*స్పందనపై సీఎం శ్రీ వైయస్.జగన్ వీడియో కాన్ఫరెన్స్*
*వివిధ జిల్లాల కలెక్టర్లు, ఇతర ఉన్నతాధికారులతో క్యాంప్ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎం సమీక్ష.*
*రాష్ట్రంలో గృహనిర్మాణం, ఉపాధిహామీ పనులు, వైయస్సార్ అర్బన్‌క్లినిక్స్, గ్రామ, వార్డు సచివాలయాల్లో తనిఖీలు, కోవిడ్ సహా సీజనల్ వ్యాధులు, దిశా యాప్, వ్యవసాయం, అక్టోబరులో నెలలో అమలు చేయనున్న పథకాలపై సీఎం సమీక్ష*
అమరావతి (ప్రజా అమరావతి);
*ఈ సందర్భంగా సీఎం శ్రీ వైయస్.జగన్ ఏమన్నారంటే...:*
*హౌసింగ్:*
ఇళ్లపట్టాల పంపిణీపై కోర్టుల్లో పెండింగ్ కేసులపై దృష్టిపెట్టాలి
గత వీడియో కాన్ఫరెన్స్‌లో 834 కేసులు ఉంటే.. ఇవ్వాళ్టికి 758కి కేసులు తగ్గాయి. 76 కేసులు పరిష్కారం అయ్యాయి.
దాదాపుగా 8వేల మందికి దీనివల్ల మేలు జరిగింది.
ఇప్పటికీ పెండింగ్‌లో ఉన్న 758 కేసుల పరిష్కారంపైన కలెక్టర్లు, రెవిన్యూ సిబ్బంది, ప్రభుత్వ తరఫు న్యాయవాదులు దృష్టిపెట్టాలి.
ఏజీతో నేను కూడా రెగ్యులర్‌గా మాట్లాడుతున్నాను.
ఈ కేసులు పరిష్కరించేలా తగిన చర్యలు తీసుకోవాలని అడుగుతున్నాను.
వచ్చే నెలరోజుల్లో దేవుడి దయవల్ల ఈ కేసులన్నీ పరిష్కారం అవుతాయని ఆశిస్తున్నాను.
పెండింగ్‌కేసుల్లో 395 కేసులు పై తాత్కాలిక స్టేలు ఉన్నాయి. వీటిపైన కూడా దృష్టిపెడితే.. పేదలకు మేలు జరుగుతుంది.
లే అవుట్ల వారీగా, ప్లాట్ల వారీగా లబ్ధిదారుల వివరాలను తెలియజేస్తూ మ్యాపింగ్ చేశాం
మనం తయారు చేసిన యాప్‌లో ఈ వివరాలన్నింటినీ ఉంచాలి.
లే అవుట్ల వారీగా వివరాలు తెలియజేయాలి.
దీనివల్ల మిగిలిన పాట్లన్లను కొత్తగా లబ్ధిదారులకు కేటాయించడానికి వీలు కలుగుతుంది.
మిగిలిపోయిన 12.6శాతం మ్యాపింగ్ పనులను కలెక్టర్లు వెంటనే పూర్తిచేయాలి.
విజయనగరం, తూర్పుగోదావరి, చిత్తూరు, శ్రీకాకుళం జిల్లాల కలెక్టర్లు దీనిపై దృష్టిపెట్టాలి.
పెన్షన్లు, రేషన్‌కార్డులు, ఇళ్లపట్టాలతో పాటు మనం అమలు చేస్తున్న పథకాలకు సంబంధించి మిస్ అయిన వారిపై దృష్టి పెట్టాలి.
వీరందరికీ ప్రతి సంవత్సరం జూన్, డిసెంబర్‌లో ఆ ప్రయోజనాలు అందిస్తాం.
ఈలోగా వెరిఫికేషన్లు పూర్తిచేయాలి.
ఇళ్లపట్టాలకోసం పెట్టుకున్న దరఖాస్తుల్లో పెండింగులో ఉన్న వాటి వెరిఫికేషన్ వెంటనే పూర్తిచేయాలి.
వీరికి ఇదివరకే ఉన్న లే అవుట్లలో 45,600 మందికి, ప్రభుత్వ లే అవుట్లలో 10,851 మందికి డిసెంబర్‌లో పట్టాలు అందించాలి.
1,48,398 మందికి పట్టాలు ఇవ్వడానికి కొత్తగా భూసేకరణ చేయాల్సి ఉంది.
తాజాగా విడుదల చేసిన జీవోపై దృష్టిపెట్టండి.
