అన్నదాతల హెూదాకు చిహ్నం ఒంగోలు గిత్తలు- నాణ్యమైన పశు సంపదగా ఒంగోలు జాతికి ప్రపంచస్థాయి గుర్తింపు 

- అన్నదాతల హెూదాకు చిహ్నం ఒంగోలు గిత్తలు 


- మంత్రి కొడాలి నాని సోదరుడు కొడాలి చిన్ని 

- న్యాయ నిర్ణేతలు సాంబిరెడ్డి, సుబ్బారావులకు సన్మానం పశు పోషకులకు మెమెంటోల బహుకరణ గుడివాడ, జనవరి 13 (ప్రజా అమరావతి): నాణ్యమైన పశు సంపదగా ఒంగోలు జాతికి ప్రపంచస్థాయి గుర్తింపు ఉందని రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) సోదరుడు కొడాలి నాగేశ్వరరావు (చిన్ని) చెప్పారు. గురువారం కృష్ణాజిల్లా గుడివాడ పట్టణం లింగవరం రోడ్డులోని కే కన్వెన్షన్లో ఎన్టీఆర్ టూ వైఎస్సార్ ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరుగుతున్న జాతీయస్థాయి ఒంగోలు జాతి ఎడ్ల బండలాగుడు ప్రదర్శన పోటీలను కొడాలి నాగేశ్వరరావు (చిన్ని) పర్యవేక్షించారు. ఈ సందర్భంగా న్యాయ నిర్ణేతలుగా వ్యవహరిస్తున్న వింతా సాంబిరెడ్డి, కనపర్తి సుబ్బారావులను శాలువాలతో ఘనంగా సన్మానించారు. జ్ఞాపికలను బహుకరించారు. పోటీల్లో పాల్గొనే ఎడ్ల జతల యజమానులకు ప్రోత్సాహకంగా మెమెంటోలను అందజేశారు. అనంతరం కొడాలి నాగేశ్వరరావు (చిన్ని) మాట్లాడుతూ నడకలో రాజఠీవి, కొండలనైనా కదిలించగల బలం ఒంగోలు జాతి గిత్తల సొంతమని అన్నారు. ఈ జాతి పశువులు పౌరుషానికి ప్రతీకగా ఉంటాయన్నారు. ప్రస్తుతం ఒంగోలు జాతి పశువుల ఉనికి ప్రశ్నార్ధకంగా మారిందన్నారు. ఒంగోలు జాతి గిత్త నడిచి వస్తుంటే ఆ రైతు ఆనందానికి పట్టపగ్గాలు ఉండవన్నారు. రైతు ప్రతిష్ఠకు, అన్నదాతల హెూదాకు ఒంగోలు జాతి పశువులు చిహ్నంగా నిలుస్తుంటాయన్నారు. ఒంగోలు జాతి పశుపోషణ భారం కావడంతో వీటి సంఖ్య తగ్గుతూ వస్తోందన్నారు. ఆకారం, కొమ్ములతో విలక్షణంగా ఉంటాయని, ఈ కారణంగా ఇతర జాతి పశువుల నుండి ఒంగోలు జాతి పశువులను తేలికగా గుర్తించవచ్చన్నారు. వీటి కొమ్ములు కురచగా, మూడు నుండి ఆరు అంగుళాల పొడవుతో బయట వైపునకు ఉంటాయన్నారు. విశాలమైన కాళ్ళు, చిన్న ముఖం, వెడల్పాటి నుదురు, పెద్ద చెవులు, పెద్ద గంగుడోలు కల్గివుంటాయన్నారు. నడిచేటపుడు అటూ ఇటూ ఒరిగిపోతూ ఉండే అందమైన గోపురం, చక్కటి మచ్చిక గుణం కల్గివుండడం వల్ల వీటికి ముక్కుతాడు వేయడం అరుదుగా జరుగుతుంటుందన్నారు. లాగుడు శక్తి ఇతర జాతి ఎద్దుల కన్నా ఎక్కువగా ఉంటుందన్నారు. సుమారు 2 వేల పౌండ్ల వరకు బరువు అవలీలగా లాగగలవన్నారు. వ్యవసాయ క్షేత్రాల్లో అలుపెరగని విధంగా దుక్కులు దున్నుతాయన్నారు. ఎటువంటి వాతావరణ పరిస్థితులనైనా ఒంగోలు జాతి పశువులు తట్టుకుంటాయన్నారు. దాదాపు 5 కిలోమీటర్ల దూరాన్ని