తన ప్రాంత ప్రజలకు ఇబ్బంది కలిగించి, అభద్రతను కల్గిస్తే ఊరుకునేది లేదని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్యశాఖ, పాడి పరిశ్రమాభివృద్ది శాఖా మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు అన్నారు. గురువారం శ్రీకాకుళం జిల్లా

 *ప్రజల భద్రతకు ముప్పు కలిగిస్తే   ఊరుకునేది లేదు.*


*రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్యశాఖ పాడిపరిశ్రమాభివృద్ది శాఖా మంత్రి  డాక్టర్ సీదిరి అప్పలరాజు.*


*మందస మాణిక్యపురం గ్రామాన్ని సందర్శించిన రాష్ట్ర మంత్రి.**ప్రజలు ఎవరూ ఆందోళన చెందవద్దని కోరిన మంత్రి.*


*అంగన్వాడీ కేంద్రానికి తాళాలు వేసిన వారిపై  చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించిన మంత్రి.*


*ఒరిస్సా అధికారుల చర్యలను అడ్డుకున్న మంత్రి.*


*సర్వే ఆఫ్ ఇండియా ఇచ్చే నివేదిక ఆధారంగా ముందుకు పోతాం.*


పలాస (ప్రజా అమరావతి);


తన ప్రాంత ప్రజలకు ఇబ్బంది కలిగించి, అభద్రతను కల్గిస్తే ఊరుకునేది లేదని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్యశాఖ, పాడి పరిశ్రమాభివృద్ది శాఖా మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు అన్నారు. గురువారం శ్రీకాకుళం జిల్లా


మందస మండలం  సాబకోట పంచాయితీ లో మణిక్యపురం   గ్రామాన్ని రాష్ట్ర మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు  సందర్శించారు.  అంగన్వాడీ కార్యకర్త భర్త ను ఒరిస్సా పోలీసులు అరెస్టు చేసిన విషయం పై స్థానిక ఎంపీడీవో ఎమ్మార్వో, కాశీబుగ్గ డిఎస్పీ తోపాటు ఇతర అధికారులను అడిగి తెలుసుకున్నారు. 

 మాణిక్యపురం  గ్రామస్తులతో  మంత్రి మాట్లాడుతూ  అన్ని విధాల ప్రభుత్వం   ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. ఎవరికి  ఎటువంటి సమస్యలు ఉన్న వెంటనే తెలియజేయాలని తెలిపారు. అంగన్వాడీ కేంద్రం పై జరిగిన విషయం కోసం  ఒరిస్సా అధికారులతో చర్చలు జరుపుతున్నామని అన్నారు. తప్పు చేసే వారిపై తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి కోరారు. తన నియోజకవర్గంలో ప్రజలకు ఇబ్బందులు కలిగించి భయాందోళనలు సృష్టించిన వ్యక్తులు ఎవరైనా సరే ఉపేక్షించమని అన్నారు. ఒరిస్సా, ఆంధ్ర బోర్డర్స్ విషయమై ముఖ్యమంత్రి తో చర్చి పూర్తి స్థాయి భద్రత మా ప్రజలను కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. రెవెన్యూ అధికారులు, పోలీసు అధికారులు దగ్గర ఉండి ఆంధ్రా ప్రాంత హద్దులను గుర్తించాలని సూచించారు. ఎవరైనా సరిహద్దు దాటి దాడులకు పాల్పడటం తోపాటు నిబందనలకు విరుద్దంగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని కాశీబుగ్గ డిఎస్పీ శివరామిరెడ్డికి సూచించారు. మన ప్రజల మాన, ప్రాణాలను కాపాడుకునే అవసరం మనపై ఉందని తెలిపారు. నియోజకవర్గం ప్రతినిధిగా  అంగన్వాడీ కేంద్రానికి ప్రక్క రాష్ట్రం వాల్లు వచ్చి తాళాలు వేయడంపై అవమానంగా ఉందని అధికారుల పర్యవేక్షణ లోపం తేటతెల్లం అవుతుందని తీవ్రస్థాయిలో ఆవేదన చెందారు. దాయాది ప్రాంతాలు వాస్తవాలను గ్రహించాల్సిన అవసరం ఉందని సున్నితమైన సమస్యలను చర్చలతో తీర్చుకోవాలే తప్ప ఆందోళన కలిగించే చర్యలు చేపట్టడం వలన ప్రాంతాల మద్య విభేదాలు తలెత్తుతాయని అన్నారు. గిరిజన ప్రాంతాలలో ఉన్న ఏఒక్కరికైనా ప్రమాదం తలెత్తిన  పద్దతిగా ఉండదని హెచ్చరించారు. మాణిక్యపురం గ్రామస్తులకు న్యాయం జరిగేలా చూస్తానని మరోసారి ఇలాంటి సంఘటనలు జరగకూడదని అధికారులకు హెచ్చరించారు.