భూ బదిలీ ద్వారా వారికి భూములను సేకరించడంపై దృష్టిపెట్టండి.
ఇళ్లపట్టాలకు అవసరమైన భూమిని వారిదగ్గర తీసుకోవడం, దానికి బదులుగా వేరేచోట ప్రభుత్వ భూమి ఇవ్వగలగడంపై దృష్టిపెట్టాలి.
*ఒన్‌టైం సెటిల్‌మెంట్ – జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం*
ఒన్‌టైం సెటిల్‌మెంట్ పథకానికి జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకంగా పేరు
ఈ పథకంలో రిజిస్ట్రేషన్ పట్టాలు ఇచ్చే కార్యక్రమం కూడా డిసెంబర్‌లో చేయాలి.
పేదలందరికీ ఇళ్ల పథకలో భాగంగా మొదటివిడతలో 15. 6 లక్షల ఇళ్లు కడుతున్నాం.
ఇప్పటివరకూ 10.31 లక్షల ఇళ్లు గ్రౌండ్ అయ్యాయి.
అక్టోబరు 25 నాటికల్లా బిలో బేస్‌మెంట్ లెవ్ ఇళ్లను బేస్‌మెంట్‌లెవల్ పై స్థాయికి తీసుకువచ్చేలా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలి.
చిత్తూరు, అనంతపురం, విజయనగరం జిల్లాల్లో ఇళ్ల నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయి... ఆయా కలెక్టర్లకు అభినందనలు.
మిగిలిన జిల్లాల కలెక్టర్లు కూడా దృష్టిపెట్టాలి.
*లబ్ధిదారులతో గ్రూపుల ఏర్పాటు*
ఆప్షన్ –3ని ఎంపిక చేసుకున్న ఇళ్ల పనులు అక్టోబరు 25 నుంచి మొదలుపెట్టడానికి అన్నిరకాల చర్యలు తీసుకోవాలి.
లబ్ధిదారులతో కలిపి గ్రూపులు ఏర్పాటు చేయాలి.
స్థానికంగా ఉన్న మేస్త్రీలతో వీరిని అటాచ్ చేయాలి.
ఇప్పటికే 2.25 లక్షల లబ్ధిదారులతో 18,483 గ్రూపులు ఏర్పాటు చేశారు.
ఈ నెలాఖరు కల్లా గ్రూపుల ఏర్పాటు పూర్తికావాలి.
లే అవుట్లలో నీటి వసతిని ఏర్పాటు చేయడంపై దృష్టిపెట్టాలి.
మిగిలిపోయిన లే అవుట్లలో విద్యుత్తు, నీటి వసతిని కల్పించడంపై దృష్టిపెట్టాలి.
సిమెంటు, బ్రిక్స్, ఐరన్ స్టీల్, మెటల్.. వీటి వినియోగం విపరీతంగా పెరుగుతుంది, ఆర్థిక వ్యవస్థ ఊపందుకుంటుంది.
కోవిడ్‌నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్న పరిస్థితుల్లో ఇళ్ల నిర్మాణం ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తుంది.
వేయి ప్లాట్లు కన్నా ఎక్కువ ఉన్నచోట... అక్కడే ఇటుకల తయారీని పెట్టాలి.
దీనివల్ల రవాణా ఖర్చులు కలిసి వస్తాయి.
సిమెంటుసబ్సిడీ రేటుపై ఇస్తున్నాం.
ఇసుకను ఉచితంగా ఇస్తున్నాం.
రీచ్ 40 కి.మీ కన్నా ఎక్కువ దూరం ఉంటే... మనమే రవాణా ఖర్చులు భరిస్తున్నాం
ఇళ్ల నిర్మాణం వల్ల ... మెటల్ ధరలు పెరగకుండా చూడాల్సిన బాధ్యత కలెక్టర్లదే
ధరలను నియంత్రణలో ఉంచితే అనుకున్న ఖర్చుకే ఇళ్లను కట్టవచ్చు
ఆప్షన్ –3 ఎంచుకున్న ప్రాంతాల్లో 1.75 లక్షలకే ఇంటి నిర్మాణం పూర్తవుతుందన్న విషయాన్ని మీ దృష్టికి తీసుకువస్తున్నాను
ఇళ్ల లబ్ధిదారులైన మహిళలకు రూ.35వేలు పావలా వడ్డీకే రుణాలు ఇచ్చేలా మాట్లాడుతున్నాం
బ్యాంకర్లతో సమావేశాలు ఏర్పాటు చేసుకుని వారికి రుణాలు అందించేలా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలి.
