శ్రీకపిలేశ్వరాలయంలో కృత్తికా దీపోత్సవం
తిరుపతి, 2021, నవంబరు 19 (ప్రజా అమరావతి)
: తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరాలయంలో కృత్తిక నక్షత్రాన్ని పురస్కరించుకుని శుక్రవారం సాయంత్రం కృత్తికా దీపోత్సవం జరిగింది.
: తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరాలయంలో కృత్తిక నక్షత్రాన్ని పురస్కరించుకుని శుక్రవారం సాయంత్రం కృత్తికా దీపోత్సవం జరిగింది.
కార్తీక మాసంలో శ్రీ కపిలేశ్వరాలయంలో కృత్తిక దీపోత్సవం నిర్వహించడం ఆనవాయి.
సాయంత్రం 6 గంటలకు గర్భాలయంలో, ఆ తరువాత శ్రీకపిలేశ్వరస్వామివారి ఆలయ గోపురం, శ్రీ కామాక్షి అమ్మవారి ఆలయ గోపురం, ధ్వజస్తంభంపైన దీపారాధన చేశారు. ఈ సందర్భంగా ఊంజల్ మండపంలో ఆకట్టుకునేలా శివలింగం, శూలం ఆకృతిలో ప్రమిదలు వెలిగించారు.ఆ తరువాత జ్వోలాతోరణం వెలిగించారు.
ఈ కార్యక్రమంలో టిటిడి జెఈఓ శ్రీ వీరబ్రహ్మం ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ సుబ్రమణ్యం, సూపరింటెండెంట్ శ్రీ భూపతి, టెంపుల్ ఇన్‌స్పెక్టర్లు శ్రీ రెడ్డి శేఖర్, శ్రీ శ్రీనివాస నాయక్, ఆలయ అర్చకులు పాల్గొన్నారు.
addComments
Post a Comment