రాష్ట్రాల మధ్య సమస్యలు నిర్దేశిత సమయంలోగా పరిష్కారం కావాలి.*రాష్ట్రాల మధ్య సమస్యలు నిర్దేశిత సమయంలోగా పరిష్కారం కావాలి*

*దీనికోసం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలి*

*దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ మండలి సమావేశంలో ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌.జగన్‌* 

*విభజనతో రాష్ట్రం తీవ్రంగా నష్టపోయింది*

*రాష్ట్రాన్ని విడగొట్టి ఏడేళ్లు గడిచినా హామీలు అమలు కావడంలేదు*

*సమస్యలన్నీ అపరిష్కృతంగానే ఉన్నాయి

వీటితో రాష్ట్రానికి తీవ్ర నష్టం*

*పోలవరం ప్రాజెక్టు వ్యయ నిర్ధారణలో 2013–14 ధరల సూచీతో రాష్ట్రానికి అన్యాయం*

*విభజన చట్టాన్ని ఉల్లంఘించడమే* 

*రీసోర్స్‌ గ్యాప్‌నూ భర్తీచేయలేదు*

*ప్రత్యేక హోదా హామీని నెరవేర్చలేదు*

*తెలంగాణ నుంచి విద్యుత్‌ బకాయిలను ఇప్పించండి*

*తీవ్ర కష్టాల్లో ఉన్న ఏపీ డిస్కంలకు ఊరట నివ్వండి*

*రెండు రాష్ట్రాల మధ్య ఆస్తుల పంపిణీ కూడా జరగలేదు*

*గత ప్రభుత్వంలో పరిమితి దాటారని రుణాలపై ఇప్పుడు కోత విధిస్తున్నారు*

*దీనిపై వెంటనే జోక్యం చేసుకోవాలి*

*రాష్ట్రాల్లో రేషన్‌ లబ్ధిదారుల గుర్తింపుకోసం కేంద్ర ప్రభుత్వ ప్రక్రియలో హేతుబద్ధత లేదు*

*వెంటనే సరవణలు చేయాలి*

*– దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ మండలి సమావేశంలో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌*


తిరుపతి (ప్రజా అమరావతి)


:

– దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ మండలి సమావేశంలో పాల్గొన్న ముఖ్యమంత్రి

– తిరుపతిలోని తాజ్‌ హోటల్లో దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ మండలి సమావేశం. 

– కేంద్ర హోంమంత్రి శ్రీ అమిత్‌షా, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌.జగన్, కర్ణాటక సీఎం శ్రీ బసవరాజు బొమ్మై సహా లెఫ్టినెంట్‌ గవర్నర్లు, అడ్మినిస్ట్రేటర్లు, మంత్రులు, అధికారులు హాజరు.

– రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాలను ఈ సమావేశంలో ప్రస్తావించిన సీఎం వైయస్‌.జగన్‌


ఈ సమావేశంలో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ ఏమన్నారంటే...


– సమావేశంలో విలువైన సమాచారాన్ని, తగిన సూచనలు, సలహాలు అందించిన కర్ణాటక ముఖ్యమంత్రి గారితో పాటు, లెఫ్టినెంట్‌ గవర్నర్లు, అడ్మినిస్ట్రేటర్లకు ప్రత్యేకంగా అభినందనలు.


– దేశ సమగ్ర పురోగతికి కేంద్రం–రాష్ట్రాలతో పాటు, అంతర్‌ రాష్ట్ర సంబంధాల పరిపుష్టి కూడా ఎంతో ముఖ్యమన్న విషయాన్ని మరోసారి తెలియజేస్తున్నాను. రాష్ట్రాల మధ్య నెలకొన్న పలు సమస్యలను నిర్ణీత వ్యవధిలో సామరస్యపూర్వకంగా పరిష్కరించే విధంగా ఒక ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేయాల్సిన అవసరం ఉంది. 


– 2014లో ఆంధ్రప్రదేశ్‌ విభజన తర్వాత కొత్తగా ఏర్పడిన తెలంగాణతో పాటు, విభజిత ఆంధ్రప్రదేశ్‌ మధ్య విభజనకు సంబంధించి ఇప్పటికీ అనేక అంశాలు అపరిష్కృతంగా ఉన్నాయి. దీంతో పలు సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయి. దీర్ఘకాలంగా అనేక అంశాలు అలాగే అపరిష్కృతంగా ఉండడం వల్ల రెండు రాష్ట్రాలు ఆర్థికంగా నష్టపోవడమే కాకుండా, రెండు రాష్ట్రాల మధ్య సంబంధాలపైనా అవి ప్రభావం చూపేలా ఉన్నాయి. అందువల్ల ఆంధ్రప్రదేశ్‌ విభజనకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న అంశాలను వీలైనంత త్వరగా పరిష్కరించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో కొన్ని ముఖ్యమైన అంశాలను ఈ సమావేశం దృష్టికి తీసుకువస్తున్నాను. 


– విభజన వల్ల ఆంధ్రప్రదేశ్‌ ఎంతో నష్టపోయింది. రాష్ట్ర విభజన తర్వాత, తొలి ఆర్థిక సంవత్సరం 2015–16లో.. తెలంగాణలో తలసరి ఆదాయం రూ.15,454 కాగా, ఆంధ్రప్రదేశ్‌లో తలసరి ఆదాయం కేవలం రూ.8,979 మాత్రమే. విభజన వల్ల ఆంధ్రప్రదేశ్‌ ఏ స్థాయిలో నష్టపోయింది అని చెప్పడానికి ఇది ఒక స్పష్టమైన ఉదాహరణ. 


–  పార్లమెంటులో రాష్ట్ర పునర్విభజన బిల్లు–2014 ఆమోదం సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌కు  పలు హామీలు ఇవ్వడం జరిగింది. కానీ వాటిని నెరవేర్చలేదు. రాష్ట్ర విభజన జరిగి ఏడేళ్లు పూరై్తనా ఇప్పటికీ అనేక హామీలను అమలు చేయకపోవడంతో, ఆంధ్రప్రదేశ్‌ ఆర్థికంగా ఎంతో నష్టపోవడమే కాకుండా అనేక సమస్యలను ఎదుర్కొంటోంది. ఆంధ్రప్రదేశ్‌ ఎదుర్కొంటున్న పలు కీలక సమస్యలను మీ అందరి ముందు ఉంచుతున్నాను.