*హౌసింగ్ – కలెక్టర్లు సమీక్ష*
కలెక్టర్లు వారానికి ఒకసారి ఇళ్ల నిర్మాణంపై సమీక్ష చేయాలి
సంబంధిత శాఖలతో కలిపి సమీక్ష చేయాలి.
మున్సిపాల్టీ స్థాయిలో, మండలాల స్థాయిలో, పంచాయతీల స్థాయిలో, లే అవుట్ స్థాయిల్లో కూడా సంబంధిత అధికారులు ఇళ్ల నిర్మాణ ప్రగతిపై రివ్యూ చేయాలి
అలా చేయగలిగితేనే వేగంగా నిర్మాణాలు సాగుతాయి
కలెక్టర్, జాయింట్ కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లు ప్రతి వారం ఒక లే అవుట్‌ను పర్యవేక్షించాలి
జాయింట్ కలెక్టర్ హౌసింగ్, సబ్ కలెక్టర్, ఆర్డీఓలు ప్రతి వారంలో నాలుగు సార్లు లే అవుట్లలో క్షేత్రస్థాయి పర్యటనలు చేయాలి.
అధికారులు క్షేత్ర స్థాయి పర్యటనలు చేస్తేనే.. అక్కడ సమస్యలు ఏంటో తెలుస్తాయి.
పెద్ద లే అవుట్లలో నిర్మాణసామగ్రిని ఉంచడానికి, సైట్ ఆఫీసులకోసం గోడౌన్లను నిర్మించాలి.
ఉపాధిహామీ పనుల కింద ఈ గోడౌన్లను నిర్మించాలి.
*డిసెంబరులో జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం*
జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకంమీద అందరికీ అవగాహన కలిగించాలి
డిసెంబరులో ఈ పథకం ప్రారంభం అవుతుంది
ఇటీవలే మంత్రివర్గంలో ఓటీఎస్‌పై నిర్ణయం తీసుకున్నాం.
దాదాపుగా 67 లక్షలమందికి మేలు జరుగుతుంది
ఇళ్లను అమ్ముకోవాలన్నా, స్థలాలు అమ్ముకోవాలన్నా అమ్ముకోలేని పరిస్థితి.
కనీసం రుణాలు తెచ్చుకోలేని పరిస్థితి.
1980 లనుంచి 2011 వరకూ ఉన్న అన్ని ఇళ్లు, ఇంటి స్థలాలను విడిపించుకునేలా అవకాశం ఇస్తున్నాం.
ఆ ఆస్తులపై వారికి పూర్తి హక్కులు వస్తాయి.
బ్యాంకుల నుంచి రుణాలు తెచ్చుకోవచ్చు.
పేదలకు చాలా మంచి జరుగుతుంది.
పట్టా తీసుకున్నవారు, ఇల్లు కట్టుకున్నవారు.. హౌసింగ్ కార్పొరేషన్ నుంచి రుణాలు తీసుకున్న వారికి రూరల్‌ప్రాంతంలో రూ.10వేలు, మున్సిపాల్టీలలో రూ.15వేలు, కార్పొరేషన్లలో రూ.20వేల ఇస్తే చాలు వారికి ఓటీఎస్ కింద వర్తిస్తుంది.
పట్టా ఉండి, ఇల్లుకట్టుకుని, హౌసింగ్ కార్పొరేషన్ నుంచి రుణాలు తీసుకుని... ఎవరికైనా ఇంటిని అమ్మేసి ఉంటే... రూరల్ ప్రాంతంలో రూ.20వేలు, మున్సిపాల్టీల్లో రూ.30వేలు, కార్పొరేషన్లలో రూ.40వేల జమరేసి.. ఓటీఎస్‌కింద లబ్ధి పొంద వచ్చు.
పట్టా మాత్రమే తీసుకుని... రుణాలు తీసుకోకుండా... వాళ్లే ఆ స్థలంలో ఉంటే... ఇలాంటి కేటగిరీ వారికి రూ.10లతో రిజిస్ట్రేషన్ చేసి ఇస్తారు.
పట్టా తీసుకున్నవారు.. ఆ స్థలాన్ని వేరే వారికి అమ్మారు, ఇతరులు అక్కడ ఇల్లు కట్టుకున్నారు... అలాంటి వారికి రూరల్ ప్రాంతంలో రూ.10వేలు, మున్సిపాల్టీలలో రూ.15వేలు, కార్పొరేషన్‌లో రూ.20వేలు జమచేస్తే వారికి ఈ పథకం వర్తిస్తుంది
గ్రామ, వార్డు సచివాలయ స్థాయిలో ఈపథకం అమలు అవుతుంది.
