మన స్థాయి ఎంత ఉన్నా స్పందించే హృదయం ఉంటే చేయూత నివ్వవోచ్చు

 


కొవ్వూరు  (ప్రజా అమరావతి);



దిరిసిపోము యిర్మీయా గారి ఇల్లు అగ్నిప్రమాదం కి గురైన సందర్భంలో గ్రామస్థులు స్పూర్తితో స్పందించడం అభినందనీయమని రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత పేర్కొన్నారు.




సోమవారం ఇటీవల దొమ్మేరు గ్రామంలో జరిగిన అగ్ని ప్రమాదంలో ఇల్లు కోల్పోయిన  బాధిత కుటుంబాన్ని  ప్రభుత్వ సలహాదారులు రాజీవ్ కృష్ణ,  మాజీ ఎమ్మెల్సీ కె. శివ రామ కృష్ణ లతో కలిసి పరామర్శించిన శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత పరామర్శించారు. ఈ సందర్భంగా మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ,  


  బాధిత దిరిసిపోము యిర్మీయా కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆడుకుంటాం అన్ని మంత్రి మంత్రివర్యులు హామీ ఇచ్చారు.  మన స్థాయి ఎంత ఉన్నా స్పందించే హృదయం ఉంటే చేయూత నివ్వవోచ్చు


అనడానికి ఈగ్రామస్థులే నిదర్శనం అన్నారు. ప్రభుత్వం సహాయం కోసం ఎదురు చూడకుండా గ్రామస్తులు స్వచ్ఛందంగా ముందుకు వొచ్చారని, వారిని మనః స్ఫూర్తిగా అభినందిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం తరపున తక్షణ ఆర్ధిక సహాయం కింద రూ.5 వేలు, రేషన్ సరుకులు అందించడం జరిగిందని తెలిపారు. ప్రభుత్వం తరపున అన్ని విధాలుగా ఆదుకుంటామని పేర్కొన్నారు.


ఈ కార్యక్రమంలోస్థానిక ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

Comments