ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ

 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల  నిర్వహణ శాఖ

   కుంచనపల్లి (ప్రజా అమరావతి).

   

ఐఎండి వాతావరణ సూచనల ప్రకారం నైరుతి మరియు పశ్చిమ-మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన వాయుగుండం  వాయువ్య దిశగా పయనించి  గురువారం సాయంత్రం ఉత్తర తమిళనాడు & దక్షిణ కోస్తాంధ్ర  మధ్య చెన్నై  సమీపంలో తీరం దాటిందని విపత్తుల నిర్వహణ శాఖ కమిషనర్ కె.కన్నబాబు తెలిపారు. దీని ప్రభావంతో  రేపు కుడా కోస్తాంధ్ర, రాయలసీమలో అక్కడక్కడ భారీ వర్షాలు, మిగిలిన చోట్ల విస్తారంగా తేలికపాటి నుంచి మోస్తరు  వర్షాలు  కురిసే అవకాశం ఉందని అన్నారు. 


గౌరవ ముఖ్యమంత్రిగారి సూచనలతో భారీవర్షాల నేపధ్యంలో  ఎప్పటికప్పుడు  ప్రభావిత జిల్లాల  అధికారులను అప్రమత్తం చేస్తున్నామని  అన్నారు.  అత్యవసర సహాయక చర్యలకోసం చిత్తూరు జిల్లాకు 1 ఎన్డీఆర్ఎఫ్, 2 ఎస్డీఆర్ఎఫ్ బృందాలు, యస్పీయస్ నెల్లూరుజిల్లాకు  1ఎన్డీఆర్ఎఫ్ బృందం పంపించామని తెలియజేశారు. 


శనివారం అండమాన్ సముద్రంలో  మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు  అది ఈ నెల 17న  దక్షిణకోస్తాంధ్ర వద్ద తీరందాటే అవకాశాలున్నాయని ప్రాథమిక అంచనాగా తెలిపారు. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

Comments