ఈ పథకం అమలును ఆ స్థాయి వరకూ తీసుకెళ్తున్నాం
వెంటనే దీనికి సంబంధించి డేటాను అప్‌లోడ్‌చేసేలా చూడాలి.
వచ్చే 90 రోజుల్లో దీనికి సంబంధించి అన్ని పనులూ పూర్తికావాలి.
డిసెంబర్ 21న జగనన్న సంపూర్ణ శాశ్వత గృహ హక్కు పథకం అమలు.
*జగనన్న స్మార్ట్ టౌన్ షిప్స్*
టిడ్కో ఇళ్లకు సంబంధించి కొత్త లబ్ధిదారుల ఎంపిక పూర్తికావాలి
జగనన్న స్మార్ట్ టౌన్ షిప్స్‌లో ఎంఐజీ ప్లాట్లకు సంబంధించి తగిన చర్యలు తీసుకోవాలి
3.79 లక్షల మంది దీనికి ఆసక్తి చూపారు
ఇప్పటికి 1,001 ఎకరాలను అధికారులు గుర్తించారు
మరో 812 ఎకరాలకు సంబంధించి వెరిఫికేషన్‌ను వెంటనే పూర్తిచేయాలి.
మార్గదర్శకాలకు అనుగుణంగా భూమలను వెంటనే గుర్తించాలి.
రెగ్యులరీగా దీనిపై సమీక్ష చేయాలి.
అవసరమైన చేట భూసేకరణ, లేదా ల్యాండ్ పూలింగ్ చేయాలి.
అలాగే ప్రభుత్వ భూములను కూడా ఈ పథకంకోసం గుర్తించాలి.
మంచి ప్రాంతాల్లో భూములు ఉండేలా చూసుకోవాలి
న్యాయ వివాదాల్లేకుండా, క్లియర్ టైటిల్‌తో సరసమైన ధరలకే మధ్యతరగతి ప్రజలకు ప్లాట్లు అందుబాటులోకి వస్తాయి.
అన్నిరకాల మౌలిక సదుపాయాలను ఈ లే అవుట్లలో ఏర్పాటు చేస్తున్నాం.
అండర్ గ్రౌండ్‌కేబుల్, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, స్మార్ట్‌స్ట్రీట్ లైట్లు తదితర మౌలిక సదుపాయాలు వస్తాయి.
మంచి ప్రమాణాలతో లే అవుట్లు వారికి అందుబాటులోకి వస్తాయి.
చాలా మందికి ఇది ప్రయోజనం.
*ఉపాధి హామీ*
ఉపాధిహామీ పనులు మెటీరియల్ కాంపొనెంట్‌కు సంబంధించి విజయనగరం, విశాఖపట్నం, అనంతపురం జిల్లాలు దృష్టిపెట్టాలి
సచివాలయాలు, ఆర్బీకేలు, విలేజ్ క్లినిక్స్, బీఎంసీయూలు, డిజిటల్ లైబ్రరీల పనులు చురుగ్గా సాగాలి.
గత ప్రభుత్వం ఇవ్వని బిల్లులకు సంబంధించి ఇప్పుడు మనం ఇవ్వాల్సి వస్తోంది.
కేంద్రం నుంచి వచ్చిన డబ్బుకన్నా రాష్ట్ర ప్రభుత్వం నుంచి అధికంగా ఖర్చు చేశాం.
నిధులకు ఇబ్బందిలేకుండా అన్నిరకాల చర్యలు తీసుకుంటున్నాం.
కేంద్రం నుంచి రావాల్సిన నిధులపైనకూడా దృష్టిపెడుతున్నాం.
కలెక్టర్లు ఈ పనులపై దృష్టిపెట్టి... ముందుకుసాగేలా చర్యలు తీసుకోవాలి.
*వైయస్సార్ డిజిటల్ లైబ్రరీలు*
డిసెంబర్ 31 నాటికల్లా 4,530 పంచాయతీల్లో ఇంటర్నెట్ సదుపాయం అందుబాటులోకి వస్తోంది.
అన్ లిమిటెడ్ బ్యాండ్ విడ్త్ అందుబాటులోకి వస్తోంది
వర్క్ ఫ్రం హోం సౌకర్యం గ్రామాల్లో అందుబాటులోకి వస్తుంది.
ఆలోగా డిజిటల్ లైబ్రరీలు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలి.
డిజిటల్ లైబ్రరీల నిర్మాణానికి కావాల్సిన స్థలాలను వెంటనే గుర్తించేలా చర్యలు తీసుకోవాలి.
