గణేష్ రాయల్ క్రూయిజ్లో మనంగా కొల్లి విజయ్ పుట్టినరోజు వేడుకలు



- గణేష్ రాయల్ క్రూయిజ్లో మనంగా కొల్లి విజయ్ పుట్టినరోజు వేడుకలు 


- శుభాకాంక్షలు తెలిపిన మంత్రి కొడాలి నాని 




గుడివాడ, అక్టోబర్ 27 (ప్రజా అమరావతి): కృష్ణాజిల్లా గుడివాడ పట్టణం బైపాస్ రోడ్డులోని గౌతమ్ కాన్సెప్ట్ స్కూల్ సమీపంలో ఉన్న గణేష్ రాయల్ క్రూయిజ్ అపార్ట్మెంట్లో బుధవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత కొల్లి విజయ్ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కొల్లి విజయ్, ఆయన కుమార్తె నిహారికతో రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) కేక్ ను కట్ చేయించారు. ఈ సందర్భంగా కొల్లి విజయ్ కు మంత్రి కొడాలి నాని పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ స్నేహశీలి, మృదు స్వభావం కల్గిన కొల్లి విజయ్ తన పుట్టినరోజు వేడుకలను నిరాడంబరంగా జరుపుకోవడం అభినందనీయమని అన్నారు. ఆయన నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో, ఐశ్వర్యంతో విలసిల్లాలని ఆకాంక్షించారు. కొల్లి విజయ్ మాట్లాడుతూ సన్నిహితుల సమక్షంలో పుట్టినరోజు వేడుకలను జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన ప్రతి ఒక్కరికీ కొల్లి విజయ్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నేత దుక్కిపాటి శశిభూషణ్, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ అడపా బాబ్జి, వైసీపీ పట్టణ అధ్యక్షుడు గొర్ల శ్రీను, నాయకులు పాలడుగు రాంప్రసాద్, పొట్లూరి మురళీధర్, యార్లగడ్డ సత్యభూషణ్, గుత్తా నాని, మట్టా జాన్విక్టర్, ఎన్ మోహన్ తదితరులు పాల్గొన్నారు.