జంగారెడ్డిగూడెం ఏరియా ఆస్పత్రిలో క్షతగాత్రులను పరామర్శించిన ఉప ముఖ్యమంత్రి

 



జంగారెడ్డిగూడెం (ప్రజా అమరావతి); 


తాడువాయి దగ్గర ఆర్టీసీ బస్సు   జల్లేరు వాగులో బస్సు బోల్తా పడిన సంఘటన లో జంగారెడ్డిగూడెం ఏరియా ఆస్పత్రిలో క్షతగాత్రులను పరామర్శించిన ఉప ముఖ్యమంత్రి


, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ  ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్ (నాని).

   బుధవారం జంగారెడ్డిగూడెం మండలం జిల్లేరు  వాగు బ్రిడ్జి వద్ద  ఆర్టీసీ బస్సు ప్రమాదం సంభవించిన సంఘటనలో  47 మంది ప్రయాణికులు ఉన్నారని ,26 మంది గాయపడ్డారు వారందరికీ   చికిత్స చేయడం జరుగుతుందని చిన్న చిన్న గాయాలు తగిలిన వారికి చికిత్స చేసి ఇంటికి పంపించడం జరిగిందని తొమ్మిది మందికి తీవ్రగాయాలు  గాయాలు అయ్యాయని వారికి కి  వైద్య అధికారులు మెరుగైన చికిత్స అందించే విధంగా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి అన్నారు . అందులో ఇద్దరు ని ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించడం జరిగిందని ఆయన తెలిపారు . ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రి నుండి  సీనియర్ డాక్టర్లను రప్పించి ఇక్కడ వైద్య సేవలు అందించడం జరుగుతుందని ఆయన అన్నారు .తొమ్మిది మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోడం జరిగిందని  మంత్రి తెలిపారు.


బుధవారం ప్రమాదం జరిగిందని తెలియటం తో హుటాహుటిన సంఘటన ప్రాంతం తాడువాయి కి అధికారులు లు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.   అశ్వారావుపేట నుండి జంగారెడ్డిగూడెం వచ్చుచున్న ఏపీఎస్ ఆర్టీసీ బస్సు తాడవాయి వద్ద వాగులో బ్రిడ్జి పైనుంచి పడిందని  ప్రమాదం జరిగిన వెంటనే క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించడం జరుగుతుందని ఆయన తెలిపారు .ప్రమాదానికి కారణాలు తెలుసుకోవడానికి  జంగారెడ్డి గూడెం ఆర్డిఓ ఆధ్వర్యంలో విచారణ జరుగుతుందని  ఆయన తెలిపారు. బస్సులో ప్రాధమిక సమాచారం మేరకు 47 మంది ఉన్నారన్నారు.



 అధికారులు అందరూ సహాయ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని ఆయన తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ ఘటన పట్ల విచారం వ్యక్తం చేశారని, ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలకు రూ.5 లక్షలు చొప్పున పరిహారాన్ని ప్రకటించడం జరిగిందన్నారు. 

  మృతుల కుటుంబాలను ఆదుకోవడంతో పాటు, గాయపడిన వారికి మెరుగైనవైద్యం అందే విధంగా చర్యలు తీసుకో కావాలని అధికారులను ఆదేశించా మన్నారూ . ఈ కార్యక్రమంలో మంత్రి వెంట జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా  ,చింతలపూడి  శాసనసభ్యులు ఉన్న మట్ల ఎలిజా , పోలవరం శాసనసభ్యులు తెల్లం   బాలరాజు ,వైద్య ఆరోగ్య శాఖ అధికారులు , రెవెన్యూ అధికారులు,  ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

-------------------------


 దీ.15.12.2021 జంగారెడ్డిగూడెం.. తాడువాయి. జల్లేరువాగు లో పడిన బస్సు ప్రమాదంలో మృతులు


1. పొడపాటి దుర్గమ్మ 55

తాడువాయి జంగారెడ్డిగూడెం మండలం

2. ఆడమిల్లి జాన్ మోజెస్ 52

గంగవరం

3. శ్రీరాముల బాలమ్మ 45  తోటపల్లి

4. కేత వరలక్ష్మి మెట్టగూడెం ద్వారకాతిరుమల మండలం

5. ఉండ్రాజవరపు సరోజినీ 56 కొత్తపల్లి ద్వారకాతిరుమల మండలం

6. బోడుగు సత్యవతి 56 నంది గూడెం గోపాలపురం మండలం

7. సిహెచ్ చెన్నారావు 46 డ్రైవర్ సీతారామపురం పెదవేగి మండలం

8. ఏ మధు బాబు 57 చిన్నవారిగూడెం జంగారెడ్డి గూడెం మండలం

9.  సంగీత సోమరాజు. తూర్పు గోదావరి జిల్లా మాధవరాయుడు పాలెం వాసిగా గుర్తింపు


Comments