ఉంది.

 ప్రభుత్వం ఒక ఇంటి నిర్మాణానికి 1లక్షా 80 వేల రూపాయలు అందించడంతోపాటు, సంఘ బంధాలలోని సభ్యులకు అదనంగా మరో 20 వేల రూపాయలు రుణ సౌకర్యం కల్పిస్తుంది.

 వైయస్సార్ జగనన్న కాలనీలలో ఇళ్ల నిర్మాణం చేపట్టడానికి అవరోధంగా ఉన్న కోర్టు వివాదాలను అధిగమించి, ఇళ్ల నిర్మాణం ప్రారంభించేందుకు కోర్టు స్టేలన్నీ వీలైనంత త్వరగా వెకేట్ చేయించండి.

వైయస్సార్ జగనన్న కాలనీలలో ఇళ్ల నిర్మాణానికి అవసరమైన నీటి సదుపాయం తో పాటు కరెంట్ సౌకర్యం కల్పించేందుకు మంజూరైన పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి.

 వైయస్సార్ జగనన్న కాలనీలలో కానీ, గ్రామాలలో కానీ, గ్రామాలలో ఇళ్లస్థలాల కోసం సేకరించిన భూములు చదును చేసేందుకు అవసరమైన గ్రావెల్ అనుమతించక లెవలింగ్ పనులు ఆగిపోయినందున ప్లాట్లు వేసి, ఇళ్ల స్థలాలు కేటాయించలేక పోతున్నారు.

 అధికారులు ఇళ్ల నిర్మాణానికి, ప్రజల అవసరాలకు, ప్రభుత్వ పథకాలకు, అవసరమైన గ్రావెల్ వినియోగానికి అనుమతులు మంజూరు చేస్తూ, స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలి.

 గ్రామాలకు దూరంగా నూతనంగా ఎంపిక చేసిన ఇళ్ళ స్థలాల లేఅవుట్లలో ప్రజల అవసరాలకు స్థలాన్ని కేటాయించడంతో పాటు, కాలనీలకు దగ్గరలోనే స్మశాన వాటికలకు స్థలాలను గుర్తించి, వెళ్లేందుకు రోడ్డు సౌకర్యాన్ని కల్పించాలి.

 మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఇళ్ల కార్యక్రమాన్ని మహా యజ్ఞంలా భావించి, పేదలందరికీ ఇళ్లు నిర్మించి ఇచ్చే కార్యక్రమంలో అందరం భాగస్వాములవుదాం.

సర్వేపల్లి నియోజకవర్గంలో ఇళ్ల స్థలాల పంపిణీ విషయంలో కానీ ఇళ్ల మంజూరు విషయంలో గానీ అత్యంత శ్రద్ధ కనబరచి, సమర్థవంతంగా సేవలందించిన జిల్లాస్థాయి, నియోజకవర్గస్థాయి, మండల స్థాయి, గ్రామ సచివాలయ స్థాయి అధికారులకు, సహకరించిన స్థానిక ప్రజాప్రతినిధులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు.

Comments