1.

పోలవరం ప్రాజెక్టు... బహుళార్థసాధక సాగునీటి ప్రాజెక్టు. రాష్ట్రానికి జీవనాడి అయిన ఈ ప్రాజెక్టును ఆంధ్రప్రదేశ్‌ విభజన చట్టంలో కేంద్రం జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించింది. ఆ మేరకు కేంద్రమే ఈ ప్రాజెక్టును పూర్తిగా కట్టాల్సి ఉంది. అయితే ప్రాజెక్టు పనుల్లో జాప్యం, భూసేకరణ, నిర్వాసితుల పునరావాసంలో 2013 నాటి చట్టం ప్రకారం పరిహారం చెల్లించాల్సి ఉండడం వల్ల ప్రాజెక్టు వ్యయం గణనీయంగా పెరిగింది. సాంకేతిక సలహా కమిటీ (టీఏసీ), సవరించిన వ్యయ కమిటీ (ఆర్‌సీసీ) వంటి పలు కేంద్ర కమిటీలు కూడా పెరిగిన పోలవరం ప్రాజెక్టు వ్యయాన్ని అనుమతించాయి. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి 2013–14 నాటి వ్యయం అంచనా మేరకే నిధులిస్తామని, మిగిలిన వనరులను రాష్ట్రమే స్వయంగా సమకూర్చుకోవాలని కేంద్రం చెబుతోంది. దీనివల్ల రాష్ట్ర ప్రజలకు ఎలాంటి న్యాయం జరగడం లేదు.

 

ఇది విభజన చట్టంలో ఇచ్చిన హామీని నేరుగా ఉల్లంఘించడమే తప్ప మరొకటి కాదు. అంతే కాకుండా ప్రాజెక్టులో డ్రింకింగ్‌ వాటర్‌ కాంపొనెంట్‌కు నిధుల విడుదల చేయకుండా తప్పుకోవాలని కేంద్రం చూస్తున్నట్లు కనిపిస్తోంది. నిజానికి ఏ జాతీయ సాగునీటి ప్రాజెక్టులో అయినా, సాగునీటి సరఫరాతో పాటు, తాగు నీటి సరఫరా పనులను

కలిపి చూస్తారు. ఈ రెండింటినీ కలిపే ప్రాజెక్టు ఖర్చులను నిర్ధారిస్తారు.

అయితే ఇక్కడ చోటుచేసుకుంటున్న దురదృష్టకర పరిణామాలు, రాష్ట్రానికి జీవనాడి, ప్రజల చిరకాల స్వప్నం అయినటు వంటి పోలవరం ప్రాజెక్టు భవిష్యత్తును ప్రమాదంలో పడవేసే పరిస్థితి కనిపిస్తోంది. అందువల్ల పెరిగిన ప్రాజెక్టు వ్యయానికి అనుగుణంగా నిధులు మంజూరు చేస్తూ, 2014 రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం ప్రాజెక్టు నిర్మాణానికి అయ్యచే పూర్తి నిధులను కేంద్రం మంజూరు చేసి, విడుదల చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను.


2.


రాష్ట్ర విభజన సందర్భంగా కేంద్ర ప్రభుత్వం చేసిన మరో హామీని కూడా మరోసారి మీకు గుర్తుచేస్తున్నాను. రాష్ట్రం విభజన జరిగిన తర్వాత వచ్చిన మొదటి ఆర్థిక సంవత్సరం... 13వ ఆర్థిక సంఘం సిఫార్సుల అమలు జరుగుతున్న కాల వ్యవధిలో ఉంది. 


ఆ మేరకు నాటి ప్రధాని రాజ్యసభలో ఫిబ్రవరి 20, 2014న స్పష్టమైన హామీ కూడా ఇచ్చారు. రాష్ట్రాన్ని విభజించిన తేదీ ( అపాయింటెడ్‌ డేట్‌), మరియు 14వ ఆర్థిక సంఘం సిఫార్సులు అమలుకు మధ్య కాలంలో ఉత్పన్నమయ్యే రీసోర్స్‌ గ్యాప్‌ను, ఒక పరిహారంగా 2014–15 కేంద్ర బడ్జెట్‌ద్వారా నిధులు ఇస్తామని, ఆ గ్యాప్‌ను పూడుస్తామని స్పష్టంగా చెప్పారు. 


రీసోర్స్‌ గ్యాప్‌ అన్న పదాన్ని ఎక్కడా నిర్వచించనప్పటికీ, అది రెవెన్యూ లోటు అని స్పష్టంగా చెప్పవచ్చు. 2014–15కు సంబంధించి కాగ్‌ నివేదిక ప్రకారం, రాష్ట్ర విభజన జరిగిన జూన్‌ 2, 2014 నుంచి మార్చి 31, 2015 వరకు రాష్ట్రంలో రెవెన్యూ లోటు రూ.16,078.76 కోట్లు. మరోవైపు నిధుల కొరత వల్ల కీలకమైన ఆర్థిక లావాదేవీలు కూడా రాష్ట్రం పూర్తి చేయలేకపోయింది. నిజానికి అవి నాడు కేంద్రం స్పష్టంగా ఇచ్చిన హామీ రీసోర్స్‌ గ్యాప్‌ చెల్లింపులకు సంబంధించినవే. ఆ నేపథ్యంలో ఆ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రాష్ట్ర మొత్తం రెవెన్యూ లోటు (రీసోర్స్‌ గ్యాప్‌) ఏకంగా రూ.22,948.76 కోట్లకు చేరుకుంది. 


ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం కొత్తగా ‘ప్రామాణిక వ్యయం’ (స్టాండడైజ్జ్‌ ఎక్స్‌పెండీచర్‌) అన్న విధానాన్ని తీసుకువచ్చింది. ఆ మేరకు ఆంధ్రప్రదేశ్‌కు కేవలం రూ.4,117.89 కోట్ల లోటు మాత్రమే పూడ్చగలమని తెలియజేసింది. దీంతో కేంద్రం నాడు ఇచ్చిన హామీని నెరవేర్చకపోవడం వల్ల ఆ లోటు అలాగే మిగిలిపోయింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని, ఇప్పటికైనా ఈ విషయంలో పునరాలోచించి వీలైనంత త్వరగా సమస్య పరిష్కరించాలని కోరుతున్నాను.


