సచివాలయ ఉద్యోగులు సచివాలయానికి వచ్చే ప్రతి ఒక్కరికి జాగ్రత్తగా సమాధానం ఇవ్వాలి*
*: జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి సెల్వరాజన్*
తాడిపత్రి పట్టణం సమీపంలోని హుస్సేన్ పురము నందు నూతనంగా నిర్మించిన సచివాలయాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్
అనంతపురం, ఆగస్టు 12 (ప్రజా అమరావతి):
*ప్రజలంతా పలు రకాల సమస్యలతోసచివాలయానికి వస్తారు, వారందరితో సచివాలయ ఉద్యోగులు మంచిగా మాట్లాడుతూ జాగ్రత్తగా సమాధానం అందించాలని జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి సెల్వరాజన్ ఆదేశించారు. గురువారం తాడిపత్రి పట్టణ సమీపంలోని హుస్సేన్ పురము నందు సచివాలయాన్ని జిల్లా కలెక్టర్ పరిశీలించారు.*
*ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి సచివాలయ వ్యవస్థ ను ప్రవేశపెట్టి రెండు సంవత్సరాలు అవుతోందని, ఉద్యోగులంతా వారికి కేటాయించిన విధుల్లో జాగ్రత్తగా పనిచేయాలన్నారు. సచివాలయ ఉద్యోగులు అంతా సచివాలయానికి వచ్చే ప్రతి ఒక్కరిని మంచిగా పలకరించాలని, వారి సమస్యలకు సమాధానాలు ఇవ్వాలన్నారు. ప్రజలకు కూడా తమను మంచిగా చూసుకున్నారనే ఫీలింగ్ వారిలో కలిగించాలన్నారు. ప్రజల వద్ద ఉద్యోగుల ప్రవర్తన సక్రమంగా ఉండాలన్నారు. వివిధ రకాల ప్రభుత్వ పథకాలను అర్హులైన లబ్ధిదారులకు అందించేలా చూడాలని, విద్యా దీవెన, కాపు నేస్తం, వైయస్సార్ చేయూత, వైయస్సార్ ఆసరా, అమ్మఒడి పింఛన్లు తదితర పథకాలను అర్హులకు తప్పనిసరిగా అందించాలన్నారు. ప్రతి ఒక్క ప్రభుత్వ పథకం పై సచివాలయ ఉద్యోగులకు, వాలంటీర్లకు అవగాహన ఉండాలని, తమ సచివాలయం పరిధిలోని, వారి ప్రాంతంలోని అభివృద్ధి పనులు, ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల వివరాలు, సిసి రోడ్లు, డ్రైనేజీలు, వివిధ రకాల రిపేర్లు తదితర అన్ని రకాల అంశాలపై అవగాహన ఎంతో ముఖ్యం అన్నారు.
*సచివాలయంలో ప్రతి ఒక్క ఉద్యోగి ప్రతిరోజు హాజరు పట్టికలో పేర్లు నమోదు చేయాలన్నారు. ప్రతిరోజు ఎన్ని సర్వీసులు వస్తాయో వాటన్నిటినీ గడువులోగా పరిష్కరించాలన్నారు. ప్రభుత్వ పథకాలకు అర్హత వివరాలు అందరికీ తెలిసి ఉండాలన్నారు. కరోనా నేపథ్యంలో సచివాలయం పరిధిలో ఫీవర్ సర్వే పక్కాగా నిర్వహించాలన్నారు. సచివాలయం పరిధిలో ఉండే మహిళలు, వారి కుటుంబ సభ్యుల సెల్ ఫోన్లలో దిశ యాప్ ను డౌన్లోడ్ చేయించాలన్నారు. ప్రతి ఒక్క ప్రభుత్వ పథకాల్ని అర్హులైన లబ్ధిదారులకు అందించేలా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ సూచించారు. సచివాలయంలో వివిధ ప్రభుత్వ పథకాల పోస్టర్లు, అర్హులైన లబ్ధిదారుల జాబితా తప్పనిసరిగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. అంతకుమునుపు పత్రికా సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వివిధ సంక్షేమ పథకాలు ఎలా అమలు అవుతున్నాయి. క్షేత్రస్థాయిలో పరిశీలించడానికి ఈరోజు పెద్దపప్పూరు మండలం నందు ముచ్చుకోట నందు పలు భవన నిర్మాణం పనులను పరిశీలించడం జరిగిందని తెలిపారు. అలాగే నాడు-నేడు పనులను పరిశీలించడం జరిగింది అని తెలిపారు
, గ్రామ సచివాలయ భవనాలు, రైతు భరోసా కేంద్రాలు, వైఎస్సార్ హెల్త్ క్లినిక్ లు, బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్స్ భవనాల పూర్తి, వైఎస్సార్ అర్బన్ క్లినిక్ లు, నిర్మాణం పనులు పురోగతి ఎలా ఉన్నదో ఈరోజు పరిశీలించడం జరిగిందని తెలిపారు. సెప్టెంబర్ 30 తేదీలోపు భవన నిర్మాణం పనులు పూర్తిచేయాలని అధికారులకు ప్రత్యేక ఆదేశాలు జారీ చేయడం జరిగిందని తెలిపారు.
addComments
Post a Comment