పొదలకూరు ప్రాంతానికి, నెల్లూరు జిల్లాకి దొడ్ల కుటుంబం అందించిన సేవలు అమోఘం.


*శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా (ప్రజా అమరావతి), సర్వేపల్లి నియోజకవర్గం, పొదలకూరు మండలం, మహమ్మదాపురం గ్రామంలో దొడ్ల వారి కుటుంబం 1 కోటి 60 లక్షల రూపాయలతో  పునర్నిర్మించిన బి.సి.బాలుర వసతి గృహం ప్రారంభోత్సవంలో జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు గారితో కలిసి పాల్గొన్న వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, సర్వేపల్లి శాసనసభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి .*
 పొదలకూరు ప్రాంతానికి, నెల్లూరు జిల్లాకి దొడ్ల కుటుంబం అందించిన సేవలు అమోఘం.


 జన్మస్థలం, మహమ్మదాపురం గ్రామంలో దొడ్ల సుబ్బారెడ్డి గారు, దొడ్ల చెంచు రామిరెడ్డి గారు తమ తల్లి దొడ్ల శంకరమ్మ జ్ఞాపకార్థం యస్.సి., బిసి, వసతి గృహాలు 60 సంవత్సరాల క్రితం నిర్మించారు.

 మహమ్మదాపురం గ్రామంలో ఉన్నత పాఠశాల నిర్మించడంతో పాటు, దానికి అనుబంధంగా వసతి గృహాలు నిర్మించడంతో పేద, దళిత, వెనుకబడిన వర్గాల బిడ్డలు ఉన్నత విద్యను అభ్యసించే అవకాశం కల్పించారు.

 నెల్లూరుకే తలమానికంగా ఉన్న దొడ్ల కౌసల్యమ్మ మహిళా కళాశాల, దొడ్ల సుబ్బారెడ్డి ప్రభుత్వ వైద్యశాల ఏర్పాటు చేయడంతో, సమాజానికి విద్యా, వైద్యం అందించేందుకు విశేషంగా కృషి చేశారు.

 నెల్లూరు జిల్లా కేంద్రంలో దొడ్ల పద్మావతమ్మ గ్రంధాలయాన్ని నిర్మించి, ఎంతో మంది పుస్తక ప్రియులకు అవసరమైన పుస్తకాలను గ్రంథాలను అందుబాటులోకి తెచ్చారు.

 నెల్లూరు పట్టణం, దర్గామిట్టలో దొడ్ల చెంచు రామిరెడ్డి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నెలకొల్పడం ఎంతోమంది పేద విద్యార్థుల పాలిట వరంగా మారింది.

 మహనీయుడు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ ఆశించిన స్థాయిలో ఈ సమాజంలో విద్య వైద్యం అందించడానికి నెల్లూరు జిల్లాలో దొడ్ల కుటుంబం చేపట్టిన కార్యక్రమాలు ఎంతో మంది జీవితాల్లో వెలుగులు నింపాయి.

 దొడ్ల సుబ్బారెడ్డి, దొడ్ల చెంచు రామిరెడ్డి గార్ల పంథాలోనే నడుస్తూ, దొడ్ల శేషా రెడ్డి గారు తమ పూర్వీకులు నిర్మించిన పాఠశాలలు, వసతి గృహాలు పునర్నిర్మించడానికి ప్రయత్నించడం అభినందనీయం.

 దొడ్ల శేషా రెడ్డి గారు చేపడుతున్న ఈ కార్యక్రమాలకు ఆయన కుమారులు దొడ్ల సుబ్బారెడ్డి, దొడ్ల సునీల్ రెడ్డి సహాయ సహకారాలు మరిచిపోలేనటువంటివి.

 ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, నాడు-నేడు పథకం కింద స్కూళ్ల అభివృద్ధికోసం ప్రత్యేక దృష్టి పెడుతున్నారు.

 జగన్మోహన్ రెడ్డి గారి చొరవతో మునుపెన్నడూ లేనివిధంగా స్కూళ్ల అభివృద్ధి, పిల్లలకు అన్ని రకాల మౌలిక సదుపాయాలతో విద్యావిధానాన్ని కొనసాగించేందుకు అవకాశం కలిగింది.

 విద్యార్థుల భవిష్యత్తు కోసం ఆరాటపడుతున్న దొడ్ల కుటుంబానికి అభినందనలు తెలియజేస్తూ, ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా.

Popular posts
భారీ గజమాలతో సత్కరించిన అభిమానులు
Image
సంక్షేమ నవశకానికి నాంది నవరత్నాల పథకాలు :
శ్రీవారికి పట్టువస్త్రాల సమర్పణ
ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖలో తీసుకువస్తున్న రిఫార్మ్స్,టెక్నాలజీ వినియోగంలో రాష్ట్రంలోని క్షేత్రస్థాయి అధికారులకు అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ట్యాబ్ లను అందజేసిన డి‌జి‌పి గౌతం సవాంగ్ IPS గారు. కార్యక్రమంలో పాల్గొన్న కడప జిల్లా ఎస్పి అన్బురాజన్ IPS .
Image
అక్టోబర్ 30న మెగా జాబ్ మేళా : ఐ.టీ, పరిశ్రమలు , నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి
Image