3. 

రాష్ట్ర విభజన తర్వాత రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న మరో అపరిష్కృత సమస్య విద్యుత్‌ బకాయిల చెల్లింపు. తెలంగాణలో విద్యుత్‌ పంపిణీకి సంబంధించి ఆ రాష్ట్రం నుంచి ఆంధ్రప్రదేశ్‌ విద్యుత్‌ ఉత్పత్తి సంస్థకు రూ.6,112 కోట్ల బకాయిలు రావాల్సి ఉంది. రాష్ట్ర విభజన జరిగిన జూన్‌ 2, 2014 నుంచి జూన్‌ 10, 2017 వరకు ఏపీ విద్యుత్‌ ఉత్పత్తి సంస్థ (ఏపీ జెన్‌కో)కు ఆ మేరకు తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థలు (డిస్కమ్‌లు) బకాయిలు చెల్లించాల్సి ఉంది. కానీ ఇప్పటి వరకు తెలంగాణ డిస్కమ్‌లు ఆ మొత్తం చెల్లించలేదు.


నిజానికి రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణకు విద్యుత్‌ సరఫరా చేయలేమని ఏపీ జెన్‌కో స్పష్టం చేసింది. అయినప్పటికీ కేంద్ర విద్యుత్‌ శాఖ ఏకపక్షంగా ఒక నిర్ణయం తీసుకుని, తెలంగాణకు విద్యుత్‌ సరఫరా చేయాల్సిందే అని నిర్దేశించింది. దీంతో అనివార్యంగా ఏపీ జెన్‌కో తెలంగాణకు విద్యుత్‌ సరఫరా చేసింది. దానికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం మూడేళ్లపాటు కొంత మొత్తం చెల్లించగా, ఇంకా రూ.6,112 కోట్ల బకాయిలు రావాల్సి ఉంది. ఆ బకాయిలు చెల్లించకుండా తెలంగాణ ప్రభుత్వం కొత్తగా ఒక వైఖరి తీసుకుంది. ఇరు రాష్ట్రాల మధ్య విద్యుత్‌ కంపెనీల లావాదేవీల ప్రక్రియ (ఎలక్ట్రిసిటీ యుటిలిటీస్‌ డీమెర్జర్‌ ప్లాన్‌) ఇంకా తేలలేదు కాబట్టి, అవి పూరై్తన తర్వాత ఈ బకాయిల గురించి ఆలోచిస్తామంటూ ముడి పెట్టింది. మూడేళ్ల పాటు కొంత మొత్తం చెల్లించిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం కొత్తగా ఈ మెలిక పెట్టింది. ఇలాంటి నిర్ణయం తీసుకోవడం పూర్తిగా అసమంజసం. బకాయిలు రాకపోవడం వల్ల ఆర్థిక ఇబ్బందులతో ఏపీ జెన్‌కో కూడా సతమతమవుతోంది. ఇది ఒక విధంగా విద్యుత్‌ ఉత్పత్తిపైనా ప్రభావం చూపుతోంది.

నిజానికి నాడు కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి వల్లనే ఏపీ జెన్‌కో తెలంగాణకు విద్యుత్‌ సరఫరా చేసింది. కాబట్టి ఈ విషయంలో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం చొరవ చూపి, సమస్యను పరిష్కరించాలని విజ్ఞప్తి చేస్తున్నాను. 


4.

ఇవే కాకుండా విభజనకు సంబంధించి అనేక అంశాలు ఇంకా అమలు చేయాల్సి ఉంది. ఇక్కడ ఒక విషయాన్ని తప్పకుండా ప్రస్తావించాల్సి ఉంది. అదే ‘రాష్ట్రానికి ప్రత్యేక హోదా’. ఆ హామీ, నిబంధనతోనే రాష్ట్ర విభజన జరిగింది. అయితే ఏళ్లు గడిచినా, ఎంతో కీలకమైనా ఆ హామీని మాత్రం ఇప్పటికీ నెరవేర్చలేదు. 

అదే విధంగా విభజన చట్టంలోని 8వ షెడ్యూల్‌ ప్రకారం, 8 మౌలిక వసతుల ప్రాజెక్టులను పూర్తి చేయడంతో పాటు, జాతీయ ప్రాధాన్యం ఉన్న 11 సంస్థలను పూర్తి స్థాయిలో 2024 నాటికి ఏర్పాటు చేయాల్సి ఉంది. ఇంకా, బుందేల్‌ఖండ్‌లో ఇచ్చిన విధంగా వెనకబడిన జిల్లాలకు ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీని కూడా పూర్తిగా అమలు చేయలేదు. అత్యంత అల్పంగా దీన్ని అమలు చేశారు.

 

ఇక షెడ్యూల్‌ 9, 10 జాబితాలో ఉన్న సంస్థలకు సంబంధించి చట్టపరంగా ఇరు రాష్ట్రాల మధ్య ఆస్తుల పంపిణీ. వాటి విలువ దాదాపు రూ.1,42,601 కోట్లుగా అంచనా. అయితే ఆయా సంస్థలను విభజన చట్టంలో ప్రస్తావించకపోవడం వల్ల, ఆస్తుల పంపిణీ జరగకపోవడంతో ఆంధ్రప్రదేశ్‌కు చాలా నష్టం జరుగుతోంది. అందువల్ల వీటన్నింటికి సంబంధించి ఆంధ్రప్రదేశ్‌ ప్రయోజనాల దృష్ట్యా, కేంద్ర ప్రభుత్వ అత్యవసర జోక్యం తప్పనిసరి. 


5.

