శాసన మండలి ఛైర్మన్ గా కొయ్యే మెషేన్ రాజు ఏకగ్రీవ ఎన్నిక



*శాసన మండలి ఛైర్మన్ గా కొయ్యే మెషేన్ రాజు ఏకగ్రీవ ఎన్నిక*


శాసనమండలి ఛైర్మన్ గా ప్రకటించిన విఠపు బాలసుబ్రహ్మణ్యం.

అభినందించిన ముఖ్యమంత్రి, మంత్రులు, సభ్యులు. 

అమరావతి (ప్రజా అమరావతి);

శాసన మండలి ఛైర్మన్ గా కొయ్యే మోషేన్ రాజు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రొటెం ఛైర్మన్ విఠపు బాలసుబ్రహ్మణ్యం శుక్రవారం జరిగిన శాసనమండలి సమావేశంలో ప్రకటించారు. శాసనమండలి ఛైర్మన్ పదవికి ఒకే నామినేషన్ దాఖలు అయిందన్నారు. శాసన పరిషత్ 9వ నియమం ప్రకారం మండలి ఛైర్మన్ నామ నిర్ధేశం జరిగిందన్నారు. కొయ్యే మోషేన్ రాజు అభ్యర్థితత్వాన్ని గంగుల ప్రభాకర్ రెడ్డి ప్రతిపాదించగా సభ్యులు దువ్వాడ శ్రీనివాసరావు, బల్లి కళ్యాణ చక్రవర్తి బలపర్చినట్లు ప్రొటెం ఛైర్మన్ బాలసుబ్రహ్మణ్యం తెలిపారు. 

ఛైర్మన్ గా ఎన్నికైన మోషేన్ రాజును ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు, సభ్యులు చైర్మన్ సీటు వద్దకు తీసుకొచ్చారు. అనంతరం ఆయన శాసనమండలి ఛైర్మన్ సీటులోఆశీసునలయ్యారు. ఈ సందర్భంగా మంత్రులు, శాసనమండలి సభ్యులు ఆయన్ను కలిసి అభినందించారు. ముందుగా శాసనమండలికి చేరుకున్న ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి మోషేన్ రాజు పుష్పగుచ్చం అందించి స్వాగతం పలికారు.


*10 సంవత్సరాల నుంచి కలిసి ప్రయాణం చేస్తున్న మోషేన్ రాజు: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి*

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. రాజకీయ నేపథ్యం లేని ఒక సామాన్య దళిత రైతు కుటుంబం నుంచి మోషేన్ అన్న ఛైర్మన్ స్థాయికి వచ్చారన్నారు.  20 సంవత్సరాల అతి చిన్నవయసులోనే భీమవరం మున్సిపాలిటీలో కౌన్సిలర్ గా గెలిచి.. మరో 4సార్లు కౌన్సిలర్ గా గెలిచి అంచెలంచెలుగా ఎదిగి నేడు శాసనమండలి ఛైర్మన్ గా ఎన్నికైన మోషేన్ రాజును హృదయపూర్వకంగా అభినందిస్తున్నామన్నారు. నాన్న గారు వైఎస్ రాజశేఖర్ రెడ్డితో ఆయనకు సన్నిహిత సంబంధాలున్నాయని, వైఎస్సార్సీపీ స్థాపించిన తొలిరోజుల్లో జిల్లా అధ్యక్షులుగా క్రియాశీలకంగా పనిచేశారన్నరు. 10 సంవత్సరాల పాటు తనతో కలిసి ప్రయాణం చేశారని, నేడు ఛైర్మన్ స్థానం పొందడం చాలా సంతోషంగా ఉందన్నారు. 

ఈ సందర్భంగా మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, చెరుకువాడ రంగనాథ్ రాజు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ధర్మాన కృష్ణదాస్, పినిపే విశ్వరూప్, ఆళ్ల నాని, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, మేకతోటి సుచరిత, మండలి సభ్యులు మాధవ్, కత్తి నర్సింహారెడ్డి, పోతుల సునీత, డొక్కా మాణిక్య వరప్రసాద్ తదితరులు మోషేన్ రాజుకు అభినందనలు తెలియజేసారు. 


*రాజకీయాల్లోకి రాణించాలంటే డబ్బు, కులం అవసరం లేదు.. నన్ను ఛైర్మన్ ను చేయడం జగన్ మోహన్ రెడ్డి తీసుకున్న సాహోసేపేత నిర్ణయం : మోషేన్ రాజు*

మండలి ఛైర్మన్ గా నూతనంగా ఎన్నికైన మోషేన్ రాజు మాట్లాడుతూ... పేద, వ్యవసాయ, దళిత కుటుంబానికి చెందిన తనను మండలి ఛైర్మన్ గా ఎంపిక చేసినందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. ఏకగ్రీవంగా ఎన్నికకావడానికి సహకరించిన అధికార, ప్రతిపక్ష సభ్యులకు అందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు.  రాజకీయాల్లో ఈ స్థానానికి వస్తానని ఊహించలేదన్నారు. రాజకీయాల్లో పైకి రావాలంటే డబ్బు, కులం, రాజకీయ నేపథ్యం అవసరమని అందరూ ఎలా భావిస్తారో.. నేను కూడా అలానే భావించే వాడినని.. నాకు ఈ పదవి వచ్చిన తర్వాత అవన్నీ అవసరం లేదని.. విశ్వాసం, నమ్మకం, కష్టపడి పనిచేసే తత్వం ఉంటే చాలని అన్నారు. నన్ను చూసి ఎవరైనా రాజకీయాల్లోకి రావచ్చన్నారు. వైఎస్సార్ కుటుంబానికి దగ్గరగా ఉండాలని పరితపిస్తూ ఉండేవాడినని.. 2009 ఎన్నికల్లో ఓడిపోయినప్పుడు రాజశేఖర్ రెడ్డి పిలిచి ధైర్యం చెప్పారని.. నేను ముఖ్యమంత్రి అయ్యాను.. నిన్ను కూడా అసెంబ్లీకి తీసుకొస్తానని చెప్పారన్నారు. మీరు ముఖ్యమంత్రి అయితే చాలు ఆనాడు చెప్పానని ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు.  2009లో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తన తండ్రి ఒక అడుగు ముందుకు వేస్తే.. తాను రెండు అడుగులు ముందుకు వేస్తానని చెప్పారని.. దాని అర్థం ఇప్పుడు అర్థం అయ్యిందన్నారు. తనను శాసనమండలి సభ్యున్ని చేయడంతో పాటు ఛైర్మన్ పదవి కూడా ఇచ్చారని తెలిపారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తప్ప మరెవరూ ఇంత సాహోసేపేత నిర్ణయం తీసుకోలేరన్నారు.  ఛైర్మన్ గా నియమించినందుకు రెండింతల నమ్మకంగా పనిచేస్తామన్నారు. ప్రజా సమస్యల పరిష్కరించే దిశలో  ప్రతిపక్షాలకు ఒక వంతు ఎక్కువే అవకాశం ఇస్తానని తెలిపారు. అయితే ప్రతిపక్షాలు కూడా ప్రభుత్వం చేసే అభివృద్ది, సంక్షేమ పథకాలను గుర్తించి మాట్లాడాలని సూచించారు. తనపై నమ్మకంతో ఛైర్మన్ గా ఎంపిక చేసినందుకు సమవర్థంగా పనిచేసి గౌరవం నిలబెడతానన్నారు. దళితుల ఆత్మగౌరవం కాపాడి మంచి పేరు వచ్చేలా పనిచేస్తామని మోషేన్ రాజు చెప్పారు.