*విలేజ్, వార్డు సచివాలయాల తనిఖీ– ప్రాధాన్య కార్యక్రమం*
విలేజ్, వార్డు సచివాలయాల్లో తనిఖీలు చాలా ముఖ్యమైనవి.
అలసత్వం వహించిన వారిపై చర్యలకూ వెనుకాడం
కలెక్టర్లు ప్రతివారం 2 సచివాలయాలు, జాయింట్‌కలెక్టర్లు వారానికి 4 సచివాలయాలు, మున్సిపల్‌కమిషనర్లు, ఐటీడీఏ పీఓలు, సబ్ కలెక్టర్లు వారానికి నాలుగు సచివాలయాలను తప్పనిసరిగా స్పందించాలి.
నా ఆందోళన ఏంటంటే... మనం వెళ్లకపోతే, ఎలా పనిచేస్తున్నాయో చూడకపోతే పరిపాలన మెరుగుపడదు.
మీరు ఎంతమేర సందర్శిస్తే.. అంతగా మెరుగుపడుతుంది.
*డిసెంబరు నుంచి సచివాలయాల సందర్శనకు వస్తా...*
వచ్చే నెలనుంచి ఎమ్మెల్యేలు కూడా వారానికి నాలుగు సచివాలయాలను సందర్శించాలని చెప్తాం
డిసెంబర్ నుంచి నేను కూడా సచివాలయాలను సందర్శిస్తాను.
ప్రతి పర్యటనలో కూడా నేను సచివాలయాలను చూస్తాను.
గ్రామ, వార్డు సచివాలయాల సందర్శన చేస్తున్న సమయంలో ఏయే అంశాలపై దృష్టిపెట్టాలో మార్గదర్శకాలు కూడా ఇచ్చాం.
ప్రతి సచివాలయ సిబ్బంది, వాలంటీర్లతో కలిపి బృందాలుగా ఏర్పడి ప్రజల్లో అవగాహన, చైతన్యం కలిగించేలా ఆ గ్రామంలో పర్యటించమని చెప్పాం
ప్రతినెలా చివరి శుక్రవారం, చివరి శనివారం సిటిజన్ అవుట్‌రీచ్ కార్యక్రమం.
సెప్టెంబరు 24, 25 తేదీల్లో సిటిజన్ అవుట్‌రీజ్ కార్యక్రమం.
ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలు, అందిస్తున్న సేవలు, ముఖ్యమైన ఫోన్ నంబర్లతో కూడిన పాంప్లెట్లను వారికి అందించాలి.
ప్రజలకు ప్రభుత్వ కార్యక్రమాలపై అవగాహన కలిగించాలి.
జూన్, డిసెంబర్ నెలల్లో అన్ని పథకాలుఅర్హులైన వారందరికీ కూడా నిర్దేశించుకున్న రోజుల్లోగా మంజూరు జరగాలి.
*కోవిడ్, సీజనల్ వ్యాధులు:*
– కోవిడ్ తీవ్రత తగ్గింది. ఉద్ధృతంగా ఉన్న కాలంలో పాజిటివిటీ రేటు 25.56 శాతం నమోదైంది.
ప్రస్తుతం 2.5 శాతం కన్నా తక్కువగా ఉంది.
– రికవరీ రేటు కూడా 98.63 శాతంగా ఉంది.
– కోవిడ్‌పట్ల ఎలాంటి అలసత్వం వద్దు.
– 2 డోసుల వ్యాక్సినేషన్ 100శాతం పూర్తయ్యేంతవరకూ కూడా ఎలాంటి పరిస్థితుల్లో కోవిడ్ పట్ల నిర్లక్ష్యం వద్దు.
– కోవిడ్ పరిస్థితులపై ఎప్పటికప్పుడు సమీక్షచేసుకుని తగిన చర్యలు తీసుకోవాలి.
– కోవిడ్ నిబంధనలను ఉల్లఘించే వారికి కఠినంగా వ్యవహరించాలి. జరిమానాలు విధించాలి.
– మాస్కులు వినియోగించకపోతే కచ్చితంగా చర్యలు తీసుకోవాలి.
– దుకాణాల్లో మాస్కుల వినియోగం తప్పనిసరి.
– ప్రజలు గుమిగూడకుండా చూడాలి. ఆంక్షలు కొనసాగించాలి.
*ధర్డ్ వేవ్ సన్నద్ధత*
– 104 నంబర్ అనేది ఒన్‌స్టాప్ సొల్యూషన్‌గా నడవాలి.
