కాలువ చివరభూములకు నీరందించాలి

 కాలువ చివరభూములకు నీరందించాలి


తెనాలి (ప్రజా అమరావతి);

  సాగునీటి కాలువ చివరి భూముల వరకు నీరందించే ప్రయత్నాలు చేస్తున్నామని రైతు భరోసా&రెవెన్యూ J.C దినేష్ కుమార్ అన్నారు . గురువారం సాయంత్రం తెనాలి సబ్ కలెక్టరు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ   ఉదయం వరహాపురంలో  కలెక్టరు వివేక్ యాదవ్ ఆదేశాల ననుసరించి, పారుదల తీరును పరిశీలిస్తూ,  వ్యవసాయ సాగు పంటలకు సాగునీటికి ఆటంకం లేకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని, ఈసందర్భంగా కాకర్ల మూడి లో కొందరు  ఏర్పరిచిన అవరోథాలను శాఖల సమన్వయంతో తొలగించామన్నారు.పిదప బాపట్ల కర్లపాలెం మండలములలోని సాగునీటి సరఫరాకు  అంతరాయం లేకుండా గండ్లు, పూడికతీత పనులకు ఆదేశించామన్నారు.


ప్రతీ రోజూ 8.2వేల క్యూసెక్యుల నీటిని విడుదల చేస్తున్నట్లు ,సక్రమంగా సాగునీటి పారుదల జరిగేలా వ్యవసాయ, సాగునీటి పారుదల, రెవెన్యూ, పోలీసు శాఖలతో సమన్వయ కమిటీ చేశామన్నారు. కాల్వలకు గండ్లు, కాలువ పూడిక తీత పనులను రైతుల సహకారంతో చర్యలు చేపట్టనున్నామని,అక్రమ తూములతో నీటనిి మళ్ళించే వారిపై చర్యలుంటాయన్నారు.

సబ్ కలెక్టర్ నిధి మీనా ఈ కార్యక్రమంలో ఉన్నారు.

Comments