కూడా సునాయాసంగా నడవగల్గుతాయన్నారు. యజమానుల పట్ల విధేయత, విశ్వాసాలను కల్గివుంటాయన్నారు. రైతుకు ఉపయోగపడే ఈ ఒంగోలు జాతి పశువులను పెంచితే ప్రజల్లోకి తీసుకువెళ్ళి వీటిని చూపించాలనే తాపత్రయంతో పశు పోషకులు పలు ప్రాంతాల్లో నిర్వహించే పోటీలకు తమ ఎడ్లను తీసుకువస్తుంటారన్నారు. ఒంగోలు జాతి వైభవాన్ని పెంచడమే లక్ష్యంగా తాను, తన సోదరుడు కొడాలి నాని పనిచేస్తున్నట్టు కొడాలి నాగేశ్వరరావు (చిన్ని) చెప్పారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నేత దుక్కిపాటి శశిభూషణ్, మున్సిపల్ మాజీ వైస్చర్మన్ అడపా బాబ్జి, వైసీపీ పట్టణ అధ్యక్షుడు గొర్ల శ్రీను, ఎన్టీఆర్ స్టేడియం కమిటీ ఉపాధ్యక్షుడు పాలేటి చంటి, గుడివాడ ప్రభుత్వాసుపత్రి అభివృద్ధి సంఘం చైర్మన్ ఎంవీ నారాయణరెడ్డి, ఎంపీపీలు పెయ్యల ఆదాం, గద్దె పుష్పరాణి, జడ్పీటీసీ సభ్యుడు గోళ్ళ రామకృష్ణ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రూరల్ మండల అధ్యక్షుడు మట్టా జాన్ విక్టర్, నాయకులు వల్లూరుపల్లి సుధాకర్, కసుకుర్తి బాబ్జి, పాలడుగు రాంప్రసాద్, గాదిరెడ్డి రామలింగారెడ్డి, మేకల సత్యనారాయణ, కొంకితల ఆంజనేయప్రసాద్, గిరిబాబాయ్, మూడెడ్ల ఉమా, దారం ఏడుకొండలు, చింతల భాస్కరరావు, వెంపటి సైమన్, దారం నరసింహా, కొలుసు నరేంద్ర, రేమల్లి పసి, ఆర్వీఎల్ నరసింహారావు, షేక్ సయ్యద్, యార్లగడ్డ సత్యభూషణ్, చుండి బాబి, పెద్ది కిషోర్, పొట్లూరి మురళీధర్, తోట రాజేష్, లోయ రాజేష్, ఎస్కే బాజీ, అలీబేగ్, చింతాడ నాగూర్, చిన్ని దుర్గాప్రసాద్, మాదాసు వెంకటలక్ష్మి, గంటా చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

Popular posts
దేవాలయాల అభివృద్ధికి కృషి చేస్తున్న మంత్రి కొడాలి నాని
Image
ముఖ్యమంత్రి హెూదాలో పక్కనే కూర్చోబెట్టుకుని భోజనం పెట్టిన వైఎస్సార్ ను ఎలా మర్చిపోగలం
Image
ప్రజల గుండెల్లో చురస్మరణీయమైన స్థానం పొందిన వ్యక్తి నారా లోకేష్
Image
ఎన్టీఆర్ అభిమానిగా సీఎం జగన్మోహనరెడ్డికి పాదాభివందనం చేస్తున్నా
Image
మెడల్ హౌస్.... - రూ. 3.24 లక్షల్లోనే డబుల్ బెడ్‌రూం ఇల్లు - 15 రోజుల్లో పదిమంది కూలీలతో నిర్మాణం - కరీంనగర్‌లో యువబిల్డర్ ప్రయోగం సక్సెస్ ఇల్లు కట్టి చూడు.. పెళ్లి చేసి చూడు అన్నారు పెద్దలు. ఈ రెండు పనులూ కష్టసాధ్యమనే ఉద్దేశంతోనే అలా చెప్పారు. ఇప్పుడు రోజులు మారాయి. అంతా రెడీమేడ్ యుగం. కేవలం పదిహేను రోజుల్లోనే డబుల్ బెడ్ రూం ఇల్లు నిర్మించవచ్చు! మీరు విన్నది నిజమే. కరీంనగర్ శివారు బొమ్మకల్ బైపాస్ సమీపంలో నిర్మించిన ఈ ఇంటిని చూస్తే మాత్రం ఇల్లు కట్టడం