– 104 నంబర్‌కు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి.
– ప్రతివారం కూడా 104 నంబర్ పనితీరుపై సమీక్షచేయాలి.
– థర్డ్‌వేవ్ వస్తుందో, లేదో తెలియదుగాని, మనం అప్రమత్తంగా ఉండాలి.
– టీచింగ్ ఆస్పత్రులు, ఆస్పత్రుల్లో అన్నికకాలుగా సిద్ధంకావాలి.
– కావాల్సిన పరికరాలను, మందులను అందుబాటులో ఉంచుకోవాలి.
– మీ జిల్లాల్లోని టీచింగ్ ఆస్పత్రులకు జాయింట్‌కలెక్టర్ హౌసింగ్‌ను అడ్మిన్ ఇన్‌ఛార్జిగా నియమించాలి.
– నవంబర్ 15 నుంచి విలేజ్ క్లినిక్స్ నుంచి పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలు, ఏరియా ఆస్పత్రులు, జిల్లా ఆస్పత్రుల్లో కావాల్సిన సిబ్బందిని అందరినీ అందుబాటులో ఉంచాలి.
– డిప్యుటేషన్లను పూర్తిగా రద్దు చేయాలి. ఎట్టిపరిస్థితుల్లోనూ డిప్యుటేషన్లకు అనుమతి ఇవ్వొద్దు.
– ఎక్కడ సిబ్బంది లేకపోయినా ఆరోగ్యశాఖ సెక్రటరీని, కలెక్టర్లను బాధ్యుల్ని చేస్తాను.
*ప్రైవేటు ఆస్పత్రుల్లోనూ పీఎస్‌ఏ ప్లాంట్లు*
– 100 బెడ్లకు మించి ఉన్న ప్రైవేటు ఆస్పత్రుల్లోకూడా ఆక్సిజన్ జనరేషన్‌ప్లాంట్లు ఉంచేలా చూడాలి.
– ప్రభుత్వ ఆస్పత్రుల్లో 143 ప్రాంతాల్లో పీఎస్‌ఏ ప్లాంట్లు పెడుతున్నాం. అక్టోబరు 10 కల్లా పీఎస్‌ఏ ప్లాంట్లన్నీ ఏర్పాటవుతాయి.
– ఇదే తరహాలో 100 బెడ్లు దాటిన ప్రైవేటు ఆస్పత్రుల్లో కూడా ఆక్సిజన్ జనరేషన్‌ప్లాంట్లను ఏర్పాటు చేయాలి.
– ప్రైవేటు ఆస్పత్రులకు 30శాతం సబ్సిడీ కూడా ఇస్తున్నాం. ఇతర రాష్ట్రాల్లో ఇలాంటి సదుపాయం లేదు.
– ప్రైవేటు ఆస్పత్రులు డిటైప్ సిలెండర్లను, కాన్‌సన్‌ట్రేటర్లనుకూడా అందుబాటులో ఉంచుకునేలా చూడాలి. థర్డ్‌వేవ్‌ను ఎదుర్కోవడంలో ఇవన్నీ సన్నాహకాలు.
*ఫిబ్రవరి నాటికి సంపూర్ణ వ్యాక్సినేషనే లక్ష్యం*
- ప్రస్తుతం మనం 2,59,55,673 మందికి వ్యాక్సినేషన్ ఇచ్చాం.
– వీరిలో 1,24,25,525 కోట్లమందికి రెండు డోసుల వ్యాక్సినేషన్ పూర్తయింది.
– 1,35,30,148 మందికి సింగిల్ డోసు వ్యాక్సినేషన్ పూర్తయింది.
– 18 సంవత్సరాలు దాటిన వారికి నవంబర్ 30 నాటికి 3.5 కోట్ల మందికి కనీసం ఒక డోసు వ్యాక్సిన్ ఇవ్వగలుగుతాం.
– వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికి ప్రజలందరికీ పూర్తిగా 2 డోసులు ఇవ్వగలుగుతాం.
– వ్యాక్సినేషన్‌పైనా కలెక్టర్లు దృష్టిసారించాలి.
– రెండో డోసును సకాలంలో అందించేలా చర్యలు తీసుకోవాలి.
– వచ్చే 10 రోజుల్లో 26,37,794 మందికి సెకండ్ డోసు వ్యాక్సిన్ ఇవ్వడానికి చర్యలు తీసుకుంటున్నాం.
– గుంటూరు, విజయనగరం, అనంతపురం, తూర్పుగోదావరి జిల్లాలకు చెందిన కలెక్టర్లు వ్యాక్సినేషన్‌పై ప్రత్యేక దృష్టిపెట్టాలి.
