*"ఖరేశ్వర స్వామి సేవలో కాకాణి
"*
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా (ప్రజా అమరావతి), సర్వేపల్లి నియోజకవర్గం, తోటపల్లి గూడూరు మండల పరిషత్ కార్యాలయంలో గ్రామాల వారిగా ప్రజల సమస్యలు తెలుసుకొని, అర్జీలు స్వీకరించి, పరిష్కరించవలసిందిగా అధికారులను కోరిన వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, సర్వేపల్లి శాసనసభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి .
అతి పురాతనమైన ఖరేశ్వర స్వామిని దర్శించుకొని, ప్రత్యేక పూజలు నిర్వహించి, దేవస్థానం ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకరణోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకాణి.
ప్రజల సమస్యల పరిష్కారానికి మండల కేంద్రాలలో గ్రామాల వారీగా నిర్వహిస్తున్న సమీక్షలు సత్ఫాలితాలను ఇస్తున్నాయి.
సుదీర్ఘ కాలంగా పెండింగ్ లో ఉన్న రెవిన్యూ సమస్యలతో పాటు, ఇతర సమస్యలను కూడా పరిష్కరించే దిశగా అధికారులు ఆలోచన చేయడం అభినందనీయం.
వ్యవసాయ భూముల సమస్యల మీద రైతులు, సంక్షేమ పథకాల సమస్యలపై, ప్రజలు కార్యాలయాల చుట్టూ, అధికారుల చుట్టూ తిరగకుండా సమగ్రంగా పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాం.
సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న చుక్కల భూముల సమస్యలు, పొరపాటున పట్టా భూములు ప్రభుత్వ భూములుగా నమోదు కావడం లాంటి సమస్యలపై త్వరితగతిన పరిష్కరించవలసిందిగా జిల్లా అధికారులను కోరాం.
గ్రామాలలో ప్రజలకు పూర్తి స్థాయిలో మౌలిక సదుపాయాలు కల్పించడంతోపాటు, ప్రజలు ఎదుర్కొంటున్న వ్యక్తిగత సమస్యలపై కూడా దృష్టి పెట్టి పరిష్కారానికి కృషి చేస్తున్నాం.
అతి పురాతన శివాలయం ఖరేశ్వర స్వామి దేవస్థానంకు నూతనంగా నియమితులైన ధర్మకర్తల మండలి సభ్యులకు, చైర్మన్ చిరంజీవులు గౌడ్ గారికి నా హృదయపూర్వక అభినందనలు.
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సామాజిక న్యాయాన్ని పాటిస్తూ, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 50 శాతం దేవాలయ కమిటీలో స్థానం కల్పించడంతోపాటు, 50 శాతం మహిళలకు కేటాయించడం విశేషం.
ఖరేశ్వర స్వామికి భక్తులు సమర్పించిన భూములు 100 ఎకరాలలో దాదాపు 35 ఎకరాలు అన్యాక్రాంతమై, 65 ఎకరాలు మాత్రమే మిగిలాయి.
తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఆలయ భూముల ద్వారా దేవాలయాలకు రాబడి రాకుండా, తెలుగుదేశం నాయకులే భోంచేశారు.
ఖరేశ్వర స్వామి దేవస్థానానికి చెందిన 65 ఎకరాల భూమికి ఎటువంటి వేలంపాటలు వేయకుండా అధికారాన్ని అడ్డుపెట్టుకొని తెలుగుదేశం నాయకులు దశాబ్దాలుగా అనుభవిస్తున్నారు.
దేవాలయ భూములకు కేవలం నాలుగు లక్షలు ఇస్తామని ఒప్పుకొని, కౌలు డబ్బులు కూడా కట్టకుండా, అడిగిన అధికారులపై దౌర్జన్యానికి పాల్పడ్డారు.
సర్వేపల్లి నియోజకవర్గంలో తెలుగుదేశం నాయకుల దోపిడీ వల్ల అనేక దేవాలయాలు కనీసం నిర్వహణ, మరమ్మతులకు నోచుకోక శిధిలావస్థకు చేరుకున్నాయి.
వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం నాయకులు దౌర్జన్యంగా ఆక్రమించుకున్న భూములకు వేలం పాటలు నిర్వహించి, గతంలో కంటే మూడు రెట్లు అధికంగా 12 లక్షల రూపాయలు దేవస్థానం ఖాతాలో జమ చేయడం జరిగింది.
నూతన పాలక మండలి సభ్యులు, అధికారులతో కలిసి భక్తులు, స్థానిక ప్రజల అభీష్టం మేరకు దేవాలయాలను అన్నివిధాలా అభివృద్ధి చేస్తాం .
సర్వేపల్లి నియోజకవర్గంలోని అన్ని ప్రధాన దేవాలయాలకు పాలకమండళ్లను ఏర్పాటు చేసి, భక్తులు, స్థానిక ప్రజల మనోభావాలను పరిగణలోకి తీసుకొని, అన్ని దేవాలయాలకు పూర్వ వైభవం సంతరించుకునే విధంగా కృషి చేస్తాం.
addComments
Post a Comment