రైతులతో కలిసి కాకాణి సాగునీటి కాలువల పరిశీలన"

 "రైతులతో కలిసి కాకాణి సాగునీటి కాలువల పరిశీలన"



శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా (ప్రజా అమరావతి), సర్వేపల్లి నియోజకవర్గంలో రైతులు, సాగునీటి పారుదల శాఖ అధికారులతో కలిసి సాగునీటి కాలువలను పరిశీలించిన వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, సర్వేపల్లి శాసనసభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి .



 సర్వేపల్లి నియోజకవర్గ రైతాంగానికి సాగునీటి ఇబ్బందులు లేకుండా అన్ని విధాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాం.


 ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వచ్చిన వరదల ప్రభావం వలన దెబ్బతిన్న కాలువలు, చెరువులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయించాం.


 రైతాంగానికి సజావుగా సాగునీరు అందించడానికి చిన్నపాటి అడ్డంకులు ఏర్పడినా, తక్షణమే తొలగిస్తున్నాం.


 సర్వేపల్లి నియోజకవర్గంలో రైతాంగానికి సాగునీటి కష్టాలు లేకుండా చివరి ఆయకట్టు భూముల వరకు సమృద్ధిగా సాగునీరు అందిస్తున్నాం.


 యూరియా, ఎరువుల కొరత దేశవ్యాప్తంగా ఉన్నా, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చొరవ తీసుకొని, వీలైనంత ఎక్కువ ఎరువులు రైతాంగానికి అందించే ప్రయత్నం చేస్తున్నారు.


 సర్వేపల్లి నియోజకవర్గంలో రైతాంగానికి ఎరువుల కొరత లేకుండా రైతు భరోసా కేంద్రాల ద్వారా పంపిణీ చేస్తున్నాం.


 రైతాంగం సజావుగా వ్యవసాయం చేసుకోవడానికి అవసరమైన సహాయ సహకారాలు అందిస్తున్న వ్యవసాయ శాఖ, నీటిపారుదల శాఖ అధికారులకు నా ధన్యవాదాలు.


 సర్వేపల్లి నియోజకవర్గ రైతాంగానికి సాగునీరు అందించడం, ఎరువులు పంపిణీతోపాటు, పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించేంత వరకు నిరంతరం అందుబాటులో ఉంటా.

Comments