రాష్ట్ర విభజన తర్వాత వచ్చిన మరో సమస్య.. అంతర్‌రాష్ట్ర, కేంద్ర రాష్ట్రాల మధ్య ఉత్పన్నమవుతున్న వివాదాలు. ఆ కోవలో ప్రస్తుతం రాష్ట్రం ఎదుర్కొంటున్న ఈ సమస్యను మీ అందరి దృష్టికి తీసుకువస్తున్నాను. అదే తెలుగు గంగ ప్రాజెక్టు. 1976, 1977, 1983 నాటి అంతర్‌రాష్ట్ర ఒప్పందాల ప్రకారం మహారాష్ట్ర, కర్ణాటకతో పాటు, పూర్వ ఆంధ్రప్రదేశ్‌ కృష్ణా నదిలో తమకు కేటాయించిన నీటిలో 5 టీఎంసీల చొప్పున నాటి మద్రాస్‌ ఇప్పటి చెన్నై నగర తాగునీటి అవసరాల కోసం కేటాయించాల్సి ఉంది. 

అయితే ఈ విషయంలో ఇతర రాష్ట్రాల సహకారం లేకపోయినప్పటికీ, ఆంధ్రప్రదేశ్‌ మాత్రం తమ పొరుగునే ఉన్న తమిళనాడు ప్రభుత్వం కోరినప్పుడల్లా చెన్నై నగర తాగునీటి అవసరాల కోసం కృష్ణా నీరు సరఫరా చేస్తూనే ఉంది. అయితే ఇందు కోసం తగిన వసతుల కల్పన, నీటి సరఫరా వ్యవస్థ నిర్వహణకు సంబంధించి గత 10 ఏళ్లుగా ఆ రాష్ట్రం నుంచి రూ.338.48 కోట్లు రావాల్సి ఉంది. అందువల్ల ఈ విషయంలో జోక్యం చేసుకుని తగిన చర్యలు తీసుకోవాలని, వీలైనంత త్వరగా ఆ బకాయిలు చెల్లించేలా చూడాలని కోరుతున్నాను.


పాలారు ప్రాజెక్టు నిర్మాణాన్ని తమిళనాడు ప్రభుత్వం కాలడ్డుతోందని, ఈ ప్రాజెక్టు నిర్మాణం వల్ల కుప్పం ప్రజలకు తాగునీరు అందుతుందని, ఈ విషయంలో తగిన విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను. పాలారు ప్రాజెక్టు ద్వారా కేవలం 0.6 టీఎంసీల నీటిని మాత్రమే నిల్వచేస్తున్నాం. మరోవైపు తమిళనాడు అవసరాలకోసం ఏటా దాదాపు 10 టీఎంసీల నీటిని పంతున్నాం. ఇలాంటి నేపథ్యంలో పాలారు నిర్మాణానికి సహకరించేలా చూడాలని కేంద్రాన్ని కోరుతున్నాను.


6.

రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మరింత సంకట స్థితిలోకి తీసుకుపోయే అవకాశం ఉన్న మరో అంశాన్ని ఈ వేదికపై అందరి దృష్టికి తీసుకువస్తున్నాను. ఈ ఆర్థిక సంవత్సరానికి (2021–22) సంబంధించి నికర రుణ పరిమితి (ఎన్‌బీసీ)ని రూ.42,472 కోట్లుగా నిర్థారించడం జరిగింది. అన్ని రాష్ట్రాలకు వర్తించే విధంగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన ద్రవ్య బాధ్యత బడ్జెట్‌ యాజమాన్యం (ఎఫ్‌ఆర్‌బీఎం)కు అనుగుణంగా ఆ మొత్తం నిర్థారించారు.  

అయితే గత రాష్ట్ర ప్రభుత్వ హయాంలో పరిమితికి మించి రుణాలు సేకరించారన్న కేంద్ర ఆర్థిక శాఖ, ఈ ఏడాది నిర్ధారించిన నికర రుణ పరిమితి (ఎన్‌బీసీ)లో రూ.19,923.24 కోట్లు సర్దుబాటు చేసే విధంగా రుణ పరిమితిలో ఆ మేరకు కోత విధించింది. గత ప్రభుత్వం చేసిన అధిక రుణాలకు తమ బాధ్యత లేకపోయినప్పటికీ ఎన్‌బీసీలో కోత విధించడం సరి కాదని రాష్ట్ర ప్రభుత్వం ఎన్నిసార్లు మొర పెట్టుకున్నా కేంద్ర ఆర్థిక శాఖ సమ్మతించకపోగా, నికర రుణ పరిమితిలో కోతను ఏకంగా మరో మూడేళ్లకు విస్తరించింది.

2016–17 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తుది ఆడిట్‌ ఖాతాల వివరాలను రాష్ట్ర శాసనసభ ముందు ఉంచడంతో పాటు, ఆ వివరాలను ఏప్రిల్‌ 6, 2018 నాటికి అందరికీ (పబ్లిక్‌) అందుబాటులోకి తీసుకువచ్చారు. ఇక్కడే ఒక కీలకప్రశ్న తలెత్తుతోంది. రాష్ట్ర ప్రభుత్వం ఆనాడు పరిమితికి మించి రుణం సేకరించిన విషయం అప్పటికే తేటతెల్లం అయిన నేపథ్యంలో, కేంద్ర ఆర్థిక శాఖ ఆనాడే ఎందుకు స్పందించలేదు?. దాన్ని కట్టడి చేస్తూ ఆ తర్వాత ఏడాది, అంటే 2018–19లోనే రుణ సేకరణలో పరిమితి ఎందుకు విధించలేదు?. 

ఇక్కడ ఒక విషయాన్ని గుర్తు చేస్తున్నాను. పరిమితికి మించి అంటూ కేంద్ర ప్రభుత్వం కట్టడి చేస్తోంది. నిజానికి రాష్ట్ర ప్రభుత్వానికి అవి గ్రాంట్‌కాదు. వివిధ అవసరాల కోసం ప్రభుత్వం సేకరిస్తున్న రుణాల ఇవి. ఈ రుణాలను సక్రమంగా తీరుస్తోంది కూడా. అలాంటప్పుడు నికర రుణ పరిమితిలో కోత విధించడం సరికాదు.  గత ప్రభుత్వం తమ 5 ఏళ్ల పాలనలో అధిక మొత్తంలో రుణాలు సేకరించిందంటూ.. ఊహించని విధంగా కేంద్ర ఆర్థిక శాఖ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల రాష్ట్ర ప్రభుత్వం ఇబ్బంది పడుతోంది. మరోవైపు ఇప్పటికే  కోవిడ్‌ మహమ్మారితో ప్రభుత్వం సతమతమవుతోంది. అందువల్ల ఈ విషయంలో దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ మండలి ఛైర్మన్‌గా కేంద్ర హోంమంత్రి వెంటనే జోక్యం చేసుకోవాలని కోరుతున్నాను.


