*సింహాచలం లో అపచారం పై శ్రీవైష్ణవ సంఘం మండిపాటు*
విశాఖపట్నం, ఆగస్టు 11 , (ప్రజా అమరావతి) : లక్షలాది మంది భక్తుల ఆరాధ్య దైవమైన సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం లోని ఉపాలయమైన శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయం లోని ధ్వజస్థంభం కూలడం పూర్తిగా ఆలయ అధికారులు, వైదిక సిబ్బంది నిర్లక్ష్యమేనని అఖిల భారత శ్రీవైష్ణవ బ్రాహ్మణ సంక్షేమ సంఘం (రిజిస్టర్డ్) మండిపడింది. ఈ నిర్లక్ష్యానికి గల కారణాలను పరిశీలించి భాద్యులపై చర్యలు తీసుకోవాలని సంఘం ప్రధాన కార్యదర్శి యతిరాజుల బాలబాలాజీ డిమాండ్ చేసారు. తమ సంఘం అధ్యక్షులు కె. నరసింహాచార్యులు, ఉపాధ్యక్షులు కేశవాచార్యులుతో కూడిన కమిటీ ఈ ఘటనపై చర్చించామన్నారు.
బుధవారం ఉదయం జరిగిన ఈ ఘటన యావత్ భక్త సమాజాన్ని ఎంతో కలిచి వేసిందన్నారు.
ధ్వజస్తంభం అంటే ఆలయంలోని మూల విరాట్ కు ప్రతిరూపం అన్నారు. దేవాలయాల్లోని మూలవిరాట్ కు ఎంత ప్రాధాన్యత ఉంటుందో ఆలయంలోని ధ్వజస్థంభానికి కూడా అంతే ప్రాధాన్యత ఉంటుందన్నారు. అందుకే ఆలయంలో మూల విరాట్ కు చేసే విన్నపాలను ధ్వజస్తంభం వద్ద చేయడం జరుగుతుందన్నారు. ప్రతి రోజు మూల విరాట్ కు నైవేద్యం చేసిన తదుపరి ధ్వజస్తంభం వద్ద కూడా నైవేద్యం పెడతారన్నారు. అలాంటి ప్రాధాన్యత ఉన్న ధ్వజస్తంభం పట్ల ఆలయంలోని వైదికులు, వైదికేతర సిబ్బంది ఇంత నిర్లక్ష్యంగా ఉన్నారు అంటే వాళ్ళకి ఆలయం పట్ల ఎంత శ్రద్ధ ఉందొ తెలుస్తోందన్నారు. ఈ ఘటనను తమ అఖిల భారత శ్రీవైష్ణవ సంఘం తీవ్రంగా ఖండిస్తోందన్నారు.
భారత దేశంలోని శ్రీవైష్ణవ క్షేత్రాల్లో జరిగే కార్యాచరణపై తమ సంఘం త్వరలోనే సర్వ్ చేపడుతుందన్నారు. తక్షణం ఈ తప్పిదంపై విచారణ జరపాలి అని డిమాండ్ చేసారు.
*శ్రీమాన్ యతిరాజుల బాలబాలాజీ*
*ప్రధాన కార్యదర్శి*
*అఖిల భారత శ్రీవైష్ణవ బ్రాహ్మణ సంక్షేమ సంఘం (రిజిస్టర్డ్)*
addComments
Post a Comment