*" రైతు భరోసాను ప్రారంభించిన కాకాణి
"*
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా (ప్రజా అమరావతి), సర్వేపల్లి నియోజకవర్గం, వెంకటాచలం మండలంలో "వై.యస్.ఆర్.రైతు భరోసా" కార్యక్రమంలో పాల్గొని, "వై.యస్.ఆర్.రైతు భరోసా" చెక్కును ప్రదర్శించి, నూతన మంజూరైన పెన్షన్లను పంపిణీ చేసి, రూ.2,500/-లకు పెంచిన పెన్షన్లను స్వయానా లబ్ధిదారుల ఇంటికి వెళ్లి, పంపిణీ చేసిన వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, సర్వేపల్లి శాసనసభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి .
జగన్మోహన్ రెడ్డి గారు *"వై.యస్.ఆర్. రైతు భరోసా"* మూడో విడత నిధులు జమ చేయడంతో వరుసగా మూడు సంవత్సరాల కాలం పాటు, ఏడాదికి రూ.13,500/-లు రైతుల ఖాతాల్లో జమయ్యాయి.
చంద్రబాబు రుణమాఫీ పేరిట రైతులను మోసం చేస్తే, జగన్మోహన్ రెడ్డి గారు 4 విడతల్లో రూ.50,000/-లు ఇస్తానని వాగ్ధానం చేసి, *"చెప్పిన దానికన్న మిన్నగా"* 5 విడతల్లో 67,500/-లు రైతులకు అందిస్తున్నారు.
భారత దేశంలో ఎక్కడా లేని విధంగా, అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్న ప్రభుత్వం, మన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం.
సర్వేపల్లి నియోజకవర్గంలో రైతాంగానికి అన్ని విధాలా అండగా నిలిచి, ఎక్కడ ఎటువంటి సమస్య రాకుండా చర్యలు తీసుకుంటాం.
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పెన్షన్ ను 2,500/- రూపాయలు పెంచడంతో, లబ్ధిదారులలో ఆనందం వెల్లివిరుస్తుంది.
సర్వేపల్లి నియోజకవర్గంలో నూతనంగా 878 పెన్షన్లు మంజూరు చేశాం.
జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట ప్రకారం ప్రజలకు నూతన సంవత్సర కానుకగా పెన్షన్ పెంపును అమలు చేస్తూ, రూ.2,500/-లు అందిస్తున్నారు.
తెలుగుదేశం హయాంలో జన్మభూమి కమిటీల జోక్యంతో అర్హులకు పెన్షన్లు అందకుండా పోయాయి.
జగనన్న ప్రభుత్వంలో పార్టీలకతీతంగా ఎప్పటికప్పుడు అర్హులందరికీ నూతన పెన్షన్లు మంజూరు చేస్తున్నాం.
సర్వేపల్లి నియోజకవర్గంలో అర్హులైన వారు ఎవారికైనా, *"వై.యస్.ఆర్. రైతు భరోసా"*, *"వై.యస్.ఆర్. పెన్షన్ కానుక"* రాకపోతే పరిశీలించి, మంజూరు చేయించి, తప్పనిసరిగా అందిస్తాం.
addComments
Post a Comment