– 18 సంవత్సరాల దాటిన ప్రతి ఒక్కరికీ వ్యాక్సినేషన్ చేపట్టాలి.
– మలేరియా, గెండీ, డయేరియా, టైఫాయిడ్ వంటి సీజనల్ వ్యాధులపైనా దృష్టిపెట్టండి.
*వ్యవసాయం:*
– ఇ క్రాపింగ్‌పై కలెక్టర్లు దృష్టిసారించాలి
– కలెక్టర్లు, జాయింట్‌కలెక్టర్లు 10శాతం ఇ– క్రాపింగ్‌ను తనిఖీలు చేయాలి
– జేడీఏలు, డీడీఏలు 20శాతం క్రాపింగ్‌ను తనిఖీ చేయాలి
– అగ్రికల్చర్ అధికారులు, హార్టికల్చర్ అధికారులు 30 శాతం ఇ– క్రాపింగ్‌ను తనిఖీచేయాలి.
– ఇ – క్రాపింగ్‌అనేది చాలా ముఖ్యం.
– ఇ– క్రాపింగ్ కింద డిజిటల్, ఫిజికల్ రశీదులు ఇవ్వాలి.
– ఇ– క్రాపింగ్ అనేది నిరంతర ప్రక్రియ.
– ల్యాండు వివరాలు, డాక్యుమెంట్లకోసం రైతులను ఇబ్బంది పెట్టొద్దు.
*అగ్రికల్చర్ అడ్వైజరీ కమిటీ*
– అగ్రికల్చర్ అడ్వైజరీ కమిటీ సమావేశాలపై దృష్టిపెట్టాలి.
– ఆర్బీకేలు, మండల, జిల్లా స్థాయిల్లో ఈసమావేశాలు జరగాలి.
– ఆర్బీకే స్థాయి సమావేశాల్లో వస్తున్న అంశాలపై మండలస్థాయిలో, మండలస్థాయిలో వస్తున్న అంశాలపై జిల్లా స్థాయి సమావేశాల్లో చర్చ జరగాలి.
– సమస్యల పరిష్కారంపై సంబంధిత అధికారులు దృష్టిపెట్టాలి.
– జిల్లా స్థాయిల్లో వస్తున్న అంశాలపై విభాగాధిపతులు, కార్యదర్శులు దృష్టిపెట్టాలి.
*క్రాప్ ప్లానింగ్*
– క్రాప్ ప్లానింగ్‌పైన అడ్వైజరీ కమిటీ సమావేశాల్లో దృష్టిపెట్టాలి.
– ఉత్తమ యాజమాన్య పద్ధతులపైనా చర్చించాలి.
– ఆర్బీకేల పనితీరు, సీహెచ్‌సీల పనితీరుపైనా చర్చించాలి.
– సీఎంయాప్‌పైన కూడా అడ్వైజరీ కమిటీ సమావేశాల్లో చర్చ జరగాలి.
– ఇతర జిల్లాల్లో, ఇతర రాష్ట్రాల్లో ఉత్తమ యాజమాన్య పద్ధతులపైనా అడ్వైజరీ కమిటీలకు అవగాహన కల్పించే కార్యక్రమంపై దృష్టిపెట్టాలి.
– ఆర్బీకేలను కలెక్టర్లు సందర్శిస్తున్నప్పుడు కియోస్క్‌ల పనితీరుపైనా దృష్టిపెట్టాలి.
– డెలివరీ షెడ్యూలు సరిగ్గా ఉందా?లేదా?అన్నదానిపైనా కూడా దృష్టిపెట్టాలి.
*కలెక్టర్లు, ఎస్పీల భేటీ*
– ఎస్పీలు, కలెక్టర్లు ప్రతి వారం సమావేశంకావాలి. ప్రైవేటు వ్యాపారులు, వారి దుకాణాలపై పరిశీలన చేయాలి.
– నాణ్యమైనవి అమ్ముతున్నారా? లేదా?ధరలు అదుపులో ఉన్నాయా? లేదా? పరిశీలన చేయాలి.
– అప్పుడే నకిలీల బెడద తగ్గుతుంది.
– రైతులకు అవసరమైన ఎరువులు ఇతరత్రా సరిపడా అందుబాటులో ఉన్నాయా? లేవా చూడాలి.
*ఆర్బీకేల్లో బ్యాంకింగ్ సేవలు*
– ఆర్బీకేల్లో బ్యాకింగ్ కరస్పాండెంట్లను ఉంచుతున్నారు.