7.

రాష్ట్ర ప్రభుత్వం ఎదుర్కొంటున్న మరో సమస్య రేషన్‌ బియ్యం కేటాయింపులో హేతు బద్ధత లేని రీతిలో కేంద్రం నిర్ణయాలు ఉన్నాయి. జాతీయ ఆహార భద్రత చట్టం పరిధిలో రాష్ట్రాల్లో లబ్ధిదారుల గుర్తింపు ప్రక్రియలో అసమానతలు ఉన్నాయి. రాష్ట్రంలో ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్‌)ద్వారా 2.68 కోట్ల మందికి రేషన్‌ అందుతోంది. అంటే గ్రామీణ ప్రాంతాల్లో 61 శాతం, పట్టణ ప్రాంతాల్లో 41 శాతం మందికి మాత్రమే రేషన్‌ సరుకులు అందుతున్నాయి. నిజానికి ఇది ఏ మాత్రం సరికాదు. వాస్తవానికి గ్రామీణ ప్రాంతాల్లో 75 శాతం, పట్టణ ప్రాంతాల్లో 50 శాతం మందిని ప్రజా పంపిణీ వ్యవస్థలోకి తీసుకు రావాల్సి ఉంది. 

ఆంధ్రప్రదేశ్‌ కంటే ఆర్థికంగా బలంగా ఉన్న మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్‌ వంటి రాష్ట్రాలలో కూడా ఇక్కడి కంటే కనీసం 10 శాతం ఎక్కువ మందికి రేషన్‌ సరుకులు ఇస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌తో పోలిస్తే ఆయా రాష్ట్రాలు ఆర్థికంగా పరిపుష్టిగా ఉన్నాయి. అదే విధంగా అక్కడ మాదిరిగా టయర్‌–1 నగరాలు ఏపీలో లేవు. 

జాతీయ ఆహార భద్రత చట్టం పరిధిలో కేంద్రం గుర్తించిన లబ్ధిదారుల (పీడీఎస్‌ లబ్ధిదారులు)కు తోడు మరో 56 లక్షల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం స్వయంగా రేషన్‌ సరుకులు ఇస్తోంది. దీని వల్ల ప్రభుత్వంపై అదనపు భారం పడుతోంది. అందువల్ల రాష్ట్ర జనాభా, ఇక్కడి ఆర్థిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని పీడీఎస్‌లో మరింత మంది లబ్ధిదారులను చేరుస్తూ, ఆ గణాంకాలు సవరించాలని కోరుతున్నాను.


ఆంధ్రప్రదేశ్‌ ప్రజల స్థితిగతులను అర్థం చేసుకుని పరిస్థితులు మారేలా తగిన సిఫార్సులు చేయాలని గౌరవ ఎస్‌జడ్‌సీ ఛైర్మన్‌కు విజ్ఞప్తి చేస్తున్నాను. అదే విధంగా అంశాలవారీగా జరిగే చర్చల్లో రాష్ట్రానికి సంబంధించి విస్తృతస్థాయిలో ప్రస్తావన కొనసాగాలని ఆశిస్తున్నాను. ఇంకా నిర్ణీత వ్యవధిలో రాష్ట్ర సమస్యలు పరిష్కారమయ్యేలా స్వీయ నేతృత్వంలో ఒక కమిటీ ఏర్పాటు చేయాలని కేంద్ర హోం మంత్రిగారిని కోరుతున్నాను. 


ఈ సమావేశానికి వేదికగా రాష్ట్రాన్ని ఎంచుకున్నందుకు హోం మంత్రి గారికి ధన్యవాదాలు చెబుతున్నాను.

