అన్నమయ్య ప్రాజెక్టు దిగువ గ్రామాల్లో వరద బాధితులకు సీఎం పరామర్శ



*అన్నమయ్య ప్రాజెక్టు దిగువ గ్రామాల్లో వరద బాధితులకు సీఎం పరామర్శ*



*తీవ్రంగా దెబ్బతిన్న పులపత్తూరులో  కలియదిరిగిన సీఎం*


*సమస్యలపై స్వయంగా ఫీడ్‌ బ్యాక్‌ విన్న సీఎం*


*అక్కడికక్కడే పరిష్కారాల ప్రకటన*


*విధ్వంసం జరిగిన తీరును బాధితులనుంచి తెలుసుకున్న సీఎం*


*ఆనాటి ఉత్పాతాన్ని వివరించిన బాధితులు*


*ప్రభుత్వం, అధికారులు స్పందించిన తీరుపై బాధితులకు సీఎం ప్రశ్నలు*


*సహాయం అందిందా? లేదా? ఆలస్యమైందా? అందరికీ వచ్చిందా? ఇలా అన్నిరకాలుగా ప్రశ్నించిన సీఎం*


*ప్రభుత్వం, యంత్రాంగం పనితీరుపై బాధితుల హర్షం*


*గతంలో ఎన్నడూ ఇంత వేగంగా సహాయం అందిన సందర్భాల్లేవన్న బాధితులు*


*వరదలో కొట్టుకుపోయి ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకూ పరామర్శ*


*వారి కన్నీటి వ్యథలను విన్న ముఖ్యమంత్రి*


*ఆకుటుంబాలు నిలదొక్కుకునేలా తగిన సహాయ సహకారాలు అందిస్తామన్న ముఖ్యమంత్రి*


*ఉప్పెనలా వచ్చిన వరద సమయంలో సాహసోపేతంగా పలువురి ప్రాణాలు కాపాడిన యువకులకు అభినందన*


*బాధిత కుటుంబాల్లోని యువకులు, యువతులకు ఉపాధి, ఉద్యోగాలపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలంటూ కలెక్టర్‌కు సీఎం ఆదేశం*


*మీ కళ్లముందే ఇళ్లకట్టించి ఇస్తానంటూ బాధితులకు చెప్పిన సీఎం*


*మందపల్లిలో 9 మందిని కోల్పోయి పూజారి కుటుంబాన్నీ పరామర్శించిన  సీఎం*


*కన్నీరుమున్నీరుగా విలపించిన కుటుంబ సభ్యులకు తోడుగా నిలుస్తామన్న సీఎం*


*ఆ కుటుంబాలను ఆదుకునేలా మరిన్ని చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు*


*గ్రామాలు నిదొక్కుకునేంతవరకూ అండగా నిలుస్తామన్న హామీ*


*సహాయ పునరావాస ప్రక్రియ కొనసాగుతుందన్న సీఎం*


పులపత్తూరు, మందపల్లి, ఇతర వరదబాధిత ప్రాంతాలనుంచి (కడప జిల్లా) (ప్రజా అమరావతి):


అన్నమయ్య ప్రాజెక్టు తెగిపోవడం కారణంగా తీవ్ర వి«ధ్వంసానికి గురైన గ్రామాల్లో ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌.జగన్‌ పర్యటించారు. బాధితులందరికీ అన్నిరకాలుగా తోడుగా ఉంటామన్నారు. ప్రాణాలు, ఆస్తులు.. ఇలా అన్నిరకాలుగా నష్టపోయిన బాధితులను ఆయన పరామర్శించారు. విపత్తులో ప్రభుత్వం, యంత్రాంగం పనితీరుపై పలు ప్రశ్నలు వేశారు. సేవలు అందిన తీరును అడిగి తెలుసుకున్నారు. ఊహించని విపత్తు సమయంలో అధికార యంత్రాంగం, రాష్ట్ర ప్రభుత్వం పనితీరుపై బాధితులు సంతోషం వ్యక్తంచేశారు. శరవేగంగా ఆదుకున్నారంటూ ముఖ్యమంత్రికి వివరించారు. బాధితులను ఆదుకునే ప్రక్రియ కొనసాగుతుందని సీఎం ప్రకటించారు. ఏం చేస్తే బాగుంటుందో గ్రామస్తులనుంచే ఫీడ్‌ బ్యాక్‌ తీసుకుని పలు పరిష్కారాలను సీఎం ప్రకటించారు. 