– వీరు విధులు సక్రమంగా నిర్వహిస్తున్నారా? లేదా? రైతులకు వీరినుంచి సేవలు అందుతున్నాయా? లేవా? అన్నదానిపై పరిశీలన చేయాలి.
– ఏమైనా సమస్యలు ఉంటే వీటిని బ్యాంకుల దృష్టికి తీసుకెళ్లడానికి వీలుంటుంది.
– కౌలు రైతులకు రుణాలు అందేలా చూడాలి.
– వీరిని ఇ– క్రాపింగ్‌తో లింక్‌చేశాం.
– ఇన్‌పుట్‌సబ్సిడీ, బీమా, పంటలకు ధరలు కల్పించడం.. ఇవన్నీకూడా కౌలు రైతులకు అందాలి.
– కౌలు రైతులకు రైతు భరోసా ఇస్తున్న రాష్ట్రం కూడామనదే.
– పంట సాగు చేస్తున్న వారందరికీ కూడా పంట రుణాలు అందేలా చర్యలు తీసుకోవాలి.
*అక్టోబరులో సంక్షేమ పథకాలు*
దసరా (విజయదశమి) రోజున ఆసరా పథకం అమలు.
అక్టోబరు 7 నుంచి 10 రోజలుపాటు ఆసరా పథకంపై ప్రజల్లో అవగాహన, చైతన్య కార్యక్రమాలు
అవగాహన, చైతన్య కార్యక్రమాల్లో ఎమ్మెల్యే సహా ప్రజాప్రతినిధులు పాల్గొంటారు
ఎమ్మెల్యేలు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచులు ఇందులో పాల్గొంటారు
ఆసరా చెక్కుల పంపిణీయేకాకుండా ఆసరా, చేయూత, దిశలు మహిళా సాధికారిత దిశగా ఏ విధంగా అడుగులు వేశామో వారికి చెప్తారు
ఆసరా, చేయూత ద్వారా జీవితాలను మెరుగుపరుచుకున్న వారి విజయాలను మహిళలకు వివరిస్తారు
ఆసరా, చేయూతల ద్వారా వారి జీవితాలను ఎలా మార్చుకోవచ్చో కూడా వివరిస్తారు.
మండలం ఒక యూనిట్‌గా ఈకార్యక్రమాలు జరుగుతాయి.
దాదాపు రూ.6500 కోట్లును వైయస్సార్ ఆసారా కింద ఇస్తున్నాం.
దాదాపు 80లక్షల మందికిపైగా మహిళలు లబ్ధిపొందుతారు.
ప్రభుత్వం చేపడుతున్న అతిపెద్ద కార్యక్రమం ఇది.
క్లీన్ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమం ‘‘క్లాప్’’ అక్టోబరు 1న ప్రారంభం
అక్టోబరు 19న జగనన్న తోడు కార్యక్రమం
దీనికింద చిరు వ్యాపారులకు వడ్డీలేని రుణాలు
అక్టోబరు 26న రైతులకు ‘‘వైయస్సార్ సున్నావడ్డీ రుణాలు’’ కార్యక్రమం
దీంతోపాటు ఈ ఏడాది రైతు భరోసా రెండో విడత అమలు
కలెక్టర్లు ఈ కార్యక్రమాలను విజయవంతం చేయడానికి అన్నిరకాల చర్యలు తీసుకోవాలి అని సీఎం శ్రీ వైయస్.జగన్ కలెక్టర్లకు నిర్దేశించారు.
ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, డీజీపీ గౌతం సవాంగ్, ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ చీఫ్ కమిషనర్ నీరబ్ కుమార్ ప్రసాద్, వ్యవసాయశాఖ స్పెషల్ సీఎస్ పూనం మాలకొండయ్య, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ స్పెషల్ సీఎస్ వై శ్రీలక్ష్మి, గృహనిర్మాణశాఖ స్పెషల్ సీఎస్ అజయ్ జైన్, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, రెవెన్యూశాఖ ముఖ్య కార్యదర్శి వి ఉషారాణి, పంచాయతీరాజ్ కమిషనగర్ గిరిజాశంకర్, వ్యవసాయశాఖ కమిషనర్ హెచ్ అరుణ్‌కుమార్, డీఐజీ (దిశ) బి రాజకుమారి, ఏపీ టిడ్కో ఎండీ సీహెచ్ శ్రీధర్, ఏపీఎస్‌హెచ్‌సీఎల్ ఎండీ ఎన్ భరత్ గుప్తా ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
addComments
Post a Comment