వినాయకచవితి ఉత్సవములు ప్రారంభం:

 వినాయకచవితి ఉత్సవములు ప్రారంభం: 


శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానము, ఇంద్రకీలాద్రి,విజయవాడ (ప్రజా అమరావతి):  

       శ్రీ ప్లవ నామ సంవత్సర భాద్రపద శుద్ధ చవితి,శుక్ర వారం నుండి భాద్రపద శుద్ధ షష్ఠి, ఆది వారం వరకు అనగా ది.10.09.2021 నుండి ది.12.09.2021 వరకు ఉపాలయము అయిన శ్రీ శివకామ సుందరీ సమేత నటరాజస్వామి వారి ఆలయము నందు గల శ్రీ వినాయక స్వామి వారి ఆలయము నందు మరియు కొండపైన చిన్న రాజగోపురము వద్ద గల లక్ష్మీ గణపతి విగ్రహము వద్ద ఏర్పాటు చేసిన మృత్తికా గణపతి వద్ద ఆలయ స్థానాచార్యులు శ్రీ విష్ణుభట్ల శివప్రసాద శర్మ గారు మరియు వైదిక కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో వినాయక చవితి ఉత్సవములను త్రయాహ్నిక దీక్షాపూర్వకముగా నిర్వహించుట జరుగుచున్నది. 

     ఈ కార్యక్రమముల యందు ఆలయ చైర్మన్ శ్రీ పైలా సోమినాయుడు గారు మరియు కార్యనిర్వహణాధికారి శ్రీమతి డి.భ్రమరాంబ గారు పాల్గోని భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. 


ఈరోజు కార్యక్రమ వివరములు: 

        ఉదయం 09.10 గ.లకు విఘ్నేశ్వర స్వామి వారికి పూజ నిర్వహించుట జరిగినది. అనంతరం కలశ స్థాపన, విశేష పత్రి పూజ, వినాయక చవితి కధాశ్రవణం నిర్వహించుట జరిగినది.


సా.04-30 గం.ల నుండి సా.06-30 గం.ల వరకు:   మండప పూజ, హారతి, మంత్ర పుష్పములు మరియు తీర్ధ ప్రసాద వితరణ జరుగును.

Comments