పులపత్తూరలో నలుమూలా...


అన్నమయ్య ప్రాజెక్టుకు దిగువన ఉన్న పులపత్తూరు గ్రామామంలో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ పర్యటించారు. మందపల్లి, ఆకేపాడు సమీపంలోని హెలిపాడ్‌ నుంచి నేరుగా ఆయన పులపత్తూరు చేరుకున్నారు. వరద కారణంగా దెబ్బతిన్న ఇళ్లు, విధ్వంసానికి గురైన రోడ్లు తదితర ప్రాంతాలను సీఎం పరిశీలించారు. పులపత్తూరులో రాయలవీధి నుంచి సీఎం నడుచుకుంటూ గ్రామం అంతా తిరిగారు. భారీ వరద కారణంగా ఇళ్లు కూలిపోవడంతో నిరాశ్రయులైన నాగేశ్వరమ్మ, సుబ్బరాయమ్మ, లక్ష్మీదేవి, శ్రీనివాసరావు, ఆదిలక్ష్మి తదితర బాధితులను సీఎం స్వయంగా కలుసుకున్నారు. ఉప్పెనలా వచ్చిన వరద ఏవిధంగా నష్టంపై బాధితులను అడిగితెలుసుకున్నారు. 

అదే వీధిలో వరద కారణంగా ప్రాణాలు కోల్పోయిన వెంకటరాజు, శంకరమ్మ, ఆదెమ్మ కుటుంబాలను కూడా సీఎం కలుసుకున్నారు. ఆయా కుటుంబాలకు అండగా ఉంటామని చెప్పారు. 

వరద ఎలాంటి విధ్వంసాన్ని సృష్టించిందీ, తర్వాత ప్రభుత్వం, అధికారులు ఎలాంటి చర్యలు తీసుకున్నారన్నదానిపై వివిధ ప్రభుత్వ విభాగాలు ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌పైన కూడా సీఎం పరిశీలించారు. 


అధికారులు ఎలా స్పందించారు? సహాయం అందిందా? అందేలా?: 

బాధితులకు సీఎం ప్రశ్నలు:


బాధితులను కలుసుకున్న సమయంలో సీఎం వారికి పలు ప్రశ్నలు వేశారు. తక్షణ చర్యగా ప్రభుత్వం ప్రకటించిన సహాయం అందిందా? లేదా? అన్నదానిపై సీఎం వారికి పలు ప్రశ్నలు వేశారు. రేషన్‌నుంచి, పాక్షికంగా ధ్వంసమైన ఇంటికి, పూర్తిగా ధ్వంసమైన ఇంటికి కూడా పరిహారం అందిందా? లేదా? ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా?అని అడిగారు. ప్రభుత్వం యంత్రాంగం బాగా చేసిందని, అధికారులు స్పందించి ఆదుకున్నారని బాధితులు సీఎంకు వివరించారు. స్థానిక ప్రజా ప్రతినిధులుకూడా విశేషంగా పనిచేశారంటూ సీఎంకు చెప్పారు.

అదే సమయంలో రానున్న రోజుల్లో చేపట్టబోయే కార్యక్రమాల గురించికూడా వివరించారు. ఇంకా ఎవరైనా సహాయం అందకపోతే వెంటనే సచివాలయాలను సంప్రదించాలని సూచించారు. అధికారులను అన్ని సమస్యలు పరిష్కారమయ్యేంతవరకూ ఇక్కడే ఉంచుతామని సీఎం బాధితులకు తెలిపారు. 


