నైపుణ్య పోటీలలో ఆంధ్రప్రదేశ్ యువత సత్తా : నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి.



*నైపుణ్య పోటీలలో ఆంధ్రప్రదేశ్ యువత సత్తా  : నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి*


31 విభాగాల్లో పాల్గొని 11 స్వర్ణాలతో గతం కన్నా ఘనమైన ప్రదర్శన


నైపుణ్యాభివృద్ధి శిక్షణ శాఖ,  ఏపీఎస్ఎస్డీసీకి అభినందనలు


అమరావతి, డిసెంబర్, 04 (ప్రజా అమరావతి); 

దక్షిణ భారత రాష్ట్రాల నైపుణ్య పోటీలలో ఆంధ్రప్రదేశ్ యువత సత్తా చాటడం పట్ల నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అభినందించారు. మొత్తం 51 విభాగాలకుగానూ 31 విభాగాల్లో మాత్రమే పాల్గొని 11 రంగాల్లో స్వర్ణాలు , మరో 8 విభాగాల్లో వెండి పురస్కారాలు సాధించడాన్ని ఆయన ప్రత్యేకంగా మెచ్చుకున్నారు. సైబర్ సెక్యూరిటీ, ఎలక్ట్రానిక్స్, మొబైల్ రోబోటిక్స్, ఐ.టీ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ డెవెలప్ మెంట్, మొబైల్ అప్లికేషన్ డెవెలప్ మెంట్ రంగాల్లో రాణించడం  శుభపరిణామం అన్నారు. వందలాది మంది యువతీయువకులు దక్షిణాది రాష్ట్రాల నుంచి  ఆతిథ్య ఆంధ్రప్రదేశ్ కు వచ్చి తమ ప్రదర్శనతో విజయం సాధించినందుకు మంత్రి గౌతమ్ రెడ్డి కంగ్రాట్స్ చెప్పారు. రాబోయే రోజుల్లో ఇదేవిధంగా జాతీయ స్థాయి నైపుణ్యం పోటీలకు సన్నద్ధమై మరిన్ని విజయాలు సాధించాలంటూ ఆల్ ది బెస్ట్ తెలిపారు. నాలుగు రోజులపాటు నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కు అన్ని విధాల సహకారం అందించి, నైపుణ్య పోటీలను ఏ ఇబ్బంది లేకుండా నిర్వహించడంలో కీలక పాత్ర పోషించిన ఏ పి ఎస్ ఎస్ డి సి ని మంత్రి మేకపాటి కొనియాడారు.



Comments