ఇంత సులభమా? అనిపించకమానదు. అతితక్కువ ఖర్చుతో రెండు పడకగదులున్న పక్కాభవంతిని కట్టి చూపించాడు కరీంనగర్‌కు చెందిన యువబిల్డర్ పేరాల కృష్ణారావు. వాల్యూ కన్‌స్ట్రక్షన్స్ నిర్మాణ సంస్థ ఎండీగా ఉన్న ఈయన, కేవలం పదిమంది కూలీలతో 15 రోజుల్లో రూ.3.24 లక్షల తో ఈ ఇంటిని నిర్మించారు. దీనికి మోడల్ హౌస్ అని నామకరణం కూడా చేసేశారు. డిజైన్‌లో మార్పులు చేస్తే కేవలం రూ.3 లక్షల్లో నిర్మించి ఇవ్వవచ్చని చెప్తున్నారు. ఇదీ ఇంటి ప్లాన్: 128 చదరపు గజాల(1155 చదరపు అడుగుల) స్థలంలో 510 చదరపు అడుగుల ప్లింత్ ఏరియా (కింది విస్తీర్ణం), 815 చదరపు అడుగుల స్లాబ్ ఏరియా(పైన స్లాబ్ విస్తీర్ణం)తో ఇల్లు ఉంటుంది. మెట్లు పోను 10 ఫీట్లు, ఇంటిపక్కన 8 ఫీట్లు ఖాళీ స్థలం మిగులుతుంది. నిర్మాణం ఇలా: మొదట కందకం తీసి, బేస్‌మెంట్ నిర్మించారు. పిల్లర్లు, గోడలు, స్లాబ్ కోసం ఒకరోజులో అల్యూమినియం ఫ్రేమ్‌లు బిగించారు. తలుపులు, కిటికీలు అమర్చా రు. మరోరోజు రాడ్లు నిలిపి, అల్లారు. మరుసటి రోజు రెడీమిక్స్‌తో కాంక్రీట్ నింపారు. తర్వాత అల్యూమీనియం ఫ్రేం లను తొలగించి, నాలుగు నుంచి ఐదురోజులు క్యూరింగ్ చేశా రు. ఈ ఇంటికి ప్లాస్టరింగ్ అవసరం ఉండదు. అందుకే కొద్ది గా లప్పం కోటింగ్ చేసి, మిషన్ ద్వారా ఒకేరోజు కలర్ కూడా వేసేయొచ్చు. మిగిలిన రోజులు చిల్లరపనులకు పోతుంది. ఖర్చు పెట్టారిలా: గోడలు, స్లాబ్‌కు 33 క్యూబిక్‌మీటర్ల కాం క్రీట్ మిక్స్ (రెడీమిక్స్) సరిపోయింది. క్యూబిక్‌మీటర్‌కు రూ.2800చొప్పున రూ.84వేల ఖర్చు వచ్చింది. రెండు టన్నుల రాడ్‌కు రూ.85వేలు. నాలుగు తలుపులు, కిటికీలకు రూ.25వేలు. మేస్త్రీ, కూలీలకు రూ.60వేలు. కరెంట్ ఖర్చు రూ.15వేలు, ప్లంబర్ చార్జి రూ.15వేలు. మొత్తం రూ.3.24 లక్షలు. ధరలు పెరిగినా, డిజైన్‌లో మార్పు ఉన్నా ధరల్లో కొం త వ్యత్యాసం ఉండవచ్చు. ఎలివేషన్(ఇంటి ముందు భాగపు డిజైన్) మారిస్తే మరో రూ.60వేలు అదనపు ఖర్చు ఉంటుం ది. ఒకేసారి ఎక్కువ సంఖ్యలో ఇళ్లు నిర్మిస్తే ఖర్చు తగ్గడంతోపాటు సమయం కూడా ఆదా అవుతుంది. చైనా, జర్మనీల్లో చూసి ప్లాన్‌చేశారు పేరాల కృష్ణారావు, ఎండీ, వాల్యూ కన్‌స్ట్రక్షన్స్ ఇంటి నిర్మాణానికి మనం పెట్టే ఖర్చు ప్రపంచంలో ఎక్కడా పెట్టరు. తక్కువ ఖర్చుతో ఇల్లు ఎలా నిర్మించవచ్చో తెలుసుకునేందుకు చైనా, జర్మనీ, అమెరికాలో పర్యటించారు. చైనా, జర్మనీల్లో కాంక్రీట్ గోడలు, రోబోసాండ్‌తో ఇండ్లను నిర్మిస్తున్నారు. ఇది నాకు నచ్చింది. పేద ప్రజల కలను నిజం చేసేందుకు ఈ విధానం సరిపోతుంది. అందుకే ఈ ఇంటిని కట్టి మోడల్ హౌస్ అని పేరుపెట్టారు
Image