*చిల్లపల్లి వారి సీఎంఆర్ హ్యాండ్లూమ్స్ షోరూమ్ శుభారంభం*
మంగళగిరి (ప్రజా అమరావతి);
ప్రముఖ చేనేత కేంద్రమైన మంగళగిరి నగరంలో మెగా హ్యాండ్లూమ్ షోరూమ్ శుభారంభం అయింది. నగరంలో పేరొందిన చిల్లపల్లి సంస్థల నుంచి నూతనంగా చిల్లపల్లి వారి సీఎంఆర్ హ్యాండ్లూమ్స్ షోరూమ్ అందుబాటులోకి వచ్చింది. పాత ఎన్.హెచ్-5, తెనాలి ఫ్లైవోవర్ దాటిన తరువాత బైపాస్ రోడ్డులో సీఎన్ఆర్ గ్రానైట్స్ దగ్గర సీఎంఆర్ హ్యాండ్లూమ్స్ షోరూమ్ ను శ్రావణ శుక్రవారం ఉదయం 11 గంటల 49 నిమిషాలకు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సతీమణి శ్రీమతి సజ్జల లక్ష్మి స్వహస్తాలతో ఆహ్లాదకర వాతావరణంలో ప్రారంభోత్సవం జరిగింది. అంతకుముందు శ్రీమతి చిల్లపల్లి పార్వతి జ్యోతి ప్రజ్వలన చేయగా, ఆప్కో చైర్మన్ చిల్లపల్లి మోహనరావు, సీఎంఆర్ హ్యాండ్లూమ్స్ అధినేత చిల్లపల్లి వెంకట లక్ష్మీ నిరంజన్, వారి కుటుంబ సభ్యులు, నగర ప్రముఖులు, సన్నిహితులు, చేనేత వస్త్ర వ్యాపారులు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు.
సంప్రదాయం, సౌందర్యం సమాహారంగా మంగళగిరి నగరంలో మెగా సీఎంఆర్ హ్యండ్లూమ్ హోల్ సేల్ షోరూమ్ అందుబాటులోకి రావడమే కాకుండా శ్రావణమాసం స్పెషల్ ఆఫర్ గా మగ్గం ధరలకే చేనేత చీరలు అందిస్తున్నారు. రాష్ట్రంలో పేరెన్నికగన్న ప్రముఖ చేనేత చీరలు, డ్రెస్ మెటీరియల్, షర్టింగ్స్, టవల్స్, బ్లాంకెట్స్, లుంగీలు అన్ని రకాల చేనేత వస్త్ర సముదాయంగా చిల్లపల్లి వారి సీఎంఆర్ హ్యాండ్లూమ్స్ నిలుస్తుంది.
సీఎంఆర్ హ్యాండ్లూమ్స్ హోల్ సేల్ షోరూమ్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో శాసన మండలి సభ్యులు లేళ్ల అప్పిరెడ్డి, కృష్ణా జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ చైర్ పర్సన్ పటమట స్నిగ్ధ, గుంటూరు జిల్లా కేంద్ర సహకార బ్యాంకు చైర్మన్ రాతంశెట్టి సీతారామాంజనేయులు (లాలుపురం రాము), , హ్యూమన్ రైట్స్ కమిషన్ మెంబర్ గోచిపాత శ్రీనివాసరావు, నవరత్నాల అమలు కమిటీ వైస్ చైర్మన్ అంకంరెడ్డి నారాయణమూర్తి, ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కె.వెంకట్రామిరెడ్డి, చెన్నా రాఘవేంద్రనాథ్, సిమ్స్ విద్యాసంస్థల డైరెక్టర్ భరత్ రెడ్డి, చిల్లపల్లి నాగేశ్వరరావు అండ్ సన్స్ అధినేత చిల్లపల్లి శ్రీనివాసరావు, పడమట సురేష్ బాబు, గోలి తిరుపతిరావు, కెజె కుమార్, ఉదయగిరి వెంకటేష్, మంగళగిరి నగరానికి చెందిన ప్రముఖ చేనేత వస్త్ర వ్యాపారులు మురుగుడు లక్ష్మీనారాయణ, పొట్లాబత్తుని లక్ష్మణరావు, రాయల్ గ్యాస్ అధినేత నన్నపనేని నాగేశ్వరరావు, ప్రముఖ ఆడిటర్ దామర్ల వెంకట నరసింహం, అంకం బుడ్డయ్య బస్ సర్వీస్ అధినేత అంకం శ్రీనివాసరావు, వివిధ రాజకీయపార్టీల నాయకులు తదితర ప్రముఖులు పాల్గొని శుభాశీస్సులు అందజేశారు.
addComments
Post a Comment