డిజిపి కార్యాలయం,
మంగళగిరి (ప్రజా అమరావతి);
ఆంధ్ర ప్రదేశ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ శ్రీ గౌతం సవాంగ్ IPS ను కలసిన మహిళా పోలీసుల సభ్యుల బృందం.
తమను ఆంధ్ర ప్రదేశ్ పోలీస్ శాఖలోనే కొనసాగించాలని, కొంత మంది అవగాహన లోపంతో అనాలోచితంగా చేసిన దుష్పచారం వల్ల 15000 మంది మహిళా పోలీసుల ఉద్యోగాలు ఊగిసలాడుతున్నాయి.. ఎవరో కొందరి స్వార్థపూరిత చర్యలకు అందరినీ బాధ్యులని చేయవద్దని వారు వినతి పత్రం లో పేర్కొన్నారు.
డిజిపి గారి కామెంట్
మహిళా పోలీసులు పోలీసు శాఖలోనే కొనసాగుతారు. వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. జీఓ నెంబర్ 59 ను ఉపసంహరించుకోవడం జరగలేదు, దీనిపై ప్రభుత్వం మరింత పటిష్టమైన, స్పష్టమైన, సమగ్రంవంతమైన పరిపూర్ణతతో కూడిన విషయాలతో మహిళా పోలీసు వ్యస్థతో ముందుకు వస్తుందని, ప్రస్తుతం ప్రజలకు వారు అందింస్తున్న సేవలను మరింత అంకిత భావం తో ముందుకు వెళ్లాలని మహిళా పోలీసుల బృందం సభ్యులకు డిజిపి గారు స్పష్టం చేయడం జరిగింది.
addComments
Post a Comment