వరద కారణంగా తమ ఇళ్లు పూర్తిగా కూలిపోయాయని బాధితులు సీఎంకు వివరించారు. భవిష్యత్తులో మళ్లీ మంపు వస్తుందనే ఆందోళనను వారు వ్యక్తంచేసినప్పుడు, అలాంటి దానినికి ఆస్కారం లేకుండా ఎల్తైన ప్రాంతంలో కడతామని, ఇప్పటికే భూమిని గుర్తించి పట్టాలు కూడా సిద్ధంచేశారని సీఎం వారికి వివరించారు. సహజంగా ఇలాంటి విపత్తుల సమయంలో ఇళ్లు పూర్తిగా ధ్వంసమైతే రూ.95వేలు ఇచ్చి, కొత్త ఇంటిని మంజూరుచేస్తారని, కాని ఘటన తీవ్రతదృష్ట్యా బాధితులను ఆదుకునేందుకు మరింత ముందుకు వస్తున్నామని సీఎం చెప్పారు. 5 స్లుట్లు స్థలం ఇచ్చి, వారి కళ్లముందే కొత్త ఇళ్ల కడతామన్నారు. ఈ ప్రకటన చేయగానే గ్రామంలోని బాధితులు హర్షం వ్యక్తంచేశారు. 


పంటపొలాల్లో ఇసుక మేటలు, కొట్టుకుపోయిన వాహనాల తదితర అంశాలపై వరద బాధితులను అడిగి సీఎం మరిన్ని వివరాలు తెలుసుకున్నారు. అలాగే వ్యవసాయ భూములు కొట్టుకుపోయినకారణంగా పనుల్లేని పరిస్థితిని నివారించడానికి ఉపాధిహామీ పథకం ద్వారా ప్రత్యామ్నాయాలపైనా గ్రామస్తులతో చర్చించారు. ఈ ఫీడ్‌ బ్యాక్‌ ఆధారంగా బాధితులను ఆదుకునేలా పులపత్తూరులోనే కీలక ప్రకటన చేశారు. 



ఆపదలో ఆదుకున్న యువకులకు అభినందన:

ఒక ఉత్పాతం వచ్చినా సరే... కుటుంబ సభ్యులతో పాటు సాటివారిని కాపాడిన పలువరు యువకులను సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ అభినందించారు. 

అన్నమయ్య కట్ట తెగగానే గ్రామంలోకి వరద ఎలా వచ్చిందీ గంధం శివప్రసాద్‌ ద్వారా సీఎం తెలుసుకున్నారు. కుటుంబంలోని 9 మందిలో 7గురిని కాపాడానని సీఎంకు వివరించారు. 6–9 నిమిషాలు పూర్తిగా అందరూ నీటిలో ఉండిపోయామని, ఆతర్వాత కొద్దిగా నీటిమట్టం తగ్గడంతో 7గురు బతికామని, మిగిలిన ఇద్దరు శ్వాస ఆడక మరణించారని ముఖ్యమంత్రికి వివరించాడు. 

వరదల్లో తల్లిదండ్రులను కోల్పోయిన సుజయ్, తల్లిని కోల్పోయిన అశోక్‌ అనే మరో యువకుడిని కూడా సీఎం పరామర్శించారు. 

కుటుంబ సభ్యులను కోల్పోయిన ఇలాంటి యువకులు, యువతులకు ఉద్యోగం, ఉపాధి కల్పనలపై చర్యలు తీసుకోవాలని సీఎం అధికారులను ఆదేశించారు. వారిపేర్లను నమోదు చేసుకోవాలని కలెక్టర్‌కు చెప్పారు. 


ఇద్దరు కుటుంబ సభ్యులను కోల్పోయినప్పటికీ, బాధితులను ఆదుకోవడంలో గ్రామ సర్పంచి బీం జగన్మోహన్‌రెడ్డి మంచి పనితీరు కనపరిచారంటూ గ్రామస్తులు సీఎంకు వివరించారు. సర్పంచిని ముఖ్యమంత్రి అభినందించారు. గ్రామంలో పర్యటిస్తున్నంత సేపూ సర్పంచినుంచి ఆయా కుటుంబాలకు సంబంధించి వివరాలను సీఎం తెలుసుకున్నారు. 


పులపత్తూరులో తనను కలిసిన, ఇటీవలే గుండె చికిత్స చేయించుకున్న ప్రతాప్‌రెడ్డి అనే వృద్ధిడికి ముఖ్యమంత్రి సహాయ నిధిద్వారా సహాయం అందించాలని సీఎం ఆదేశించారు. 

