ప్రజలతో మమేకం కావాలని

 పశ్చిమగోదావరి జిల్లా... ఏలూరు (ప్రజా అమరావతి);


రాష్ట్ర ముఖ్యమంత్రి వైస్ జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలు ద్వారా అమలు చేస్తున్న పధకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి అందేలా డివిజన్స్ లో పర్యటించి ప్రజలతో మమేకం కావాలని


రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని వైస్సార్సీపీ నాయకులకు సూచించారు...


ఏలూరులోని ఉప ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ఆదివారం అందుబాటులో ఉన్న వైస్సార్సీపీ ముఖ్య నాయకులతో మంత్రి ఆళ్ల నాని ప్రజలకు అందుతున్న ప్రభుత్వ పధకాలపై నాయకులను అడిగి తెలుసుకున్నారు...


ఏలూరు నియోజకవర్గంలో అన్ని ప్రాంతాల్లో పధకాలు సక్రమంగా అందేలా ప్రజలు దగ్గరికి వెళ్లి వివరించి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు మరింతగా చేరువు అయ్యో లా కృషి చేయాలని మంత్రి ఆళ్ల నాని విజ్ఞప్తి చేశారు...


ప్రతి డివిజన్ లో కార్పొరేటర్లు  ప్రజలు వద్దకు వారి సమస్యలు తెలుసుకుని వాటిని సంబందించిన అధికారులు దృష్టికి తీసుకు వెళ్లి పరిష్కారం చేసే విధంగా కృషి చేయాలని మంత్రి ఆళ్ల నాని కోరారు...


డివిజన్స్ లో శానిటేషన్ విషయంలో కూడ ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకోవాలని, ఇడా, స్మార్ట్ సిటీ ద్వారా కూడ ఏలూరు ప్రజలకు మరింతగా అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి ప్రణాళిక సిద్ధం చేయాలని మంత్రి ఆళ్ల నాని విజ్ఞప్తి చేశారు...


ప్రభుత్వ పధకాలు ప్రజలు వద్దకు తీసుకు వెళ్లడమే కాకుండా వైస్సార్సీపీ కార్యకర్తలకు నిరంతరం అందుబాటులో ఉంటూ వారి సమస్యలు పరిష్కారం కోసం తమ వంతు కృషి చేయాలని మంత్రి ఆళ్ల నాని సూచించారు...


అన్ని వర్గాల ప్రజలకు ప్రభుత్వం అందిస్తున్న పధకాలు, విశ్రుత స్థాయిలో ప్రచారం నిర్వహించి ముఖ్యమంత్రి వైస్ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకు వెళ్లాలని మంత్రి ఆళ్ల నాని కోరారు...


ఈ కార్యక్రమంలో వైస్సార్సీపీ నాయకులు MRD బలరామ్, బొద్దాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ నూక పేయి సుధీర్ బాబు, AMC చైర్మన్ మంచెం మైబాబు, ఏపి మెడికల్ కౌన్సిల్ మెంబెర్ డాక్టర్ దిరిశాల వర ప్రసాద్, నెరుసు చిరంజీవి, ముమ్ముల జాన్, కిలాడీ దుర్గారావు, పాము శ్యామ్యూ లు, విఠలా చంద్రశేఖర్, తదితరులు పాల్గొన్నారు..Comments