శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి,

 శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి,



విజయవాడ (ప్రజా అమరావతి): 

  కార్తీకపౌర్ణమి సందర్భముగా ఉదయం 06 గం.లకు ఆలయ స్థానాచార్యులు శ్రీ విష్ణుభట్ల శివప్రసాద శర్మ గారు మరియు వైదిక కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో 

 ఆలయ పాలకమండలి చైర్మన్ శ్రీ పైలా సోమినాయుడు గారు, శ్రీయుత ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీమతి డి.భ్రమరాంబ గారు మరియు పాలకమండలి సభ్యులచే

కనకదుర్గానగర్ లోని మల్లిఖార్జున మహామండపము నుండి శ్రీ అమ్మవారి ప్రచార రథము వద్ద శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి కొబ్బరికాయ కొట్టి గిరి ప్రదక్షిణ కార్యక్రమమును ప్రారంభించడం జరిగినది..

    ఈ కార్యక్రమము నందు ఆలయ సిబ్బంది మరియు భక్తులు పాల్గొనగా మంగళ వాయిద్యములు, కీర్తనలు, కోలాటాలు  మరియు ఇతర సాంస్కృతిక కార్యక్రమాల నడుమ గిరిప్రదక్షిణ కార్యక్రమము కనకదుర్గానగర్, కుమ్మరిపాలెం సెంటర్, సితార సెంటర్, చిట్టినగర్ పాల ఫ్యాక్టరీ, కబేలా,  శ్రీనివాస మహల్, రధం సెంటర్ మీదుగా  మల్లిఖార్జున మహామండపమునకు  చేరుకొనడం జరిగినది. 


గిరిప్రదక్షిణ మార్గము నందు భక్తులు ప్రచార రథము లో కొలువై ఉన్న శ్రీ అమ్మవారు, స్వామి వార్లకు భక్తిశ్రద్దలతో పూలు, పండ్లు , కొబ్బరికాయ లు సమర్పించి, పూజలు చేసి, అమ్మవారిని, స్వామి వారిని ప్రార్థించి, అడుగడుగునా నీరాజనాలు సమర్పించారు.


అమ్మవారి శిఖరం చుట్టూ  కార్తీక పౌర్ణమి రోజున నిర్వహించే  గిరి ప్రదక్షిణ  చేస్తే భక్తుల కోరికలు త్వరగా తీరుతాయని ప్రతీతి.

Comments