పులపత్తూరుకు సమీపంలోనే చింతలకోన అనే గ్రామం నుంచి కొంతమంది సీఎంను కలవడానికి వచ్చారు. సుమారు 60 ఇళ్లు ఉంటాయని, గత ప్రభుత్వం చంద్రబాబు హయాంలో అంగన్‌వాడీ కేంద్రాన్ని తొలగించారని సీఎంకు ఫిర్యాదు చేశారు. వెంటనే అక్కడ అంగన్‌వాడీ కేంద్రం ఏర్పాటుపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను సీఎం ఆదేశించారు. 


తాత్కాలిక పునరావాస కేంద్రాల వద్ద ఆశ్రయం పొందుతున్న వారిని ముఖ్యమంత్రి కలుసుకున్నారు. వారికి అందుతున్న సేవలను అడితి తెలుసుకున్నారు. భోజనం, ఆరోగ్యంకోసం తీసుకుంటున్న చర్యలపై అధికారులు వివిరించారు. గ్రామంలో వైద్య శిబిరాల ఏర్పాటుపై అక్కడ పనిచేస్తున ఏఎన్‌ంలనుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎలాంటి అంటు వ్యాధులు రాకుండా రానున్న రోజుల్లో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. తర్వాత వరద బాధితులను మరింతగా ఆదుకోవడానికి తీసుకుంటున్న చర్యలను సీఎం ... పులపత్తూరు సభలో సీఎం ప్రకటించారు. తర్వాత ముగ్గురు మహిళలకు 5 సెంట్ల ఇంటి స్థలం పట్టాలను పంపిణీచేశారు.


ఎంతోమందిని కాపాడిన సచివాలయ భవనం, పరిశీలించిన సీఎం:


పులపుత్తూరులో వరద సమయంలో ఎంతోమందిని కొత్తగా నిర్మించిన గ్రామ సచివాలయ భవనం కాపాడింది. భవనం మొదటి అంతస్తు వరకూ పూర్తిగా మునిగిపోయిందని అధికారులు వివరించారు. ఆనాటి ఘటనకు సాక్ష్యంగా.. నీరు ఎంతవరకూ వచ్చిందో తెలియజేస్తూ అక్కడ హైఫ్లడ్‌లెవల్‌ (హెచ్‌ఎఫ్‌ఎల్‌) మార్క్‌ వేశారు. దీన్ని సీఎంకు చూపిస్తూ అధికారులు వివరించారు. తర్వాత గ్రామ సచివాలయంలో పనిచేస్తున్న ఉద్యోగులను సీఎం కలుసుకున్నారు. అందిస్తున్న సేవలపై ఆరా తీశారు. వరద సహాయ కార్యక్రమలు, పరిహారం, ప్రయోజనాలపై ఆరాతీశారు. 


మందపల్లిలో బాధిత కుటుంబాలకు సీఎం పరామర్శ:


పులపత్తూరు తర్వాత నేరుగా మందపల్లి చేరుకున్నారు. మందపల్లిలో పూజారి కొర్రపాటి రామ్మూర్తి కుటుంబాన్ని పరామర్శించారు. ఆకుటుంబంలో మొత్తం 9 మంది వరదకారణంగా ప్రాణాలు కోల్పోయారు. అదే గ్రామంలో కుటుంబ సభ్యులను కోల్పోయిన ఈశ్వరయ్య, రమణలను సీఎం కలుసుకున్నారు. రెండు కాళ్లకు కట్లతోనే ఉన్న ఈశ్వరయ్యను సీఎం పరామర్శించారు. మందపల్లిలో మొత్తం 12 మంది ప్రాణాలు కోల్పోగా, ఇద్దరు గల్లంతయ్యారు. వారి ఆచూకీ ఇప్పటికీ తెలియలేదు. తమకు అందరికీ ప్రభుత్వం పరిహారం అందిందని కుటుంబ సభ్యులు సీఎంకు వివరించారు. భవిష్యత్తులో కూడా ఈ కుటుంబాలకు అండగా ఉంటానని సీఎం భరోసానిచ్చారు. తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. 


మందపల్లి నుంచి తిరుగు వస్తున్న సందర్భంలో దళితకాలనీ వాసులను సీఎం పలకించారు. అందుతున్న సహాయంపై ఆరాతీశారు. ఆతర్వాత నేరుగా జవహర్‌ నవోదయ విద్యాలయానికి చేరుకున్నారు. విద్యార్థినులు అందించిన చిత్రపటాన్ని సీఎం స్వీకరించారు.

Comments