బంగ్లాదేశ్ లో డిసెంబర్12 నుంచి 23వ తేదీ వరకూ జరగనున్న విక్టరీ డే సెలెబ్రేషన్స్ కు

 తాడేపల్లి (ప్రజా అమరావతి);    బంగ్లాదేశ్ లో డిసెంబర్12 నుంచి 23వ తేదీ వరకూ జరగనున్న విక్టరీ డే సెలెబ్రేషన్స్ కు


కె.ఎల్.విశ్వవిద్యాలయంకు చెందిన శ్రీ సాయిప్రియ కు ఆహ్వానం అందిందని విద్యార్థి విభాగ సంక్షేమ అధిపతి డీన్ డాక్టర్ కే.ఆర్.ఎస్.ప్రసాద్ మంగళవారం ఒక ప్రకటన లో తెలిపారు.ఈ వేడుకల్లో నిర్వహించనున్న యూత్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ ( యెప్2021-22 ) కు ఇండియా నుంచి ఇద్దరు అధికారులు , 20 మంది క్యాడెట్లతో కూడిన ఎన్.సి.సి  ప్రతినిధి బృందాన్ని బంగ్లాదేశ్ ప్రభుత్వం ఆహ్వానించిందని పేర్కొన్నారు.తెలుగు రాష్ట్రాల నుంచి ఏకైక మహిళ క్యాడెట్ గా సాయిప్రియ ఎంపికైందని వెల్లడించారు. ఎంపికైన సాయి ప్రియను విశ్వవిద్యాలయ యాజమాన్యం, కులపతి డాక్టర్ ఎస్.ఎస్.మంతా,ఉపకులపతి డాక్టర్ సారధి వర్మ,రిజిస్ట్రార్ డాక్టర్ వై.వి.ఎస్.ఎస్.ఎస్.వి.ప్రసాద్ రావు,వివిధ విభాగాల డీన్లు, విభగదీపతులు,అధ్యాపకులు, విద్యార్థులు అభినందించారు