Comments
Popular posts
రైతు పండించిన పంటను కచ్చితంగా ఇ–క్రాపింగ్‌ చేయాలి:
Image
భారత త్రో బాల్ జట్టు కెప్టెన్ శ్రీ చావలి సునీల్ కి ఆర్థిక సహాయం క్రింద 25 లక్షల చెక్కును అందించిన రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక వ్యవహారాల యువజన సర్వీసుల శాఖ మంత్రి శ్రీమతి ఆర్.కే. రోజా
Image
అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందించడమే ప్రభుత్వ ధ్యేయం.
Image
దిశ పెట్రోలింగ్‌ వెహికల్స్‌ను ప్రారంభించనున్న సీఎం శ్రీ వైఎస్‌ జగన్*
Image
#దక్షిణదేశసంస్థానములచరిత్ర - 10 : #తెలుగువారిసంస్థానాలు - #జటప్రోలు (#కొల్లాపూరు) #సంస్థానము, మహబూబ్ నగర్ జిల్లా (తెలంగాణ రాష్ట్రం) - తెలంగాణ మైసూర్ ''కొల్లాపూర్" సంస్థాన ప్రభువులు (సంస్థానాధీశులు) పద్మనాయక రాచవెలమ వంశస్థులగు “#సురభివారు” (మొదటి భాగం)... కొల్లాపురం సంస్థానం పాలమూరు జిల్లాలో, నల్లమల అటవీ క్షేత్రంలో కృష్ణానది పరీవాహక ప్రాంతంలో ఉంది. ఈ సంస్థానాధీశులు 'కొల్లాపూరును' రాజధానిగా చేసుకొని పరిపాలించడం వల్ల ఈ సంస్థానాన్ని "కొల్లాపూరు సంస్థానమని" కూడా వ్యవహరిస్తారు. వీరు మొదట #జటప్రోలు రాజధానిగా పాలించి, తర్వాత 'కొల్లాపూర్, పెంట్లవెల్లి' రాజధానులుగా పాలించారు. 'నల్లమల ప్రాంతంలో' రెండవ శతాబ్దానికి చెందిన 'సోమేశ్వర, సంగమేశ్వర, మల్లేశ్వర' ఆలయాలున్నాయి. వీటికి ఎంతో గణనీయమైన పురావస్తు ప్రాముఖ్యత ఉంది. ఈ ఆలయాలు పదిహేను వందల ఏళ్ల క్రితం నిర్మించారు. వెడల్పయిన రహదారులు, దట్టమైన చెట్లతో ఈ ప్రాంతం నిండి ఉండడంతో కొల్లాపూర్ ను ''#తెలంగాణమైసూర్'' గా కూడా ప్రజలు పిలుస్తారు. ఈ సంస్థానం మొదట "విజయనగర చక్రవర్తులకు, చివరి నిజాం ప్రభువుకు" సామంత రాజ్యముగా వ్యవహరించబడింది. భారత దేశం స్వాతంత్య్రం పొందిన తర్వాత, ‘తెలంగాణలోని సంస్థానాలు’ భారత్ లో విలీనం అయ్యేవరకు ఈ సంస్థానం సివిల్ మెజిస్ట్రేట్ అధికారాలతో ఉంది. ‘నిజాం ప్రభువులు’ తమ ఆధీనంలో ఉన్న సంస్థానాలకు సర్వాధికారాలు ఇవ్వటం వల్ల ఆయా సంస్థానాలు స్వేచ్ఛగా పరిపాలన సాగించినాయి. 'నిజాం భూభాగం' బ్రిటిష్ రాజ్యంలో ఓ భాగమైతే 'సంస్థానాలు' నైజాం రాజ్యంలో చిన్న చిన్న 'రాజ్యాలుగా' వ్యవహరించబడ్డాయి. అలా వ్యవహరించబడిన సంస్థానాలలో #కొల్లాపురంసంస్థానం ఒకటి. ఇక్కడి సువిశాలమైన కోట ప్రాంగణంలో కొలువుదీరిన సుందరమైన రాజభవనాలు నాటి సంస్థానాధీశుల పాలనా వైభవాన్ని చాటు తున్నాయి. 'ఆలయాల అభివృద్ధి, ఆధ్యాత్మిక కృషికి' తోడు వివిధ రంగాల కవిపండిత సాహిత్య, కళాపోషణకూ వారు అధిక ప్రాధాన్యమిచ్చారు. అన్నింటికంటే ముఖ్యంగా ప్రజావసరాలకు అనుగుణమైన సౌకర్యాలను కల్పించడం ద్వారా ‘కొల్లాపూర్ సురభి సంస్థానాధీశులు’ జనరంజకమైన పాలన కొనసాగించారు. ఈ ప్రాంతాన్ని కేంద్రంగా చేసుకుని కొన్ని శతాబ్దాల పాటు తమ సంస్థానాన్ని ఏలారు ‘#సురభిరాజులవారసులు’. ఈ సంస్థానం వైశాల్యం 191 చ.మైళ్ళు. ఇందులో 30 వేల జనాభా దాదాపు 90 గ్రామాలు ఉండేవి. వార్షిక ఆదాయం ఇంచుమించుగా రెండు లక్షలు. ఈ సంస్థానం కృష్ణానది పరీవాహక ప్రాంతంలో ఉన్నది. పూర్వం జటప్రోలు సంస్థానానికి 'కొల్లాపురం' రాజధాని. ‘#సురభిలక్ష్మారాయబహద్దూర్’ వరకు అంటే సుమారు క్రీ.శ.1840 వరకు రాజధాని 'జటప్రోలు' గా ఉండేది. వీరి కాలం నుండి రాజధాని 'కొల్లాపూర్' కు మారింది. అప్పటి నుంచి 'కొల్లాపురం సంస్థానం' గా పేరొంది, ఈ ప్రాంతాన్ని పరిపాలించిన వారంతా 'కొల్లాపురం సంస్థాన ప్రభువులుగా' ప్రసిద్ధులయ్యారు. వీరు మొదట్లో 'పెంటవెల్లి' రాజధానిగా పాలన సాగించారు. #సురభివంశస్థులపూర్వీకులు 'దేవరకొండ' (నల్గొండ) ప్రాంతం నుంచి ఇక్కడికి వలస వచ్చారని చరిత్రకారుల అభిప్రాయం. ఈ సంస్థానాధీశులు మొదట జటప్రోలులో కోటను నిర్మించుకొని నిజాం ప్రభువులకు సామంతులుగా ఉన్నారు. ఇక్కడి సువిశాలమైన కోటలు, చక్కని భవనాలు సురభి సంస్థానాధీశుల కళాభిరుచిని చాటుతున్నాయి. నిజాం కాలంలో కొల్లాపూర్ పరిపాలన పరంగా ప్రముఖపాత్ర వహించింది. కొల్లాపూర్ రాజుకు మంత్రి లేదా సెక్రటరీగా వ్యవహరించిన 