పెండింగ్ అటవీ క్లియరెన్సు అంశాలపై సిఎస్ డా.సమీర్ శర్మ సమీక్ష
అమరావతి,12 నవంబరు (ప్రజా అమరావతి):శ్రీకాకుళం,విజయనగరం,విశాఖపట్నం,తూర్పు గోదావరి జిల్లాల్లో ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన(PMGSY)మరియు ఇతర పధకాల ద్వారా మంజూరు చేసిన రోడ్లు,వంతెనలకు సంబంధించి పెండింగ్ లో ఉన్న అటవీ క్లియరెన్సులు వేగవంతంగా వచ్చి పనులు సకాలంలో పూర్తి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.సమీర్ శర్మ అధికారులను ఆదేశించారు.పెండింగ్ అటవీ క్లియరెన్సులు, జలజీవన్ మిషన్, గ్రామ ఆరోగ్య కేంద్రాలు,గ్రామ పారిశుధ్య ఇంప్రూవ్మెంట్ స్ట్రాటజీ,ప్రివెంటివ్ ప్రాక్టీస్ అంశాలపై అమరావతి సచివాలయంలో శుక్రవారం ఆయన అధికారులతో సమీక్షించారు.ఈసందర్భంగా సిఎస్ మాట్లాడుతూ పెండింగ్ అటవీ క్లియరెన్సులన్నీ త్వరగా వచ్చేలా చూసి పనులు వేగవంతంగా పూర్తి చేయాలని ఈఅంశంపై ప్రతినెల సమీక్షించడం జరుగుతుందని తెలిపారు.అటవీశాఖ అధికారులు కూడా దీనిపై క్షేత్రస్థాయిలో తరచు సమీక్షించుకుని అటవీ క్లియరెన్సులన్నీ పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం జలజీవన్ మిషన్,గ్రామ ఆరోగ్య కేంద్రాలు,గ్రామ పారిశుధ్య ఇంప్రూవ్మెంట్ స్ట్రాటజీ, ప్రివెంటివ్ ప్రాక్టీసు తదితర అంశాలపై సిఎస్ డా.సమీర్ శర్మ అధికారులతో సమీక్షించారు.
ఈసమావేశంలో రాష్ట్ర పంచాయితీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి,రవాణా మరియు రోడ్లు భవనాల శాఖల ముఖ్యముఖ్య కార్యదర్శులు గోపాలకృష్ణ ద్వివేది,యం.టి.కృష్ణబాబు, అటవీశాఖ ప్రత్యేక కార్యదర్శి డా.చలపతిరావు,అదనపు పిసిసిఎఫ్,పంచాయితీరాజ్ శాఖ ఇఎన్సిలు పాల్గొనగా,శ్రీకాకుళం,విజయనగరం, విశాఖపట్నం,తూర్పు గోదావరి జిల్లాల కలక్టర్లు వీడియో లింక్ ద్వారా ఈసమావేశంలో పాల్గొన్నారు.
addComments
Post a Comment