ఆసుపత్రి అభివృద్ధి సమావేశం నిర్వహించిన కాకాణి"

 *"ఆసుపత్రి అభివృద్ధి సమావేశం నిర్వహించిన కాకాణి"


**శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా (ప్రజా అమరావతి), సర్వేపల్లి నియోజకవర్గం, పొదలకూరు మండలంలోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశం నిర్వహించిన వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, సర్వేపల్లి శాసనసభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి .*ఆసుపత్రి అభివృద్ధి కోసం, చికిత్స నిమిత్తం ఆసుపత్రికి వచ్చే వారికి వసతి, సదుపాయాల కల్పన కోసం కమిటీ సభ్యులు, వైద్యులు, సిబ్బందితో చర్చించి, అనేక నిర్ణయాలు తీసుకున్నాం.


 పొదలకూరు సామాజిక ఆరోగ్య కేంద్రం ద్వారా కోవిడ్ సమయంలో విశేష సేవలందించి అనేక మంది ప్రాణాలు కాపాడగలిగాం.


 కోవిడ్ సమయంలో సమర్థవంతంగా పని చేసిన వైద్యులు, సిబ్బంది, అధికారులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు.


 సర్వేపల్లి నియోజకవర్గంలో ప్రజలకు అన్ని వసతి సదుపాయాలు కల్పించడంతోపాటు,విద్య, వైద్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నాం.


 పొదలకూరు సామాజిక ఆరోగ్య కేంద్రం ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మకమైన *"కాయకల్ప"* అవార్డు చేజిక్కించుకోవడం సంతోషం.


 నియోజకవర్గంలోని మరొక ముత్తుకూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం జాతీయ స్థాయిలో గుర్తింపును పొందడం అభినందనీయం.


కోవిడ్ మూడో విడత సంకేతాలు వెలువడుతున్న దృష్ట్యా ఆస్పత్రిలో అవసరమైన ఆక్సిజన్ బెడ్లను సిద్ధంగా ఉంచాం.


 ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కోవిడ్ నేపథ్యంలో ఆసుపత్రికి అవసరమైన సిబ్బందిని నియమించి, కరోనా సోకిన వారికి సేవలు అందించేందుకు వెసలుబాటు కల్పించారు.


ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మొదటి విడత, రెండో విడత సమయంలో వరుసగా సమీక్షలు నిర్వహించి, కరోనా వ్యాధి నయం చేయడానికి అవసరమైన మందులను ఆస్పత్రులకు చేర్పించారు.


 సర్వేపల్లి నియోజకవర్గంలోని ఆరోగ్య కేంద్రాల ద్వారా అధికార పార్టీ శాసన సభ్యునిగా రెండు సంవత్సరాల కాల వ్యవధిలో చికిత్స కోసం వస్తున్నవారికి, ఎటువంటి ఇబ్బందులు కలగకుండా సేవలందిస్తున్నాం.


 సర్వేపల్లి నియోజకవర్గంలోని ఆరోగ్య కేంద్రాల నిర్వహణ, పనితీరు పట్ల అన్ని వర్గాల ప్రజలు తమ సంతృప్తిని వ్యక్తం చేయడం సంతోషం.


ప్రభుత్వం కల్పిస్తున్న వనరులతో పాటు, ఆసుపత్రి అభివృద్ధి నిధులను ఆసుపత్రి అభివృద్ధి కోసం వెచ్చించి, చికిత్స కోసం  వచ్చే ప్రతి ఒక్కరికి సమగ్రమైన, సంపూర్ణమైన వైద్యం అందించేందుకు కృషి చేస్తాం.