చిత్తూరు జిల్లా పుంగనూరు మం డలం (ప్రజా అమరావతి);
రెండవ రోజు కేంద్ర బృందం చిత్తూరు జిల్లా లో పర్యటన
ఇంటర్ మినిస్టీరియ ల్ సెంట్రల్ టీమ్ సభ్యులు అభేకుమార్,డైరెక్టర్,మిని స్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వారు జిల్లా లో కురిసిన వర్షాల వల్ల జరిగిన నష్టాన్ని క్షేత్ర స్థాయి లో పరిశీలించు టలో భాగంగా శనివారం సాయంత్రం చిత్తూరు జిల్లా పుంగనూరు మండలం లో జరిగిన పంట నష్టం ను పరిశీలించారు.
పుంగనూరు మండ లం చదల్లా లో నీట మునిగిన వరి పంట మరియు టమోటా పంట ను పరిశీలిం చారు ..
పుంగనూరు మండ లం లో 104.449 హెక్టార్ల లో పంట నష్టం జరగ గా.. మొత్తం 1804 మంది రైతులు నష్టపోయా రని.. అధికంగా వరి పంట 101.6194 హెక్టార్లలో పంట నష్టం జరగగా 1684 మంది రైతులు నష్ట పోయా రని.. చదల్లా గ్రామా నికి సంబంధించి 73.6 హెక్టార్లలో పంట నష్టం జరగగా 139 మంది రైతులు నష్ట పోయారని..పంట నష్టం నకు సంబంధిం చి 46 హెక్టార్లలో వరి,7.6 హెక్టార్లలో కాలీ ఫ్లవర్,8హెక్టార్లలో టమాటా,2 హెక్టార్లలో బంగాళాదుంప,4 హెక్టార్లలో రెడ్ గ్రామ్, 2 హెక్టార్లలో అనప,4 హెక్టార్లలో రాగి పంట దెబ్బతిన్నదని అధి కారులు వివరించారు.
రైతులు తాము పం డించి దెబ్బతిన్న వరి, టమాటా, కాలీఫ్లవర్ బంగాళాదుంప, ముల్లంగి పంట ను చూపించి భారీ వర్షాలతో తనకు జరిగిన పంట నష్టంతో ఆర్థికంగా పూర్తిగా దెబ్బతిన్నామని అన్నదాతలు అయిన రైతులను ఆదు కోవాలని కన్నీటి పర్యంతమమై కేంద్ర బృందం సభ్యులకు విన్నవించుకున్నారు..
ఈ పర్యటనలో కేంద్ర బృందం సభ్యులు వెంట మదనపల్లె సబ్ కలెక్టర్ జాహ్నవి, వ్యవసాయ శాఖ, పశుసంవర్ధక శాఖ జె.డి లు దొరసాని, వెంకట్రావ్,ఉద్యాన వన శాఖ డి డి శ్రీని వాసులు,ఇతర మం డల స్థాయి అధి కారులు,ప్రజా ప్రతి నిధులు, రైతులు కలరు
addComments
Post a Comment