'కాట్ల వెంకట సుబ్బయ్య' ఇక్కడివారే. అనంతరం మంత్రిగా పని చేసిన 'మియాపురం రామకృష్ణారావు' కూడా ఇక్కడివారే. #జటప్రోలుసంస్థానస్థాపకులు - #సురభివంశచరిత్ర…. #పిల్లలమర్రిభేతాళనాయుడుమూలపురుషుడు!.... ఈ సంస్థానాన్ని స్థాపించిన పాలకులు విష్ణుపాదోధ్భవమగు పద్మనాయకశాఖలో డెబ్బది యేడు గోత్రములు గల #రాచవెలమతెగకు చెందిన "పద్మనాయక వంశ వెలమవీరులు". వీరిలో 'పది గోత్రములు గల 'ఆదివెలమలకు' సంస్థానములు లేవు. వీరు కాకతీయ రాజ్య కాలంలో రాజ్యరక్షణలో యుద్ధవీరులుగా చేరారు. ఒక దశలో వీరు స్వతంత్ర రాజ్యాలగు #రాచకొండ, #దేవరకొండ (క్రీ. శ. 1335 - 1475) కూడా స్థాపించారు. వీరు శాఖోపశాఖలుగా తెలుగు ప్రాంతంలో అనేక ప్రాంతాలలో పాలకులుగా అధికారాలు చెలాయించారు. 'వేంకటగిరి, పిఠాపురం, బొబ్బిలి, జటప్రోలు' సంస్థానాధీశులకు మూలపురుషుడు ఒక్కడే. “రేచర్ల గోత్రికుడైన పిల్లలమర్రి చెవిరెడ్డి (లేదా) భేతాళ నాయుడు” వీరికి మూలపురుషుడు. వెంకటగిరి, నూజివీడు, బొబ్బిలి సంస్థాన పాలకులకు ఇతడే మూలపురుషుడు (ఈ చరిత్ర గతంలో వెంకటగిరి సంస్థానములో వివరించాను). ఈ 'భేతాళనాయుడు / చెవిరెడ్డి' కాకతీయ చక్రవర్తి గణపతి దేవుని (క్రీ. శ. 1199 - 1262) పరిపాలన కాలం వాడు. 'భేతాళనాయునికి' తొమ్మిదవ తరం వాడైన 'రేచర్ల సింగమ నాయుడు (1291 -1361)' వంశస్థుడు 'రేచర్ల అనపోతనాయుడు (1331 -1384)' క్రీ.శ. 1243 లో "#కాకతీయసామ్రాజ్యవిస్తరణమునకు" ఎంతో దోహదం చేశాడు. సాహితీ రంగమునకు, సమరాంగణమునకు సవ్యసాచిత్వము నెఱపిన #సర్వజ్ఞసింగభూపాలుడు (1405 - 1475) ఈ కుదురుకు చెందినవాడు. ఈ సింగభూపాలాన్వయుడు #పెద్దమహీపతి. ఈయనే "సురభి" వారికి కూటస్థుడు. 'సురభి' అనునది జటప్రోలు పాలకుల గృహనామము, గోత్రము 'రేచర్ల'. పెద్దమహీపతికి అయిదవ తరమువాడు #సురభిమాధవరాయలు. ఈతడు ప్రసిద్ధమగు "చంద్రికా పరిణయం" ప్రబంధ కర్త. ఈ వంశం వారికి ‘కంచి కవాట చూరకార, పంచపాండ్య దళవిభాళ, ఖడ్గనారాయణ’ అనే బిరుదులున్నాయి. సుమారు రెండువందల సంవత్సరాల క్రితం ప్రస్తుతమున్న 'కొల్లాపురం' రాజధానిగా చేసుకొని పరిపాలన సాగించారు. ఈ వంశాన్ని '30 మంది రాజులు' దాదాపు 700 ఏళ్లు పరిపాలించారు. జటప్రోలు సంస్థాన స్థాపకుడు, రేచర్ల అనపోతనాయుడు వంశస్థుడు "రేచర్ల కుమార మదానాయుడు" జటప్రోలు సంస్థానాన్ని అభివృద్ధి చేశాడు. 36 వంశాలకు మూల పురుషుడైన భేతాళరాజు తర్వాత సామంతరాజులుగా కొల్లాపూర్ సంస్థానాన్ని 26 మంది 'సురభి వంశ రాజులు' పరిపాలించినట్టు చారిత్రక, సాహిత్య ఆధారాలు వెల్లడిస్తున్నాయి. 12వ శతాబ్ధం చివరి భాగంలో, 13వ శతాబ్ధం ఆరంభంలో అంటే 1195 నుంచి 1208 ఏండ్ల మధ్యకాలంలో 'భేతాళరాజు' పరిపాలన కొనసాగించినట్టు శాసన ఆధారాలున్నట్టు 'శ్రీ వేదాంతం మధుసూదన శర్మ' తాను స్వయంగా రచించిన #కొల్లాపూర్ #సాహితీవైభవం పుస్తకంలో పేర్కొన్నారు. ఆయన తరువాత మాదానాయుడు, వెన్నమనాయుడు, దాచానాయుడు, సింగమనాయుడు, అనపోతానాయుడు, ధర్మానాయుడు, తిమ్మానాయుడు, చిట్టి ఆచానాయుడు, రెండో అనపోతానాయుడు, చిన్న మాదానాయుడు, ఎర్ర సూరానాయుడు, చిన్న మాదానాయుడు, మల్లానాయుడు, పెద్దినాయుడు, మల్లభూపతి, పెద్ద మల్లానాయుడు, మాధవరాయలు, నరాసింగరావు, మాధవరావు, బారిగడపలరావు, పెద్ద రామారాయుడు, జగన్నాథరావు, వెంటలక్ష్మారావు, వేంకట జగన్నాథరావు, వేంకట లక్ష్మారావు, జగన్నాథరావులు కొల్లాపూర్ సంస్థానాన్ని పాలించారు. ప్రస్తుతం వారి వారసుడిగా వేంకట కుమారకృష్ణ, బాలాదిత్య, లక్ష్మారావులు సంస్థానాధీశులుగా ఉన్నారు. "#సురభిమాధవరాయలు" విజయనగర ప్రభువు #అరవీటివంశ #అళియరామరాయలు (ఈయన శ్రీకృష్ణదేవరాయల అల్లుడు, చాళుక్య సోమవంశ క్షత్రియులు, రాచవారైన 'అరవీటి రామరాజు') కాలమున 'జటప్రోలు సంస్థానమును' బహుమతుగా పొందెను. "అళియ రామరాయలు" ఇచ్చిన సన్నదులో "ఆనెగొంది తక్తుసింహాసనానికి అధిపతులయిన..." అని కలదు (సురభి మాధవరాయలు, సారస్వత సర్వస్వము). 'సురభి వారి పూర్వీకుల' నుండీ వచ్చుచున్న వారసత్వ హక్కును 'అళియ రామరాయలు' సురభి మాధవరాయలకు స్థిరపరిచెను. "విజయనగర సామ్రాజ్య పతనానంతరం", మాధవరాయల పుత్రులు గోల్కొండ నవాబు "అబ్దుల్ హసన్ కుతుబ్ షా (తానీషా)" వలన క్రీ.