ప్రతి ఒక్కరికి స్పందించే మనసు ఉండాలన్నారు

 


పెనుమంట్ర (ప్రజా అమరావతి);


ఈ నియోజకవర్గ పరిధిలోని 55 వేల కుటుంబాలకు వివిధ సంక్షేమ పధకాలు ద్వారా రూ.773 కోట్లు గత రెండున్నర సంవత్సరాలలో ప్రయోజనం కలుగ చెయ్యడం జరిగిందని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరకువాడ శ్రీరంగనాధ రాజు పేర్కొన్నారు.



స్థానిక జుత్తిక శివాలయంసమీపంలో 2వ విడత ఆసరా చెక్కులు పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా మంత్రి హాజరైయ్యారు.  ఈ సందర్భంగా మంత్రి శ్రీరంగనాధ రాజు మాట్లాడుతూ, ప్రతి ఒక్కరికి స్పందించే మనసు ఉండాలన్నారు


.  మన ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రజలకు ఆరోగ్యశ్రీ  పథకం వర్తింప చేసి అండగా నిలిచిన ట్లు పేర్కొన్నారు. ఈ నియోజకవర్గ పరిధిలో 20 వేల మంది లబ్దిదారులకు ఇల్లు కట్టించి ఇచ్చే కార్యక్రమంచేపట్టనున్నా మన్నారు. అభివృద్ధి కోసం, ప్రజా సంక్షేమం కోసం అప్పు చేస్తే, ప్రతిపక్షాలు అనవసరపు రాద్దాంతం చేస్తున్నారు. పేదలకు పథకాలు అమలు చేయవద్దని ప్రతిపక్షాలు చెప్పగలరా అని అడిగారు. అర్భికే లు ద్వారా రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసే దిశగా అడుగులు వేస్తున్నామన్నారు. ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేసే ఆరోగ్య భరోసా ఇచ్చామన్నారు. నేడు అక్క చెల్లమ్మ ల పేరుతో ఇంటి స్థలాలు వారి పేరునే రిజిస్ట్రేషన్ చేస్తున్నామన్నారు. మీ అందరి ఆశీర్వాదం తో మరో సారి శాసనసభ్యులుగా ఎన్నికై, మంత్రిగా పని చేస్తున్నా అన్నారు. అర్హులైన వారికి పథకాలు అందించడంలో ప్రజా ప్రతినిధులు సిఫార్సు లేకుండా నేరుగా లబ్దిదారుల ఖాతాకు జమాచేసామన్నారు. ఏ ఒక్కరికైనా లంచం, డబ్బులు గాని ఇచ్చారా అని మంత్రి ప్రశ్నించారు. లేదని మహిళలు పేర్కొన్నారు.


2019 ఏప్రిల్ 11 న స్వయం సహాయక సంఘాల మహిళలకు ఉన్న అప్పులను 4 దశల్లో తీర్చుతానని హామీ ఇచ్చారని మంత్రి చెరకువాడ శ్రీరంగనాధ రాజు తెలిపారు. ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు క్యాలెండర్ రూపొందించి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఒక్కరే అన్నారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో కూడా వెనకడుగు వెయ్యకుండా వాటిని అమలు చేసిన విషయం తెలిసిందే అన్నారు. లబ్దిదారులు మాట్లాడుతూ, నవరత్నాలు లో అధిక సంఖ్యలో లబ్ది పొందిన వాళ్ళు మహిళలే అన్నారు. తన భర్త ఆటో డ్రైవర్ ఆయన కి ప్రభుత్వం రూ.10 వేలు ఇచ్చారన్నారు. వై ఎస్సార్ ఆసరా, అమ్మఒడి , స్వంత ఇంటికల నెరవేరిందని పేర్కొన్నారు.



మహిళలు పేరున పధకాలను ప్రకటించి అమలు చేస్తున్న ప్రభుత్వానికి , జగనన్నకి అండగా ఉండాలని పెనుమంట్ర మండలం  జెడ్పీటీసీ గౌరీ సుభాషిణి,  ఎంపిపి కర్రి వెంకట నారాయణ రెడ్డి కోరారు. మహిళల ఆర్ధిక స్వావలంబన కోసం చిత్తశుద్ధితో కృషి చేస్తున్నామన్నారు.



ఈ కార్యక్రమంలో  జెడ్పీటీసీ గౌరీ సుభాషిణి,  ఎంపిపి కర్రి వెంకట నారాయణ రెడ్డి ఎంపిడిఓ ఆర్.విజయరాజు, సర్పంచ్ లు వీరారెడ్డి, మహాలక్ష్మి, సత్యనారాయణ, ధర్మారెడ్డి ,డి. రంగావతి,  జీ. శ్రీనివాస్, సి.లక్ష్మి, మమత కుమారి,వెంకటేశ్వర రెడ్డి, ఈ. అనిత, పి.రవికుమార్ వర్మ, వి.నాగలక్ష్మి, వి.సూర్యకాంతం,  కె.సత్యవతి, కే. పోతురాజు, ఎంపిటిసి లు, ఏ ఎం సి ఛైర్మన్,  పలువురు సర్పంచ్ లు,  స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.


Comments