తిరుమలలో ఉచిత వివాహలు*


*తిరుమలలో ఉచిత వివాహలు*

       

కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీవేంకటేశ్వరుని చెంత వివాహాం చేసుకుని, ఒక్కటి అయ్యే జంటలకు టిటిడి నిర్వహిస్తున్న ఉచిత వివాహాలకు నూతన వదూవరుల నుండి విశేష స్పందన లభిస్తుంది. టిటిటి 2016 ఏప్రిల్‌ 25వ తేదీ నుండి తిరుమల పాపావినాశనం రోడ్డులోని కళ్యాణ వేదిక వద్ద ఉచితంగా వివాహాలు నిర్వహిస్తున్న విషయం విదితమే.


 ఇందులో భాగంగా...

 పురోహితుడు,

 మంగళవాయిద్యంతోపాటు రోజుకు రూ.50/- చెల్లించే వసతి గృహాన్ని, 

 పెళ్లి సమయంలో పసుపు, కుంకుమ, కంకణంను 

    టిటిడి ఉచితంగా అందిస్తుంది.

 

వీటితోపాటు...

   12 లడ్డూలను

 (ఒకటి రూ.25/- చొప్పున) పొందవచ్చు. 

 వివాహానికి కావాల్సిన ఇతర సామాగ్రిని మాత్రం వదూవరులే తీసుకురావాల్సి ఉంటుంది.


 వివాహానికి వదూవరుల తల్లిదండ్రులు తప్పనిసరిగా హాజరుకావాల్సి ఉంటుంది.


 పెళ్లికి రాలేని పక్షంలో అందుకు సంబంధించిన ఆధార పత్రాలను సమర్పించాలి.


 వివాహాం అనంతరం నవదంపతులకు గ్రూప్‌ ఫోటో తీసి రూ.300/-ల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్‌ను ఒకటి ఉచితంగా అందజేస్తారు.


  ఈ టికెట్‌ ద్వారా పెళ్లికుమారుడు, పెళ్లికుమార్తెతోపాటు ఇరువురి తల్లిదండ్రులను కలుపుకుని మొత్తం 6 మందికి ఏటీసీ మార్గం ద్వారా ఉచితంగా శ్రీవారి దర్శనానికి అనుమతిస్తారు.


 *కల్యాణ వేదికకు ఆన్‌లైన్‌ బుకింగ్‌ అవకాశం*


తిరుమలలోని కళ్యాణ వేదికలో ఉచిత వివాహలు చేసుకునేందుకు ముందుగా...


 ఆన్‌లైన్‌లో కల్యాణవేదిక స్లాట్‌ను బుక్‌ చేసుకునే సదుపాయాన్ని 2016 మే 9వ తేదీ నుండి నూతన వదూవరులకు టిటిడి కల్పించింది.


 ఇందుకోసం తమ సమీపప్రాంతాల్లోని నెట్‌ సెంటర్‌ లో టిటిడి సేవా ఆన్‌లైన్‌.కామ్‌ వెబ్‌సైట్‌ను సంప్రదించాల్సి ఉంటుంది. 

 అక్కడ ఉన్న కల్యాణవేదిక కాలమ్‌లో అబ్బాయి, అమ్మాయి వివరాలను నమోదుచేయాలి.


 వదూవరులు తప్పనిసరిగా తల్లిదండ్రుల వివరాలను నమోదు చేయడమేకాక

 ఓటర్‌, 

 ఆధార్‌ కార్డులలో ఏదోఒక గుర్తింపు కార్డును అప్‌లోడ్‌ చేయాలి. 

 వయసు ధృవీకరణ కోసం బర్త్‌ సర్టిఫికేట్‌ లేదా పదో తరగతి మార్క్‌లిస్ట్‌ / ట్రాన్స్‌ఫర్‌ సర్టిఫికేట్‌ లేదా డ్రైవింగ్‌ లైసెన్స్‌ లేదా పాన్‌ కార్డు లేదా పాస్‌పోర్టు వివరాలను జతచేయాల్సి ఉంటుంది. వీటితోపాటు అందులో వివాహ తేది, సమయాన్ని వారే నిర్ణయించుకుని అప్‌లోడ్‌ చేస్తే అక్నాలెడ్జ్‌మెంట్‌ పత్రం జారీ అవుతుంది.


 కొత్తగా పెళ్లి చేసుకునే వారు అక్నాలెడ్జ్‌మెంట్‌ పత్రాన్ని తీసుకుని కేవలం 6 గంటల ముందు తిరుమల చేరుకుని కల్యాణవేదిక వద్ద ఉన్న కార్యాలయంలో వారి వివరాలను మరోసారి అక్కడి సిబ్బంది ద్వారా పరిశీలించుకోవాలి.


 కరెంటు బుకింగ్‌ / ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకునే జంటలు తిరుమలలో ఉచితంగా వివాహం చేసుకొనుటకు తప్పనిసరిగా హిందూ మతస్థులై ఉండాలి.


 వధువుకు 18 సంవత్సరాలు,

 వరునికి 21 సంవత్సరాలు నిండివుండాలి. 


 ద్వితీయ వివాహములు మరియు ప్రేమ వివాహములు ఇక్కడ జరుపబడవు.



  ఇతర వివరాలకు...

*ఫోన్‌ – 0877 – 2263433*  

          సంప్రదించవచ్చు.

   https://t.me/ttdnews

              

 వివాహ రిజిస్ట్రేషన్‌ కొరకు

               

తిరుమలలో వివాహం చేసుకున్న నూతన వదూవరులు, 

తమ వివాహన్ని రిజిస్ట్రేషన్‌ చేసుకొనుటకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ”హిందూ వివాహ రిజిస్ట్రారు వారి కార్యాలయము”ను *ఎస్‌.ఎమ్‌.సి – 233* వద్ద ఏర్పాటు చేసింది.


 ఇందుకోసం నూతన వదూవరులు తమ 

◆ వయస్సు ధృవపత్రములు,

◆ నివాస ధృవపత్రము,

◆ వివాహము ఫోటో,

◆ పెండ్లి పత్రిక, 

◆ కళ్యాణ మండపము రసీదు సమర్పించవలెను. 

◆ ముగ్గురికి తక్కువ లేకుండా సాక్షులు రావలెను. 


ఇతర వివరాలకు ఉదయం 10.30 నుండి సాయంత్రం 5.00 గంటల వరకు కార్యాలయంలో నేరుగా లేదా ఫోన్‌ 

*0877 – 2277744* సంప్రదించవచ్చు.


 తిరుమలలో వివాహం చేసుకునే దంపతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని టిటిడి కోరుతోంది.


   

Comments