శ. 1650లో మరల సంస్థానమునకు కొత్త సనదును సంపాదించెనట. వీరి తరువాత "సురభి లక్ష్మారాయ బహద్దరు" గారి వరకూ (సుమారు క్రీ.శ. 1840) సురభి వారి రాజధాని 'జటప్రోలు'. వీరి కాలమునుండి రాజధాని 'కొల్లాపురము' నకు మారినది. అప్పటినుండి వీరు '#కొల్లాపురముప్రభువులు' గా ప్రసిద్ధులయ్యారు. #సురభివారిరాజవంశవృక్షము.... 'సర్వజ్ఞ సింగభూపాలుని' వంశజులగు ఈ సంస్థానాధీశులందరూ శారదామతల్లికి సమర్పించిన మణిహారాలు తెలుగు సాహితీలోకమునకు వెలలేనివి. నిత్యకళ్యాణము పచ్చతోరణముగ విలసిల్లిన వీరి సాహితీమండపము విశ్వవిఖ్యాతమై విలసిల్లినది. (1) సర్వజ్ఞ సింగభూపాలుడు (1405 - 1475) (2) ఎఱ్ఱ సూరానాయుడు (3) మాధవ నాయుడు (4) పెద్దమహీపతి (5) ముమ్మిడి మల్లభూపాలుడు (1610 - 1670) (6) చినమల్లనృపతి (7) రామరాయలు (8) మల్లభూపతి (9) మాధవ రాయలు (10) నరసింగరావు (11) సురభి లక్ష్మారాయ బహద్దరు (1840) (12) రావు బహద్దర్ సురభి లక్ష్మీ జగన్నాధ రావు (1851 - 1884) (13) శ్రీ రాజా వేంకట లక్ష్మారావు బహద్దరు. "సురభి లక్ష్మారావు" గారి కుమారుడు 'సురభి లక్ష్మీ జగన్నాధరావు' క్రీ.శ. 1851 - 84 వరకూ రాజ్యము చేసిరి. నిజాం ప్రభువు నుండి 'రాజా బహద్దరు, నిజాం నవాజ్ వంత్' బిరుదులు పొందారు. వీరు దేవబ్రాహ్మణ తత్పరులు. వీరికి సంతానం లేకపోవడంతో, 'వెంకటగిరి ప్రభువులగు మహారాజా శ్రీ సర్వజ్ఞకుమార యాచేంద్ర బహద్దరు' గారి చతుర్థ పుత్రులగు 'నవనీత కృష్ణ యాచేంద్రులను' దత్తపుత్రులుగా స్వీకరించారు. వీరే 'శ్రీ రాజా వేంకట లక్ష్మారావు బహద్దరు' అను పేరిట 1884 నుండి జటప్రోలు సంస్థానమును పాలించారు. వీరికి 'బొబ్బిలి సంస్థాన పాలకులగు మహారాజా సర్ రావు వెంకట శ్వేతాచలపతి రంగారావు' గారు అగ్రజులు. ఈయన 'వెంకటగిరి' నుండి 'బొబ్బిలి' సంస్థానమునకు దత్తు వచ్చెను. వీరికిద్దరు పుత్రికా సంతానము. లక్ష్మారాయ బహద్దరు వారి కుమార్తెను 'తేలప్రోలు రాజా' గారికిచ్చి వివాహం చేసెను. లక్ష్మారాయ బహద్దర్ వారి ప్రధమ కుమార్తె 'నూజివీడు సంస్థానమున' తేలప్రోలు రాజావారి ధర్మపత్ని 'రాణి రాజరాజేశ్వరీ దేవి' గారు. రెండవ కుమార్తె శ్రీ రాజా ఇనుగంటి వెంకట కృష్ణారావు గారి ధర్మపత్ని 'రాణి సరస్వతీ దేవి గారు'. శ్రీ రాజా సురభి లక్ష్మారాయ బహద్దర్ గారికి పురుష సంతతి లేదు. కావున, వీరు తమ వారసులుగా ప్రఖ్యాత 'బొబ్బిలి సంస్థానమునుండి శ్రీ రాజా వెంకటశ్వేతా చలపతి రామకృష్ణ రంగారావు బహద్దర్' వారి కుమారులను దత్తు చేసుకొనెను. వారిని 'శ్రీ రాజా సురభి వేంకట జగన్నాధరావు బహద్దర్' అను పేర సంస్థాన వారసులుగా నిర్ణయించెను. ప్రస్తుత 'కొల్లాపూర్ రాజవంశీయులు' వీరి అనువంశీకులే. శ్రీ రాజా వేంకట లక్ష్మారావు గారి అనంతరము వారి ధర్మపత్ని '#రాణివెంకటరత్నమాంబ' గారు సంస్థానమును కొంతకాలం పాలించారు. తరువాత వీరి దత్తపుత్రులు 'శ్రీ రాజా సురభి వెంకట జగన్నాధ రావు బహద్దరు' గారు సంస్థాన బాధ్యతలు నిర్వహించారు. వీరు 'తిరుపాచూరు' జమిందారులైన 'రాజా ఇనుగంటి వెంకట కృష్ణరావు (1899 - 1935)' కుమార్తె యగు 'ఇందిరాదేవిని' వివాహమాడెను. వీరి కాలముననే అన్ని సంస్థానములతో పాటుగా జటప్రోలు కూడా విశాలాంధ్రమున విలీనమైనది. లక్ష్మారావు 1928లో స్వర్గస్తులైనారు. ఆయన ధర్మపత్ని రాణిరత్నమాంబ జగన్నాథరావుకు సంరక్షకురాలిగా ఉంటూ రాజ్యభారం మోశారు. ఆమె సింగవట్నంలో #రత్నగిరికొండపై #రత్నలక్ష్మిఅమ్మవారిని ప్రతిష్టించి ఆలయాన్ని నిర్మించారు. 'పద్మనిలయం' పేరుతో విడిది కోసం ఒక బంగ్లాను కళాత్మకంగా కట్టించారు. ఆ కొండపై నుంచి దుర్భిణిలో చూస్తే 'జటప్రోలు, పెంట్లవెల్లి, కొల్లాపూర్' రాజసౌధాలేగాక ఆయా ప్రాంతాలు కళ్లముందున్నట్టుగా కనిపిస్తాయి. కొల్లాపూర్లోని బండయ్యగుట్ట సింగవట్నంలోని #లక్ష్మీనృసింహస్వామిఆలయం గుడి గోపురాలను కూడా ఆమె నిర్మించారు. 'జగన్నాథరావు' మేజర్ అయిన తర్వాత 1943లో పట్టాభిషేకం చేశారు. ఈయన తన పూర్వికుల మాదారిగానే పరిపాలన సాగించారు. 'రాజా జగన్నాథరావ
Image