గ్రామస్తులతో మాట్లాడి మంత్రి డాక్టర్ అప్పలరాజు తిరుగు ప్రయాణం అవుతున్న క్రమంలో ఒరిస్సాకు చెందిన గజపతి జిల్లా అడిషనల్ డిస్ట్రిక్ మెజిస్ట్రేట్  మాణిక్యపురం గ్రామం చేరుకు ప్రజలను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయగా రాష్ట్ర మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు వెంటనే మాణిక్యపురం గ్రామం చేరుకుని సంబందిత ఒరిస్సా అధికారుల చర్యలను అడ్డుకుని తీవ్రస్థాయిలో ప్రతిఘటించారు. రాష్ట్రాల హద్దులు ఏకపక్షంగా ఉండకూడదని అన్నారు. భౌగోళిక అంశాలను సర్వే ఆఫ్ ఇండియా ఇచ్చిన నివేదికల ప్రకారం సరిహద్దులను ఏర్పాటు చేసుకుంటామని అన్నారు. అందుకే మరోసారి సర్వే ఆఫ్ ఇండియాను ఆశ్రయించి హద్దుల నివేదిక ఇవ్వాలని కోరామని మంత్రి ఒరిస్సా అధికారులకు తెలిపారు. ఈ విషయంలో శ్రీకాకుళం జిల్లా కలెక్టర్, ఒరిస్సా రాష్ట్రానికి చెందిన గజపతి జిల్లా కలెక్టర్ లు ఇరువురు చర్చించి తుది నిర్ణయాణికి‌ వచ్చి ప్రజలకు మేలు జరిగేలా చూడాలని కోరారు. అంతర రాష్ట్ర సమస్యలను ఏకపక్ష వైఖరితో వ్యవహరించి ఆంధ్రప్రదేశ్‌లోని సంబందిత అధికారులకు సమాచారం లేకుండా ఎటువంటి నోటీసులు జారీవేయకుండా దుందుడుకు చర్యలు చేపట్టడం తగదని అన్నారు. మాణిక్యపురం అంగన్వాడీ కేంద్రానికి తాళం వేయడం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని అవమాన పరచడమే అవుతుందని ప్రభుత్వా ఆస్తి అయినటువంటి అంగన్వాడీ కేంద్రానికి తాళం ఎలా వేస్తారని మంత్రి ఒరిస్సా అధికారులను ప్రశ్నించారు. అంతే కాకుండా గిరిజన ప్రజలపై ఒరిస్సా అధికారుల చర్యలు చాలా బాధాకరమైన వని తెలిపారు. అంగన్వాడీ కార్యకర్త భర్తను అరెస్టు చేయడంపై అసహనాన్ని వ్యక్తం చేశారు. చట్టాన్ని ఒరిస్సా అధికారులు తమ‌ చేతుల్లోకి తీసుకుని వింతగా ప్రవర్తిస్తున్నారని. నిబందనలను ఉల్లంగించి ఎటువంటి నోటీసులు లేకుండా ఒక గిరిజన వ్యక్తిని అరెస్టు చేయడంతో పాటు ప్రభుత్వా ఆస్తులపై దాడి చేయడం హేయమైన చర్య అందుకే దాడులకు పాల్పడి అక్రమ‌ అరెస్టు చేసిన అధికారులపై తక్షణమే చట్టపరమైన చర్యలు చేపట్టాలని కోరారు.  అనవసరంగా నిబందనలను ఉల్లంగిస్తే చూస్తూ ఊరుకునే పరిస్థితి ఉండదని ఒరిస్సా అధికారులను హెచ్చరించారు. ఏవైనా లోపాలు ఉంటే ఉన్నత స్థాయి అధికారులతో చర్చించాలని కోరారు.*_టెక్కలి సబ్ కలెక్టర్ వికాస్ కు మంత్రి డాక్టర్ అప్పలరాజు అభినందలు._*


ప్రాంతాల మద్య సమస్యలు తలెత్తినప్పుడు ఒక అధికారిగా టెక్కలి సబ్ కలెక్టర్ వికాస్ తీసుకున్న చొరవ. భౌగోళిక పరిస్థితులపై ఆయన పూర్తి స్థాయి పరిశోధన, పరిశీలన చేసి సరి హద్దుల అంశాలను ఒరిస్సా అధికారులకు వివరించిన తీరు చూసి రాష్ట్ర మంత్రి డాక్టర్ అప్పలరాజు అభినందనలు తెలిపారు. ఇది ఆంధ్రప్రదేశ్ కు చెందిన ప్రాంతం అని గట్టిగా చెప్పడమే కాకుండా పూర్తి ఆధారాలతో ఆయన ఒరిస్సా అధికారుకు తెలిపారు.  ప్రజల సమస్యను పరిష్కరించేందుకు అధికారిగా ఆయన చూపిన చొర నిజంగా మెచ్చుకోదగినది. ఇలాంటి అధికారులు ఉన్నంత వరకు ప్రజలకు మేలు జరుగుతుందని మంత్రి అన్నారు. 


ఈ కార్యక్రమంలో టెక్కలి సబ్ కలెక్టర్ , కాశీబుగ్గ డిఎస్పీ రామిరెడ్డి, మందస ఎంపిడిఓ, తాసిల్దార్ తోపాటు ఇతర అధికారులు వైసిపి నాయకులు, గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.