విశాఖపట్నం (ప్రజా అమరావతి);
*విశాఖపట్నంలో సీఎం శ్రీ వైఎస్ జగన్ పర్యటన*
*ఎన్‌ఏడీ జంక్షన్‌లో ఎన్‌ఏడీ ఫ్లై ఓవర్, వీఎంఆర్‌డీఏ అభివృద్ది చేసిన మరో 6 ప్రాజెక్ట్‌లను ప్రారంభించిన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్*
*విశాఖ నగరానికి మరింత శోభ చేకూరేలా మహా విశాఖ నగర పాలక సంస్ధ (జీవీఎంసీ), విశాఖ మెట్రో రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ (వీఎంఆర్‌డీఏ) చేపట్టిన ప్రాజెక్ట్‌లను ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ ప్రారంభించారు*.
*1. ఎన్‌ఏడీ ఫ్లై ఓవర్*
దేశంలోనే తొలిసారిగా రోటరీ మోడల్‌లో ఈ వంతెనను రూ. 150 కోట్లతో నిర్మించారు.
2. పిఠాపురం కాలనీలో రూ. 7.60 కోట్లతో నిర్మించిన వాణిజ్య సముదాయం ప్రారంభం
3. రూ. 7.55 కోట్లతో ఆనందపురం జంక్షన్ నుంచి బొని గ్రామం వరకూ 9 కిలోమీటర్ల మేర నిర్మించిన రెండు వరసల రహదారి ప్రారంభం
4. రూ. 7.50 కోట్లతో మధురవాడ లా కాలేజ్ నుంచి రుషికొండ బీచ్ వరకూ నిర్మించిన రెండు వరసల రహదారి ప్రారంభం
5. రూ. 6.97 కోట్లతో ఎన్ హెచ్ 16 నుంచి విశాఖ వ్యాలీ స్కూల్ మీదుగా బీచ్ రోడ్ వరకూ నిర్మించిన రెండు వరసల రహదారి ప్రారంభం
6. రూ. 5.14 కోట్లతో చినముషిడివాడలో నిర్మించిన కళ్యాణమండపం ప్రారంభం
7. రూ. 1.56 కోట్లతో తాటిచెట్లపాలెంలోని ధర్మానగర్‌లో నిర్మించిన కమ్యూనిటీ హాల్ ప్రారంభం
*వుడా పార్క్ వద్ద జరిగిన ప్రారంభోత్సవాలు*
*1. వుడా పార్క్ ఆధునీకరణ*
రూ. 33.50 కోట్లతో వుడా పార్కును సమగ్ర అభివృద్ది చేసి స్మార్ట్ పార్క్‌గా తీర్చిదిద్దారు. అంతర్జాతీయ ప్రమాణాలతో పూర్తయిన ఆధునీకరణ పనులు
2. జగదాంబ జంక్షన్‌లో రూ. 11.45 కోట్లతో మల్టీలెవల్ కార్ పార్కింగ్ ప్రారంభం. మెకనైజ్డ్ ఆటోమెటిక్ పార్కింగ్ సౌకర్యంతో అత్యాధునికంగా నిర్మించారు
3. రూ. 4.65 కోట్లతో దండుబజార్‌లో మహారాణి విద్యా దేవి హైస్కూల్ ని విభిన్నంగా, వినూత్నంగా తీర్చిదిద్దారు.
4. రూ. 4.24 కోట్లతో శిధిలావస్ధలో ఉన్న టౌన్ హాల్ ఆధునీకరణ
5. రూ. 7.16 కోట్లతో ఓల్డ్ మునిసిపల్ హాల్ ఆధునీకరణ.
addComments
Post a Comment