తాడేపల్లి (ప్రజా అమరావతి);
వైయస్ జగన్ కంటున్న కలలు సాకారం చేసే దిశగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పునరంకితం కావాలి.
పార్టీ కేంద్ర కార్యాలయంలో జాతీయపతాకాన్ని ఆవిష్కరించిన పార్టీ రాష్ర్ట ప్రధాన కార్యదర్శి,
ప్రభుత్వ ప్రజా వ్యవహారాల సలహాదారులు శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి
75 వ స్వాతంత్ర్యదినోత్సవం వేడుకలలో భాగంగా వైయస్సార్ కాంగ్రెేస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ రాష్ర్ట ప్రధాన కార్యదర్శి,ప్రభుత్వ ప్రజావ్యవహారాల సలహాదారులు శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి జాతీయపతాకాన్ని ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. స్వాతంత్ర్యం వచ్చిన తొలి దశాబ్ధంలో జాతి పునర్ నిర్మాణం, అట్టడుగు వర్గాలను పైకి తీసుకురావడం,ప్రణాళికాబధ్ద అభివృధ్ధి,ప్రజాస్వామ్యబధ్దంగా వ్యవహరించడం,నిస్వార్ధపరులైన,జాతికి అంకితమైన నాయకత్వం చూశాం.
మన రాష్ర్టంలో రెండు సంవత్సరాల క్రితం కొత్త శకం ఆవిష్కృతమైంది. తొలిసారిగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత పేదలను పేదరికం నుంచి బయటకు తీసుకువచ్చే విధంగా,కుల,మతాలకు అతీతంగా సంక్షేమ పధకాలను వారికి అందించడం జరిగింది. పేదలు,బడుగువర్గాలు వారి కాళ్ల పై వారు నిలబడి చైతన్యవంతమైయ్యేలా చేసి సమానత్వాన్ని,సమానహక్కులను సాధించి సాధికారితతో అడుగులు ముందుకు వేసే దిశగా శ్రీ వైయస్ జగన్ గారు పునాదులు వేశారు.
మనం గమనిస్తే రాష్ర్టంలో వ్యవస్ధాపరమైన మార్పులు జరుగుతున్నాయి.ప్రజల ఆస్ధులు క్రియేట్ అవుతున్నాయి. జగన్ గారికి ప్రజలు తిరుగులేని అధికారం కట్టబెట్టి రెండేళ్ళు గడుస్తోంది.
ప్రజలకు ఏవైతే వాగ్దానాలు చేశామో వాటిని వందలసంఖ్యలో నెరవేర్చడం జరిగింది. ఏ పట్టణంలోకి పోయినా,ఏ పల్లెలోకి పోయినా చేసిన కార్యక్రమాలు కళ్ల ఎదుట కనిపిస్తున్నాయి. ప్రతి కార్యకర్త సగర్వంగా చెప్పుకునే విధంగా ఆ కార్యక్రమాలు ఉన్నాయి. విద్య,వైద్యం అనే కాదు పేదవాడు తన కాళ్లపై తాను నిలబడటానికి అవసరమైన సపోర్ట్ జగన్ గారు మాకు ఇస్తున్నారనే ధీమాతో అడుగు ముందుకు వేసే రోజులు కనబడుతున్నాయి. ప్రజలకు చెప్పిన వాగ్దానాలు నెరవేరుస్తూ ఆ బాధ్యతను మరింత పెంచుకునేవిధంగా ప్రభుత్వం పనిచేస్తోంది. వంద సంవత్సరాలలో చూడని కోవిడ్ లాంటి సంక్షోభ సమయంలోనూ ఆర్దిక ఇబ్బందులను తట్టుకుంటూ .. పధకాలను అమలు చేయడం జరుగుతోంది.
ఏ పల్లెకు పోయినా కూడా రైతభరోసా,అభివృధ్ది చేసిన స్కూల్,వైద్యాలయాలు,పెన్షన్లు ,ఇంటింటికి రేషన్ ఇలా ఎన్నో కనిపిస్తున్నాయి.
రాజకీయపరంగా చూస్తే సర్పంచ్ ల దగ్గరనుంచి అన్ని రకాల ఎన్నికలు పూర్తి అయ్యాయి.శ్రీ వైయస్ జగన్ గారికి ప్రజలు అన్ని ఎన్నికలలో పూర్తి మధ్దతు ప్రకటించారు. అయితే ప్రజాతీర్పు వారికి వ్యతిరేకంగా వచ్చినప్పటికి జడ్ పిటిసి,ఎంపిటిసి ఎన్నికలకు సంబంధించి తెలుగుదేశం పార్టీ కుట్రలు చేసి కోర్టులకు వెళ్లి అడ్డుకున్న అంశం ఫలించదని అందరం కోరుకుందాం. వచ్చే రెండు సంవత్సరాల వరకు ఎన్నికలు,రాజకీయాల గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. శ్రీ వైయస్ జగన్ గారు సృష్టించిన ఆస్దులు అంటే గ్రామాలలో మౌళికసదుపాయాలతో కూడిన పాఠశాలలు,ప్రాధమిక ఆరోగ్యకేంద్రాలు,రైతభరోసా కేంద్రాలు వీటన్నింటిని మన ప్రజల ఉమ్మడి ఆస్తులుగా గమనించి వాటిని సంరక్షించుకునే విధంగా చైతన్యవంతంగా వ్యవహరించాలని కార్యకర్తలకు పిలుపు ఇచ్చారు.చాలా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరారు. శ్రీ వైయస్ జగన్ కంటున్న కలలను పూర్తి చేయడం అందరి బాధ్యత అని అన్నారు.ప్రజలందరికి స్వాతంత్ర్యదినోత్సవ శుభాకాంక్షలు తెలియచేశారు.
ఈ కార్యక్రమంలో శాసనమండలి సభ్యులు శ్రీ లేళ్ళ అప్పిరెడ్డి,డొక్కా మాణిక్యవరప్రసాద్,పార్టీ నేత శ్రీ బొప్పన భవకుమార్,నవరత్నప్రోగ్రామ్ వైస్ ఛైర్మన్ అంకంరెడ్డి నారాయణమూర్తి తదితరులు పాల్గొన్నారు.
addComments
Post a Comment