టిటిడి ఛైర్మన్‌, ఈవో దీపావళి శుభాకాంక్షలు

     తిరుమ‌ల‌,  న‌వంబ‌రు 03 (ప్రజా అమరావతి)!


టిటిడి ఛైర్మన్‌, ఈవో దీపావళి శుభాకాంక్షలు


టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ వై.వి.సుబ్బారెడ్డి, కార్యనిర్వహణాధికారి డాక్ట‌ర్ కె.ఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి, అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి,  శ్రీవారి భక్తులకు మరియు టిటిడి ఉద్యోగుల‌కు దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు.


శ్రీవారి ఆశీస్సులతో ఈ దీపావళి అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని, అందరూ సుఖశాంతులతో ఉండాలని బుధ‌వారం ఒక ప్రకటనలో ఆకాంక్షించారు.


లోకకల్యాణార్థం నరకాసుర నరకాసుర వధ  జరిగిన విధంగానే కరోనాను కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి వారు అంతం చేసి, ప్రజలందరికీ ఆయురారోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించాలని వారు పేర్కొన్నారు.


Comments